International School
-
షారూఖ్ తనయుడితో ఆరాధ్య స్టేజ్ షో.. ఎంత క్యూట్‌గా ఉన్నారో! (ఫోటోలు)
-
ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో మరియు బ్రోచర్ ప్రారంభం
-
స్కూల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,సంగారెడ్డిజిల్లా: హెచ్ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం(సెప్టెంబర్3) సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండా, అమీన్పూర్లో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఐలాపూర్ తండాలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలు, సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం సర్వే నెంబర్ 462లోని అక్కడి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఆక్రమణలు కూల్చివేశారు. 15 గుంటల భూమి ఆక్రమించి స్కూల్ గదులు, ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. -
చదువుకు షాన్ దార్!
ఎండాకాలం సెలవుల తర్వాత స్కూల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు మళ్లీ బిజీ బిజీ అయిపోయారు. విద్యార్థుల్ని పాఠశాలలకు తీసుకెళ్లే వాహనాలతో ఉదయం వేళ రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేది పాఠశాలే కదా..అందుకే కొత్తగా పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అందుబాటులో ఉన్న స్కూళ్లలో వసతులు, బోధన సౌకర్యాలు ఇతరత్రా అన్నీ పరిశీలించి పిల్లలను చేర్పిస్తుంటారు.అయితే హైదరాబాద్‌లో అన్ని రకాల స్కూళ్లూ ఉన్నాయి. వీటిల్లో ఆ స్కూలు స్థాయిని బట్టి ఫీజుల్లో అంతరం, సిలబస్‌లో తేడా ఉంటుండగా.. వివిధ రకాల ప్రత్యేకతలతో యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో వేల సంఖ్యలో స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్స్‌లో స్టేట్ సిలబస్.. కొన్నింటిలో సీబీఎస్ఈ, మరికొన్నింటిలో ఐసీఎస్ఈ సిలబస్ చెబుతుంటారు. ఇక అంతర్జాతీయ పాఠశాలలు పరిగణించే కొన్ని స్కూళ్లు కూడా నగరంలో ఉన్నాయి. అలాంటి పాఠశాలలు ఏవి? ఎలాంటి వసతులు అందిస్తున్నాయి? నిజంగానే అంతర్జాతీయ స్థాయి విద్య, బోధన ఉందా?, ఫీజుల మాటేమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ..సాక్షి, హైదరాబాద్..అంతర్జాతీయ సిలబస్..విద్యా బోధన, వసతులు, ప్రత్యేకతల్లో కొత్త పుంతలు తొక్కుతూ కార్పొరేట్ స్థాయి స్కూల్స్ అనేకం నగరంలో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులతో హైదరాబాద్‌లో అనేక స్కూళ్లు వెలిశాయి. సీబీఎస్ఈతో పాటు ఇంటర్నేషనల్ బాకలరేట్ (ఐబీ), ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ), కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (సీఐఈ), బ్రిటిష్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ బాకలరేట్ ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఐబీ పీవైపీ), కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ (సీఐఎస్) తదితర సిలబస్‌ల పేరిట తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) వంటి సంస్థలతో, విదేశాల్లోని పాఠశాలలతో అను సంధానమై.. అక్కడి విద్యార్థులతో నేరుగా మాట్లాడేలా, చదువులో వారి అనుభవాలను ఇక్కడి విద్యార్థులతో పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. తద్వారా విద్యార్థుల్లో చదువుపై ఉన్న అవగాహనలో మార్పు వచ్చేలా, అంతర్జాతీయ స్థాయి ఆలోచనా విధానం అలవడేలా కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.వసతులు ఎలా ఉంటాయి? దాదాపుగా అన్ని పాఠశాలలు సమాన స్థాయిలో వసతులు అందిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్ట్ స్టూడియోలు, లాంగ్వేజ్ ల్యాబ్స్, డ్యాన్స్, మ్యూజిక్ రూమ్స్, విశాలమైన ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, ఆంఫీ థియేటర్, డైనింగ్ హాల్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉంటున్నాయి. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో కళా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తు న్నారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్‌తో పాటు క్రీడల్లోనూ తర్ఫీదునిస్తున్నారు. దాదాపు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సువిశాలమైన ప్రాంగణాల్లో వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఓ స్కూల్ యాజమాన్యం తెలిపింది. మానసిక ఎదుగుదల కోసం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపుగా అన్ని స్కూళ్లు 100 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నాయి. చెట్లు, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.బోధన ఎలా?విద్యార్థులకు పుస్తకాలే ప్రపంచం అనేలా కాకుండా వినూత్నమైన బోధనా పద్ధతులు అవలంభిస్తున్నారు. వివిధ రకాల సిలబస్‌ల్లో శిక్షణ పొందిన నిష్ణాతులైన టీచర్లను యాజమాన్యాలు నియమించుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో విద్యార్థులకు ఎలాంటి బోధన అందిస్తున్నారో పరిశోధనలు చేసి అలాంటి పద్ధతులను ఇక్కడ అనుసరిస్తున్నారు. బొమ్మల రూపాల్లో, కళాత్మక రూపాల్లో పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారు.కామన్ గ్రౌండ్ కొలాబరేటివ్ మెథడాలజీ విధానంలో పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా చెబుతున్నారు. దీంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఓ నిర్వాహకుడు చెప్పారు. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లు విదేశీ టీచర్లను సైతం నియమిస్తున్నాయి. ఇక్కడి బోధనా పద్ధతులు నచ్చి విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ చేరుతుండటం గమనార్హం.పిల్లల్ని చేర్పించాలంటే..⇒ ముందుగా పాఠశాల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్ టూర్ ఏర్పాటు చేస్తారు. స్కూల్లో ఉన్న వసతులు చూసుకున్నాక నచ్చితే ఫీజు, కర్రిక్యులమ్, లొకేషన్, రవాణా సదుపాయాలు వంటి వివరాలను అడ్మిషన్ అధికారితో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫారం లింక్ పంపిస్తారు.అందులో మీ పిల్లల పూర్తి వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలను అడ్మిషన్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్లు మీ వివరాల విషయంలో సంతృప్తి చెందితే సమాచారం పంపిస్తారు. ఆ తర్వాత టర్మ్ ఫీజు చెల్లించి సీటు పొందాలి. అయితే కొన్ని పాఠశాలల్లో ఎంట్రన్స్ పరీక్ష కూడా ఉంటుంది. అందులో మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది.ఫీజుల మాటేమిటి? ఇంటర్నేషనల్ స్కూల్స్ కాబట్టి ఫీజులు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ప్రీ నర్సరీకే ఏడాదికి కనీసం రూ.3.2 లక్షల ఫీజు ఉంది. ఇక సీబీఎస్ఈ సిలబస్ అయితే ఒకలా.. ఐబీ ప్రోగ్రామ్ అయితే మరోలా ఫీజులు ఉన్నాయి. 12వ తరగతికి కనీసం రూ.10.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకు ఉంది. టాప్ స్కూల్స్ ఇవే.. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆగాఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్, మ్యాన్చెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్, గాడిమయ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, మెరు ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి టాప్ స్కూల్స్ జాబితాలో ఉన్నాయి.చదువుతో పాటు నైపుణ్యాల పెంపుదలవిద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించేందుకు చాలా కృషి చేస్తున్నాం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం. మేం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌లో బోధిస్తున్నాం. బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత స్కూళ్లతో అనుసంధానమై అక్కడి బోధనా పద్ధతులను అనుసరిస్తున్నాం. చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంపొందించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – కందాడి కొండల్‌రెడ్డి, మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్‌గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్‌ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్‌గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్‌లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్‌తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్‌ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
వీడియో వైరల్.. పాఠాలు చెబుతున్న రోబో టీచర్ .. ప్రపంచంలోనే తొలిసారి..
బెంగుళూరు: బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధిస్తారు. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ ఖచ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని తప్పులు చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు కృత్రిమమేధస్సు నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి ఖచ్చితమైన సమాధానాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛరైపోనక్కరలేదంటున్నారు. దీనికి సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని చెబుతున్నారు. బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet 7 inch ROBOT teaches Physics,Maths, Biology & Chemistry.This AI Robot teacher is First of it's kind in the world.The Precision is 100% & no margin for error. pic.twitter.com/WNPkTPb3m2 — SHAFAAT SHAH (@INFANTRY28) February 27, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి -
బంజారాహిల్స్ పాఠశాలలో దారుణం.. విద్యార్థికి కరెంట్ షాక్..
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలలో ఆడుకుంటున్న ఇంటర్ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. మెరీడియన్ స్కూల్లో హస్సన్ అనే విద్యార్థి పదకొండవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో పిల్లలందరు అటలాడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీని తగిలాడు పిల్లాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. 45 నుంచి 50 శాతం వరకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీ చేశామని పేర్కొన్నారు . ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్‌మానేర్‌లో దూకిన తల్లి -
ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో.. నాలుక్కరుచుకోవడం ఖాయం!
బాలా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అవన్ ఇవన్ (తెలుగులో వాడు వీడు)లో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఆఫ్‌బీట్ సాంగ్ ‘హే...డియో డియో డోలే’ పాట వినిస్తే పాదాలు ‘కమాన్ డ్యాన్స్’ అంటాయి. తిరుచిరాపల్లి(తమిళనాడు) కేంబ్రిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో కెల్లా హైలెట్‌గా నిలిచింది ముగ్గురు పిల్లల డ్యాన్స్. జడలో మల్లెలు తురుముకొని, సంప్రదాయ చీరెలు ధరించి ‘హే...డియో డియో డోలే’ పాటకు ముగ్గురు పిల్లలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ బాలికలు నృత్యం ఎంత చక్కగా చేశారో’ అని ఆ వీడియోను చూసి ప్రశంసించిన వారు నాలుక కరుచు కోవడానికి అట్టే టైమ్ పట్టలేదు. నిజానికి వారు బాలికలు కాదు బాలురు! View this post on Instagram A post shared by M.P. Dhasvanth (@m.p.dhasvanth) View this post on Instagram A post shared by Tamil Animals Life (Animals Lovely Page) (@tamilanimalsloop) -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్‌క్లాస్‌లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
సెయింట్ మేరీస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మేరీస్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మేరీస్ బౌలర్ గోపి రెడ్డి (5/15) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ 15.3 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ రెహమాన్ (17) టాప్ స్కోరర్. జట్టులో ఆరుగురు డకౌట్ కావడం విశేషం. అనంతరం 47 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సెరుుంట్ మేరీస్ జట్టు 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసి గెలిచింది. అస్కారి (10 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. -
ఇంటర్నేషనల్ స్కూలు కలేనా..?
నాలుగు నెలలుగా ఒక్క సంస్థా ముందుకు రాని వైనం చంద్రశేఖరపురం(కొడవలూరు): చంద్రశేఖరపురంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు కథ కంచికి చేరినట్లేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి పెయ్యలపాలెం రోడ్డులోని 16.06 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ఏడాది ఆగస్టులో ఇంటర్నేషనల్ స్కూలు కోసం ప్రతిపాదించారు. ఇది ఇంటర్నేషన్ స్కూలుకు అనువైనదని రాష్ట్ర అధికారులు కూడా నిర్ధారించారు. స్కూలు ఏర్పాటవుతుందని ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సమీప గ్రామాలవారు కూడా సంతోషించారు. అయితే ఇప్పటి దాకా ఒక్క సంస్థ మాత్రమే స్కూలు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి విముఖత వ్యక్తం చేసింది. ఆ తరువాత నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క సంస్థ కూడా స్థలాన్ని పరిశీలించకపోవడంతో స్కూలు కథ కంచికి చేరిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కూల్ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందని నిర్ధారణ ఈ స్థలాన్ని గతేడాది ఆగస్టులో స్కూలుకు ప్రతిపాదించాక అదే నెలలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎం.విజయసునీత స్థలాన్ని పరిశీలించి ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రదిపాదిత స్థలం అనువుగా ఉందని నిర్ధారించారు. ఆ తరువాత వివిధ ఇంటర్నేషనల్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. అందులో భాగంగా ఈ స్థలాన్ని వివిధ సంస్థలు చూడడం జరిగింది. స్థలాన్ని పలు సంస్థలు పరిశీలిస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశలు స్థానికుల్లోనూ చిగురించాయి. అయితే ఏ సంస్థ కూడా స్కూలు ఏర్పాటుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 24న ర్యాన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఆపరేషన్స్ అ«ధికారి శ్రీనివాసన్ ఈ స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన ఆయన నెల్లూరు నగరానికి సుమారు 20 కిమీ దూరంలో స్థలం ఉన్నందున ఇంటర్నేషనల్ స్కూలు నిర్మించడం కష్టమనే అభిప్రాయాన్ని రెవెన్యూ అధికారుల వద్ద వ్యక్తం చేశారు. దీంతో స్కూలు ప్రతిపాదన మరుగుపడినట్లైంది. సమీప గ్రామాల వారిలో నిరాసక్తత నెలకొంది. స్కూలు ఏర్పాటు ఖరారు కాలేదు: ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రతిపాదించిన స్థలాన్ని ఇప్పటికే వివిధ సంస్థలు పరిశీలించాయి. అయితే వారు స్కూలు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ స్కూలు ప్రతిపాదిత స్థలం స్కూలు ఏర్పాటుకు అన్ని విధాలా అనువుగా ఉన్నందున వేచి చూడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
అమ్మో...జూన్!
సామాన్యుల బడ్జెట్ రూ.550 కోట్లు పెరిగిన స్కూల్ ఫీజులు కార్పొ‘రేట్’ స్కూళ్లలో భారీగా వసూళ్లు కానరాని విద్యా హక్కు చట్టం మధ్య తరగతి కుటుంబానికి చెందిన భానుచందర్ తమ పాపను చేర్పించేందుకు ఎల్బీనగర్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లాడు. అక్కడ వారు చెప్పిన మొత్తాన్ని విని ఆయన అవాక్కయ్యాడు. నర్సరీకి దాదాపు లక్ష రూపాయలట. డొనేషన్ సుమారు రూ.40 వేలు, ట్యూషన్ ఫీజు రూ.40 వేలు, యూనిఫాం, టై, బెల్ట్, షూలకు రూ. 4 వేలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌కు రూ. 3 వేలు, ట్రాన్స్పోర్ట్కు రూ.12 వేలు.. ఇలా పేపర్‌పై లెక్కలు వేసి ఆయన ముందుంచారు. దీన్ని చూసిన ఆయన గుండె గుభేలుమంది. ఆ ఒక్క చోటనేకాదు... పేరొందిన అనేక కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు ఇదే పరిస్థితి. సెంట్రల్, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే పాఠశాలల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకుంటున్నారు. చదువుల వ్యాపారానికి... తల్లిదండ్రులపై పడుతున్న భారానికి ఇది ఓ మచ్చుతునక. సాక్షి, సిటీబ్యూరో: జూన్...ఈ నెల పేరు తలచుకుంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యేది... తమ బడ్జెట్ బండిపై భారం మోపేదీ ఈ నెలే. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు.. స్కూల్ ఫీజులు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇది సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాల వారికి పెనుభారమవుతోంది. నగరంలో దాదాపు 4 వేల స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం అనేక ప్రైవేటు స్కూళ్లు దాదాపు 80-100 శాతం వరకు పెంచాయి. తాజాగా కొన్ని స్కూళ్లు 10 నుంచి 20 శాతం వరకు పెంచినట్లు సమాచారం. మరికొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచకపోయినా.. డొనేషన్ పేరుతో బాగానే వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ స్థాయిలో వసతులు కల్పిస్తున్నారా? అంటే... లేదు. కొరవడిన నియంత్రణ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరానికి అర్బన్ ఏరియాలో 8-10 తరగతి విద్యార్థులకు రూ.12 వేలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు రూ.9 వేల కంటే అదనంగా వసూలు చేయకూడదు. ఒక వేళ అంతకు మించి వసూలు చేస్తే.. ఆ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, విద్యా బోధన తదితర అంశాలపై డీఎఫ్‌ఆర్‌సీకి నివేదిక ఇవ్వాలి. డీఎఫ్ఆర్సీ ఆమోదం తెలిపితే ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచి రాబట్టవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకమేనని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు భావించాయి. ఆ జీఓను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా... 2014 జూన్‌లో స్టే విధించింది. దీంతో ఫీజు చెల్లింపుల విషయంలో నియంత్రణ కొరవడింది. ఫలితంగా ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. కాగితాలపైనే... ఫీజులు తీసుకోవడంలో పోటీ పడుతున్న స్కూళ్లు.. సౌకర్యాల కల్పన, నిబంధనల పాటింపు, విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో పూర్తిగా విఫలమవుతున్నాయి. నగరంలో ఒక్క పాఠశాల కూడా విద్యా హక్కు చట్టం మేరకు నడుచుకుంటున్న దాఖలాలు లేవు.ఆర్టీఈ ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి. ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం విద్యార్థులకు ఉచితంగా చదువు చెబితే తాము పాఠశాలలు మూసుకోవాల్సిందేనని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే పేద పిల్లలకు బోధిస్తామని వారు చెబుతుండగా.. ఆ ప్రసక్తే లేదని సర్కారు అంటోంది. బడ్జెట్ రూ. 550 కోట్లు నగరంలో నాలుగు లక్షలకుపైగా విద్యార్థులు జూన్ నెలలో ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టనున్నారు. వాటి స్థాయిని బట్టి మొదటి విడత ట్యూషన్ ఫీజు కనీసం రూ.7 వేలు, బ్యాగు, యూనిఫాంలు, టై, బెల్ట్, డైరీ, ప్రోగ్రెస్ రిపోర్ట్, సాక్సులకు మొత్తం రూ. 3,000 - 4,000, పుస్తకాలకు రూ.1,500, నోట్‌బుక్స్ రూ.800, ట్రాన్స్పోర్ట్ రూ. 1,200 ఖర్చు చేయాల్సిందే. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి జూన్ నెలలో దాదాపు రూ. 14 వేలు.. నాలుగు లక్షల మందికి రూ.550 కోట్లకు పైగా తల్లిదండ్రులపై భారం పడనుంది. ఇదంతా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన లెక్క. ఇక సెంట్రల్, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లలో అన్ని రకాల ఫీజులు కలుపుకొని ఏడాదికి ఒక్కో విద్యార్థి వద్ద రూ.2.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఏడాది ఖర్చులు కనిష్టం గరిష్టం డొనేషన్ ఫీజు రూ. 10 వేలు రూ. లక్ష ట్యూషన్ ఫీజు (అన్ని టర్మ్‌లు) రూ. 30 వేలు రూ. 1.50 లక్షలు పాఠ్య పుస్తకాలు రూ. 2 వేలు రూ. 5 వేలు నోట్ బుక్స్ రూ. వెయ్యి రూ. 2 వేలు యూనిఫాం, షూస్, బెల్ట్ రూ. 3 వేలు రూ. 4 వేలు ట్రాన్స్పోర్ట్ (దూరాన్ని బట్టి) రూ. వెయ్యి రూ. 3 వేలు బ్యాగు, పెన్నులు ఇతరత్రా రూ. వెయ్యి రూ. 1,500 ఇష్టారాజ్యంగా వసూలు చేయకూడదు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. గవర్నింగ్ బాడీ, పేరెంట్స్‌అసోసియేషన్ సమష్టి నిర్ణయం మేరకే ఫీజులు తీసుకోవాలి. ఏకపక్షంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అంతేగాక జీఓ ఎంఎస్ 1 ప్రకారం 5 శాతం లాభాలు మాత్రమే యాజమాన్యాలు తీసుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల అమలుపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. - సోమిరెడ్డి, డీఈఓ, హైదరాబాద్ -
నిబంధనలకు నీళ్లు
సాక్షి, బెంగళూరు : పాఠశాలల్లో అత్యాచారాలు, పిల్లలపై భౌతిక దాడులను అరికట్టడానికి వీలుగా పోలీస్ శాఖ ఆగస్ట్‌లో రూపొందించిన భద్రతా చర్యలను రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. దీంతో ‘విబ్‌గయార్’ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం మరో బాలికపై అత్యాచారం జరిగడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు పోలీసు శాఖ సూచనలు పాటిస్తే ఆర్థికంగా అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనేది పాఠశాల యాజమాన్యం వాదన. ఇక గత జూలైలో బెంగళూరులోని విబ్‌గయార్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలిక పై అదే పాఠశాలలో స్కేటింగ్ ఇన్‌స్ట్రక్షర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సిద్ధరామయ్య ప్రభుత్వం పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసు శాఖ ప్రైవేటు పాఠశాలలకు కొన్ని నూతన మార్గదర్శకాలను సూచించింది. వీటిని అమలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 30 వరకూ సమయం కూడా ఇచ్చింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మాత్రం వీటిని అమలు చేయడం పట్ల విముఖత ప్రదర్శిస్తోంది. పోలీసుశాఖ ఇచ్చిన గడువు పూర్తయి దాదాపు రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు పాఠశాల్లో కనీసం 20 శాతం సంస్థలు కూడా సూచనలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసు శాఖ ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దడం సరికాదని నగరంలోని విశ్వ పబ్లిక్ స్కూల్ సంస్థ డెరైక్టర్ వివేక్ పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు శాఖ సూచనలు ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్నవని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం చెబుతోంది. పోలీసు శాఖ చేసిన చేసిన సూచనల్లో ముఖ్యమైనవి కొన్ని... పాఠశాలల్లో సీసీ కెమరాలు తప్పక ఏర్పాటు చేయాలి. విద్యార్థులను రవాణా చేసే వాహనాల్లో తప్పక ఒక మహిళా సహాయకురాలు ఉండాలి. విద్యాసంస్థలోని ఆటమైదానాల్లో ఇరవైనాలుగు గంటల పాటు తప్పక సెక్యూరిటీ గార్డ్ల పహారా ఉండాలి. పాఠశాల సిబ్బంది వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. కొత్తగా విధుల్లో చేరే వారితోపాటు ఉద్యోగం వదిలి వెళ్లిన సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలి. పాఠశాలల్లో జరిగే ఉత్సవాలు, ముఖ్యఅతిథిగా వస్తున్న వారి వివరాలు కనీసం 48 గంటల ముందు పోలీసులకు తెలియజేయాలి. తరుచుగా పాఠశాల పరిసరాల తనిఖీకి పోలీసులను అనుమతించాలి పాఠశాల యాజమాన్యం చెబుతున్న అభ్యంతరాలు... సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. ఈ ఆర్థిక భారాన్ని చివరికి విద్యార్థుల తల్లిదండ్రుల పై వేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ గార్డులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించడానికి ఎక్కువ జీతాలను డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులను రవాణా చేసే వాహనాల్లో డ్రైవర్లగా పురుషులు ఉండటం వల్ల వాహనాల్లో మహిళా ఉద్యోగులను నియమించడం సరికాదు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పాఠశాలలో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఇవ్వడం శ్రమతో కూడుకున్నది. ఇందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాలపై ఆర్థిక భారాన్ని మోపనుంది. తనిఖీ పేరుతో పోలీసులు తరుచుగా పాఠశాలల్లోకి రావడం పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. నివేదిక కోరాను.. విద్యార్థుల రక్షణ కోసం తీసుకోవలసిన రక్షణ చర్యల విషయమై పోలీసు శాఖ రూపొందించిన మార్గదర్శకాలు చాలా పాఠశాలలు పాటించడం లేదు. తాజాగా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఘటన నేపథ్యంలో, పాఠశాలలు పాటిస్తున్న భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డిని ఆదేశించాను. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతాం. - కే.జే.జార్జ్ , రాష్ట్రహోం శాఖ మంత్రి -
బెంగళూరులో రెండోరోజూ కొనసాగిన ఆందోళన
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై ఇద్దరు పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. పసిబాలికపై ఘోరానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తరపువారు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తూర్పు బెంగళూరులోని ఓ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులపై ఇప్పటివరకు చర్య తీసుకోకుండా, జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితురాలి తండ్రి నీలేష్ స్పష్టం చేశారు. ఇంగ్లీషు వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!
- నర్సరీ టూ ఆరు వరకు తరగతులు - నేటి నుంచి అడ్మిషన్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరంలో హిందూస్తాన్ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. కొరియ రాయబారి క్యూంగ్సూ కిం ఈ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యారంగంలో హిందూస్తాన్ గ్రూప్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు పరిధిలో నావిగేషన్, ఇంజినీరింగ్ తదితర విద్యాలయాలెన్నో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో మెరుగైన సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ గ్రూప్ అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సరీ నుంచే విద్యార్థులకు విద్యనందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. సెయింట్ థామస్ మౌంట్లోని హిందూస్థాన్ కార్యాలయ ఆవరణలో ఎకరా విస్తీర్ణంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కొరియ రాయబారి క్యూంగ్ సూ కిం ప్రారంభించారు. హిందూస్తాన్ విద్యా సంస్థల సేవల్ని గుర్తుచేస్తూ తన ప్రసంగంలో క్యూంగ్ సూ కిం ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాల్ని గుర్తుచేశారు. హిందూస్తాన్ గ్రూప్ చైర్పర్సన్ ఎలిజబెత్ వర్గీస్ మాట్లాడుతూ తన భర్త దివంగత కేసీజీ వర్గీస్ ఓ సామన్యుడని గుర్తుచేశారు. ఆయన నాటిన ఈ విద్యా సంస్థ నేడు మహా వృక్షంగా అవతరించిందని పేర్కొన్నారు. ఆయన పడ్డ శ్రమకు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన సేవల్ని తాము కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను చిన్న నాటి నుంచి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగానే ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు ఈ స్కూల్లో విద్యాబోధనను అందించనున్నామని, కాల క్రమేనా పదో తరగతి వరకు విస్తరణ జరుగుతుందన్నారు. శనివారం నుంచి అడ్మిషన్లు ఆరంభం కానున్నాయని ప్రకటిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల్ని ఈ స్కూల్లో పనిచేయడానికి ఎంపికచేసినట్టు తెలిపారు. హిందూస్తాన్ గ్రూప్ డెరైక్టర్, సీఈవో ఆనంద్ జాకబ్ వర్గీస్, డెరైక్టర్ అశోక్ వర్ధన్, ఆ స్కూల్ ప్రిన్స్‌పాల్ రేనుదత్తా పాల్గొన్నారు. -
బడి బాటలో బిల్డర్లు!
ఇప్పటివరకు ఫ్లాట్‌ను విక్రయించాలంటే క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ వంటి ఆధునిక సదుపాయాలిస్తే చాలనుకునే వారు బిల్డర్లు. కానీ, ఇప్పుడలా కుదరదు. ఎందుకంటే కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులొచ్చాయి. తమ పిల్లలు చదువుకునేందుకు పాఠశాల, ఆధునిక ఆసుపత్రి వంటివి కూడా ఉంటేనే ఫ్లాట్ కొంటామంటున్నారు. అవి కూడా ప్రాజెక్ట్ దగ్గర్లో కాదు ఏకంగా ప్రాజెక్ట్ ఆవరణలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు బడి బాట పడుతున్నారు. నగరంలో ఇటీవల పెరిగిపోయిన సరికొత్త సంస్కృతిపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: సొంతింటి ఎంపికలో విద్యాలయాలు, ఆసుపత్రులు కీలకంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలోమీటర్ల దూరముండే స్కూల్‌కు తమ పిల్లల్ని పంపించడం తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మరీ ఎక్కువగా వర్షాకాలంలో బస్సుల కోసం వేచి చూడటం తల్లిదండ్రులకు చిరాకు కలిగిస్తుంది. పిల్లలు వర్షంలో తడవకుండా ఇంటి నుంచే నేరుగా పాఠశాలకు వెళ్లగలరా? హఠాత్తుగా అనారోగ్యం తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ప్రాజెక్ట్‌లోనే ఆసుపత్రి ఉందా? వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నారు. అందుకే ఫ్లాట్‌ను కొనేముందు క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలే కాదు ప్రాజెక్ట్ ఆవరణలోనే పాఠశాల, ఆసుపత్రి వంటివి ఉంటేనే ఫ్లాట్ కొనేందుకు ముందుకొస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. శరవేగంగా అభివృద్ధి.. ఇలాంటి ప్రాజెక్ట్‌లుండే ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఎలాగంటే కొనుగోలుదారుల కోసం, తమ వ్యాపారం కోసం తమ ప్రాజెక్ట్ ఆవరణలో పాఠశాలలు, ఆసుపత్రులు నెలకొల్పేందుకు బిల్డర్లు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని కంపెనీలైతే రీసెర్చ్ సెంటర్లకూ స్థానం కల్పిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం విద్యాలయాలు, ఆసుపత్రులతో కళకళలాడతాయి. దీంతో దేశ, విదేశీ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో షాపింగ్ మాళ్లు, మల్టిప్లెక్స్‌ల వంటివి ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి. దీంతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. నగరంలోని పలు ప్రాజెక్ట్‌లివే.. మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ 600 ఎకరాల్లో ‘డిస్కవరీ సిటీ’ పేరుతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 15 ఎకరాలు విద్యా సంస్థలకు కేటాయించారు. ఇప్పటికే 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, థీమ్ పార్క్ వంటివెన్నో ఈ ప్రాజెక్ట్‌లో కొలువుదీరనున్నాయి. మూసాపేట్లో సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 68 ఎకరాల్లో ‘సైబర్‌సిటీ రెయిన్బో విస్టాస్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఫేజ్-1లో నెక్ట్స్‌జెన్ ప్లే స్కూల్, ఫేజ్-2లో ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది. షాద్‌నగర్‌లో వాసుదేవా లే-అవుట్ డెవలపర్స్ ఇండియా ప్రై.లి. ‘డాక్టర్స్ కాలనీ’ పేరుతో సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఇందులో ట్రిడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వర్షాకాలంలోనే వాస్తవాలు తెలుస్తాయ్.. {పాజెక్ట్ ఆవరణలో స్కూలు, ఆసుపత్రి ఉన్నంత మాత్రానా ఫ్లాట్ కొనేందుకు సిద్ధమవకూడదు. ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే వర్షాకాలమే సరైంది. సైటు వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం ఉత్తమం. వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది. ఇంటి నుంచి ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు సులువుగా చేరుకోగలరా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇదే సరైన సమయం. {పజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? అత్యవసరాల్లో ఆటోలు దొరుకుతాయా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వర్షా కాలంలోనే పక్కాగా తెలుస్తాయి. వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వర్షాలు పడితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు. నిర్మాణపనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది. గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి.