robot technology
-
వీడియో వైరల్.. పాఠాలు చెబుతున్న రోబో టీచర్ .. ప్రపంచంలోనే తొలిసారి..
బెంగుళూరు: బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధిస్తారు. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ ఖచ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని తప్పులు చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు కృత్రిమమేధస్సు నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి ఖచ్చితమైన సమాధానాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛరైపోనక్కరలేదంటున్నారు. దీనికి సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని చెబుతున్నారు. బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet 7 inch ROBOT teaches Physics,Maths, Biology & Chemistry.This AI Robot teacher is First of it's kind in the world.The Precision is 100% & no margin for error. pic.twitter.com/WNPkTPb3m2 — SHAFAAT SHAH (@INFANTRY28) February 27, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి -
అండర్‌వాటర్ వాక్యూమ్ క్లీనర్.. నీటి అట్టడుగు వరకు
భారీ నీటి తొట్టెలు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి శుభ్రం చేయడం ఆషామాషీ పని కాదు. ఎంతగా శుభ్రం చేశామనుకున్నా, సూక్షా్మతి సూక్ష్మమైన నలకలు, నాచు మొలకలు ఎక్కడో చోట ఇంకా మిగిలే ఉంటాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ గనుక ఉంటే, వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. ఇది నీటి అట్టడుగు వరకు ప్రయాణించగలదు. మూల మూలల్లోని చెత్తను, 180 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్షా్మతి సూక్ష్మమైన నలకలను కూడా ఇట్టే ఒడిసి పట్టుకుని, తిరిగి నీట్లోకి చేరకుండా చూస్తుంది. ‘ఎయిపర్ సీగల్–3000’ పేరుతో జపాన్‌కు చెందిన ఎయిపర్ ఇంటెలిజెంట్ కంపెనీ రూపొందించిన ఈ అండర్ వాటర్ రోబో వాక్యూమ్ క్లీనర్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. -
80 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!
‘మా బ్యాంకులోని ఉద్యోగులంతా రోబోల్లా పనిచేస్తారు. అలాగే రేపటి రోజున మనుషుల్లా పనిచేసే రోబోలతో మా కార్యాలయం నిండిపోవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మార్పులు సహజమే కదా...’ - దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ జాన్ క్రియాన్ ఆటోమేషన్... ఈ మాట వింటేనే చాలు సగటు ఉద్యోగి గుండెల్లో రైళ్లు పరుగెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషులతో పనే లేకుండా.. యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడం. ప్రస్తుతం పరిశ్రమలన్నింటిలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్) ముప్పు కూడా ముంచుకొస్తోంది. మనుషుల్లా ఆలోచించి, మనుషుల కన్నా వేగంగా, చురుకుగా పనిచేసే రోబోలను సృష్టించే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతు. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. సగటు ఉద్యోగిపై ఆటోమేషన్ ఎంత తీవ్ర ప్రభావం చూపనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక, విద్య, వైద్య, రవాణా, పర్యాటకం వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక రంగంపై ఆటోమేషన్ ప్రభావం.. ఆర్థిక రంగంలో కీలక విభాగాలైన బ్యాంకింగ్, బీమా, పెట్టుబడి రంగాల్లో కృత్రిమ మేథ(ఏఐ)తో పనిచేసే రోబోలను ప్రవేశ పెట్టడం ద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు దిగ్గజ బ్యాంకు దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ వ్యాఖ్యానించారు. క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించడం ద్వారా టెలీకాలర్లు, క్లర్కులు, ఫ్రంట్ ఆఫీసు సిబ్బందికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేథను ఉపయోగించనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు(ఎన్ఏబీ) కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తద్వారా రానున్న 13 సంవత్సరాల్లో తమ ఉద్యోగుల సంఖ్యను 12 శాతానికి తగ్గించేందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏఐని ఉపయోగించడం ద్వారా వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను మొత్తంగా తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో ప్రాణ నష్టం తగ్గించుకునేందుకు.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా ఏఐనే వాడుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డ్రోన్లను ఉపయోగించి శత్రు స్థావరాలను గుర్తించడంతో పాటుగా... దాడులు జరపడం కూడా సులభతరంగా మారిన నేపథ్యంలో సైనికుల సంఖ్యను తగ్గించేకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. తద్వారా ప్రాణ నష్టం తగ్గించుకోవడంతో పాటుగా ఖర్చు కూడా తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైద్య రంగంలోనూ ఆటోమేషన్ హవా... వైద్య రంగంలో కూడా ఆటోమేషన్ హవా కొనసాగుతోంది. థర్మామీటర్స్, బీపీ మానిటర్స్‌ను కంప్యూటర్లతో అనుసంధానం చేయడం ద్వారా పారామెడికల్ ఉద్యోగాల్లో భారీగా కోత పడనున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ తమ నాన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 111తో ఏఐని అనుసంధానించడం ద్వారా మెడికల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. సుమారు 1.2 మిలియన్ మంది ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఉత్తర లండన్‌లోని టెలీకాలర్లు భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆటోమేషన్ ప్రభావం వల్ల వేలాది మంది అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. రవాణా రంగ ఉద్యోగులకు కూడా తిప్పలు తప్పవు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రైల్వేల్లో కూడా ఆటోమేషన్ ప్రభావం చూపనుంది. టికెట్ వాలిడేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఏఐని ఉపయోగించడం ద్వారా సిబ్బందిని భారీగా తగ్గించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బయోమెట్రిక్ స్కానర్లను ఏఐతో అనుసంధానించి ఉపయోగించడం ద్వారా టికెట్ల దృవీకరణ, పర్యవేక్షణ సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోన్నాయి వివిధ దేశాల ప్రభుత్వాలు. పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలపై ప్రభావం ఆటోమేషన్ ప్రభావం వల్ల పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల్లో భారీగా కోత పడబోతుంది. ఏఐని వినియోగించడం ద్వారా టూరిజం ప్యాకేజీ అడ్వైజర్లు, ట్రావెల్ ఏజెంట్స్ చేసే పనులను రోబోలే చేస్తున్నాయి. అదే విధంగా టూరిస్టు గైడులు, క్యాబ్ డ్రైవర్ల ఉద్యోగాలకు కూడా కృత్రిమ మేథ ఎసరు పెడుతోంది. విద్యారంగంలో వర్చువల్ రియాలిటీ ద్వారా.. నేటి డిజిటల్ యుగంలో సమయాభావం వల్ల ఆన్లైన్లోనే కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సులు అందుబాటులోకి తెచ్చి వర్చువల్ రియాలిటీ ద్వారా విద్య బోధిస్తున్నాయి. ఇందుకోసం రోబోలను వినియోగించుకుంటున్నాయి. రోబో టెక్నాలజీకి కృత్రిమ మేథ కూడా తోడవడంతో నిపుణులైన అధ్యాపకుల అవసరం కూడా లేకుండా పోతోంది. ఆటోమేషన్‌కు జన్మస్థానమైన తయారీ రంగంలో.. ఆటోమేషన్‌కు జన్మస్థానంగా చెప్పుకునే తయారీ రంగంలో ఇప్పటి వరకు సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ మెషీన్ల హవా కొనసాగుతోంది. దీనికి ఏఐ కూడా తోడవడంతో యంత్రాలను పర్యవేక్షించే పనిని కూడా రోబోలే తలకెత్తుకుంటున్నాయి. మనుషుల కంటే కూడా మెరుగ్గా ఈ రోబోలు పని చేస్తున్నాయని, వీటితో ఖర్చు కూడా తగ్గుతోందని పలు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో సహాయక సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. అసలు మొత్తంగా పరిశ్రమలన్నీ రోబోలతోనూ, యంత్రాలతోనే నిండిపోతే ఇక మనుషులే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఈ రోబోకు చెమట పడుతుంది!
రోబోలంటే గట్టి లోహాలతో చేసి ఉంటారని అనుకుంటాం. నిజం కూడా. అయితే కాలం మారుతోంది. టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతోంది. ఈ కాలపు రోబోలు చాలావరకూ మనుషుల్లా ఆలోచిస్తున్నాయి. రకరకాల పనులూ చేస్తున్నాయి. తాజాగా జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి, వ్యాయామం చేసే రోబోలను అభివృద్ధి చేశారు. దీంట్లో విశేషం ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే కెన్‌షిరో, కెన్‌గోరో అని పిలుస్తున్న ఈ రెండు రోబోలు వ్యాయామం చేస్తూంటే అచ్చం మన మాదిరిగానే దానికీ చెమట పడుతుంది మరి! మనలాగే వీటికీ కొంచెం నీరు పట్టిస్తే... ఆ తరువాత ఇది అన్ని రకాలు.. అంటే పుషప్స్, సిటప్స్, క్రంచెస్, స్ట్రెచెస్ వంటి వ్యాయామాలన్నీ చేసేస్తుంది. దాని శరీరంపై ఉండే సూక్ష్మ రంధ్రాల నుంచి నీటిఆవిరి వెలువడుతుంది. కదలికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లూ ఉండటం వల్ల ఈ రెండు రోబోలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తమంతట తామే వ్యాయామం చేస్తాయి. మెషీన్ లెర్నింగ్ సాయంతో కొత్త కొత్త ఎక్సర్‌సైజ్‌లను సృష్టించగలవు కూడా. సరేగానీ.. చెమట పట్టించే రోబోలు ఎందుకు అన్నదేనా మీ సందేహం! చాలా సింపుల్.. మన గురించి.. అంటే మనుషుల గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకే అంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే వీటిని ప్రమాదకర పరిస్థితుల్లో మనుషులను రక్షించేందుకూ వాడుకోవచ్చునన్నది ఇంకో ఆలోచన. -
భవిష్యత్తు రోబో టెక్నాలజీదే
వరంగల్, న్యూస్‌లైన్: భవిష్యత్తులో సాంకేతిక రంగంలో రోబో టెక్నాలజీకే అధిక ప్రాధాన్యం ఉంటుందని రోబోటిక్స్ ఎసెట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ దివాకర్ వైష్ తెలిపారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో జరుగుతున్న టెక్నోజియూన్ సందర్భంగా చివరి రోజు ఆదివారం ‘మైండ్ కంట్రోలింగ్ రోబోస్’ అంశంపై ఆయన మాట్లాడారు. కంప్యూటర్, టీవీ టెక్నాలజీలో రెండు దశాబ్దాల్లోనే అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. రోబోలతో ఏదైనా సాధ్యమని నిరూపించే కాలం సమీపంలోనే ఉందన్నారు. మానవ మేధస్సుతోనే రోబోలను కంట్రోలు చేయగలుగుతున్నామని, అణు రియాక్టర్లు తదితర మనిషి ఆరోగ్యానికి నష్టం కలిగించే పనుల్లో రోబోలను విని యోగించుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా రోబోలను ఆపరేట్ చేసి మనిషి చేసే మాదిరిగానే అనేక పనులను ఆయన చూపించారు. అంతకుముందు ఇండియన్ బిజి నెస్ మోడల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ యాస్ సక్సేనా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ పరంగా అనేక మార్పులు వచ్చాయని, అందుకనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.