బెంగుళూరు: బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధిస్తారు. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ ఖచ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని తప్పులు చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు.
బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు కృత్రిమమేధస్సు నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి ఖచ్చితమైన సమాధానాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛరైపోనక్కరలేదంటున్నారు. దీనికి సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని చెబుతున్నారు.
బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది.
World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet 7 inch ROBOT teaches Physics,Maths, Biology & Chemistry.This AI Robot teacher is First of it's kind in the world.The Precision is 100% & no margin for error. pic.twitter.com/WNPkTPb3m2
— SHAFAAT SHAH (@INFANTRY28) February 27, 2023
ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment