భవిష్యత్తు రోబో టెక్నాలజీదే
వరంగల్, న్యూస్‌లైన్: భవిష్యత్తులో సాంకేతిక రంగంలో రోబో టెక్నాలజీకే అధిక ప్రాధాన్యం ఉంటుందని రోబోటిక్స్ ఎసెట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ హెడ్ దివాకర్ వైష్ తెలిపారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో జరుగుతున్న టెక్నోజియూన్ సందర్భంగా చివరి రోజు ఆదివారం ‘మైండ్ కంట్రోలింగ్ రోబోస్’ అంశంపై ఆయన మాట్లాడారు. కంప్యూటర్, టీవీ టెక్నాలజీలో రెండు దశాబ్దాల్లోనే అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. రోబోలతో ఏదైనా సాధ్యమని నిరూపించే కాలం సమీపంలోనే ఉందన్నారు.
మానవ మేధస్సుతోనే రోబోలను కంట్రోలు చేయగలుగుతున్నామని, అణు రియాక్టర్లు తదితర మనిషి ఆరోగ్యానికి నష్టం కలిగించే పనుల్లో రోబోలను విని యోగించుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా రోబోలను ఆపరేట్ చేసి మనిషి చేసే మాదిరిగానే అనేక పనులను ఆయన చూపించారు. అంతకుముందు ఇండియన్ బిజి నెస్ మోడల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ యాస్ సక్సేనా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ పరంగా అనేక మార్పులు వచ్చాయని, అందుకనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని సూచించారు.