
సియోల్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగాయి. వివాదాస్పద సముద్ర సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఇరు దేశాల సైన్యాలు సముద్రంలోకి పెద్ద సంఖ్యలో ఆరి్టలరీ షెల్స్‌ను ప్రయోగించాయి. 2018లో కుదిరిన ఇంటర్–కొరియన్ మిలటరీ ఒప్పందాన్ని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఉల్లంఘించాయి. తమ పశి్చమ సరిహద్దు వద్ద ఉత్తర కొరియా దాదాపు 200 ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
గత ఏడాది కాలంలో కిమ్ జోంగ్ ఉన్ సైన్యం ఈ స్థాయిలో ఫైరింగ్‌కు పాల్పడడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా సైన్యం సైతం ధీటుగా బదులిచి్చంది. ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించింది. తాజా ఘటనతో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా మరింత ఉధృతం చేసే అవకాశం ఉందంటున్నారు. కొరియా ద్వీపకల్ప పశి్చమ తీరంలో సముద్ర సరిహద్దును పూర్తిగా నిర్ధారించలేదు. ఇక్కడ ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. 1999, 2002, 2009, 2010లో రెండు దేశాల నడుమ కాల్పులు చోటుచేసుకున్నాయి.