పవన్ కుమార్ సెంచరీ | pavan kumar century helps to pkm cc drawn against deccan blues | Sakshi
Sakshi News home page

పవన్ కుమార్ సెంచరీ

Published Sat, Oct 29 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

pavan kumar century helps to pkm cc drawn against deccan blues

సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా డెక్కన్ బ్లూస్, పీకేఎం సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. 23/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు తొలి ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు 143 పరుగులు చేసింది. వివేక్ (65) అర్ధసెంచరీ చేశాడు. డెక్కన్ బ్లూస్ బౌలర్లలో అఖిలేశ్ 4 వికెట్లతో రాణించాడు.

 

అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు ఆటముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సాయి సంజీవ్  (52), పవన్ కుమార్ (102) ఆకట్టుకున్నారు. అంతకుముందు డెక్కన్‌బ్లూస్ జట్టు తమ తొలి ఇన్నింగ్‌‌సను 351/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

ఇతర మ్యాచ్‌ల స్కోర్లు


 నిజాం కాలేజ్: తొలి ఇన్నింగ్‌‌స 221, రెండో ఇన్నింగ్‌‌స 277/6 డిక్లేర్డ్ (సారుు కుమార్ 100, పి. శరత్ 114; రంగనాథ్ 4/64), ఎస్‌బీఐ: తొలి ఇన్నింగ్‌‌స 140 (అన్వేష్ రెడ్డి 6/30,  రెండో ఇన్నింగ్‌‌స 111/5 (నాగ శ్రీనివాస రావు 42). 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement