సెయింట్ మేరీస్ గెలుపు | st maris beats international scholl by 10 wickets in division one day league | Sakshi
Sakshi News home page

సెయింట్ మేరీస్ గెలుపు

Published Thu, Nov 3 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

st maris beats international scholl by 10 wickets in division one day league

 సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో  సెయింట్ మేరీస్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మేరీస్ బౌలర్ గోపి రెడ్డి (5/15) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ 15.3 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ రెహమాన్ (17) టాప్ స్కోరర్. జట్టులో ఆరుగురు డకౌట్ కావడం విశేషం. అనంతరం 47 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సెరుుంట్ మేరీస్ జట్టు 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసి గెలిచింది. అస్కారి (10 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement