సాక్షి,సంగారెడ్డిజిల్లా: హెచ్‌ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం(సెప్టెంబర్3) సంగారెడ్డిజిల్లా అమీన్‌పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్‌పూర్‌లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ తండాలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం సర్వే నెంబర్ 462లోని అక్కడి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటల భూమి ఆక్రమించి స్కూల్ గదులు, ప్రహరీని హైడ్రా కూల్చివేసింది.
Comments
Please login to add a commentAdd a comment