A Student Was Electrocuted At International School In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పాఠశాలలో దారుణం.. విద్యార్థికి కరెంట్ షాక్..

Published Fri, Jun 30 2023 3:54 PM | Last Updated on Fri, Jun 30 2023 5:13 PM

A Student was Electrocuted at International School in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలలో ఆడుకుంటున్న ఇంటర్ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. 

మెరీడియన్ స్కూల్‌లో హస్సన్‌ అనే విద్యార్థి పదకొండవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో పిల్లలందరు అటలాడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీని తగిలాడు పిల్లాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో  విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.  

ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. 45 నుంచి 50 శాతం వరకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీ చేశామని పేర్కొన్నారు . ఈ ఘటనపై  విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

ఇదీ చదవండి: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్​మానేర్​లో దూకిన తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement