నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్! | Hindustan International School in the city! | Sakshi
Sakshi News home page

నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!

Published Sat, Jun 21 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!

నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!

- నర్సరీ టూ ఆరు వరకు తరగతులు
- నేటి నుంచి అడ్మిషన్లు

సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరంలో హిందూస్తాన్ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. కొరియ రాయబారి క్యూంగ్‌సూ కిం ఈ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యారంగంలో హిందూస్తాన్ గ్రూప్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు పరిధిలో నావిగేషన్, ఇంజినీరింగ్ తదితర విద్యాలయాలెన్నో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో మెరుగైన సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ గ్రూప్ అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సరీ నుంచే విద్యార్థులకు విద్యనందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది.

 సెయింట్ థామస్ మౌంట్‌లోని హిందూస్థాన్ కార్యాలయ ఆవరణలో ఎకరా విస్తీర్ణంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు.  ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కొరియ రాయబారి క్యూంగ్ సూ కిం ప్రారంభించారు. హిందూస్తాన్ విద్యా సంస్థల సేవల్ని గుర్తుచేస్తూ తన ప్రసంగంలో క్యూంగ్ సూ కిం ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాల్ని గుర్తుచేశారు. హిందూస్తాన్ గ్రూప్ చైర్‌పర్సన్ ఎలిజబెత్ వర్గీస్ మాట్లాడుతూ తన భర్త దివంగత కేసీజీ వర్గీస్ ఓ సామన్యుడని గుర్తుచేశారు. ఆయన నాటిన ఈ విద్యా సంస్థ నేడు మహా వృక్షంగా అవతరించిందని పేర్కొన్నారు.

ఆయన పడ్డ శ్రమకు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన సేవల్ని తాము కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను చిన్న నాటి నుంచి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగానే ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు ఈ స్కూల్‌లో విద్యాబోధనను అందించనున్నామని, కాల క్రమేనా పదో తరగతి వరకు విస్తరణ జరుగుతుందన్నారు. శనివారం నుంచి అడ్మిషన్లు ఆరంభం కానున్నాయని ప్రకటిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల్ని ఈ స్కూల్లో పనిచేయడానికి ఎంపికచేసినట్టు  తెలిపారు. హిందూస్తాన్ గ్రూప్ డెరైక్టర్, సీఈవో ఆనంద్ జాకబ్ వర్గీస్, డెరైక్టర్ అశోక్ వర్ధన్, ఆ స్కూల్ ప్రిన్స్‌పాల్ రేనుదత్తా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement