Deccan Blues
-
పవన్ కుమార్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా డెక్కన్ బ్లూస్, పీకేఎం సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. 23/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు తొలి ఇన్నింగ్‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు 143 పరుగులు చేసింది. వివేక్ (65) అర్ధసెంచరీ చేశాడు. డెక్కన్ బ్లూస్ బౌలర్లలో అఖిలేశ్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు ఆటముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సాయి సంజీవ్ (52), పవన్ కుమార్ (102) ఆకట్టుకున్నారు. అంతకుముందు డెక్కన్బ్లూస్ జట్టు తమ తొలి ఇన్నింగ్‌సను 351/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు నిజాం కాలేజ్: తొలి ఇన్నింగ్స 221, రెండో ఇన్నింగ్స 277/6 డిక్లేర్డ్ (సారుు కుమార్ 100, పి. శరత్ 114; రంగనాథ్ 4/64), ఎస్బీఐ: తొలి ఇన్నింగ్స 140 (అన్వేష్ రెడ్డి 6/30, రెండో ఇన్నింగ్స 111/5 (నాగ శ్రీనివాస రావు 42). -
బ్లూస్‌ను గెలిపించిన చంద్రశేఖర్
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: చంద్రశేఖర్ (7/35) నిప్పులు చెరగడంతో డెక్కన్ బ్లూస్ 64 పరుగుల తేడాతో ఎస్.రేమండ్స్పై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ బ్లూస్ 236 పరుగులు చేసి ఆలౌటైంది. శేషగిరి 46, శ్రీకాంత్ 35 పరుగులు చేశారు. రేమండ్స్ బౌలర్ తేజోధర్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్.రేమండ్స్ జట్టు 172 పరుగుల వద్ద ఆలౌటైంది. వికాస్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌నగర్: 220 (కమల్ 31, నర్సింహా 30; గణేశ్ 6/63), స్పోర్టీవ్: 221/8 (రోషన్ 70, ధీరజ్ 48; సతీశ్ 4/53) యాదవ్ డెయిరీ: 242 (శ్రీనివాస్ 53, సూర్యతేజ 53; ప్రణవ్ 4/87), డెక్కన్ కోల్ట్స్: 174 (రమేశ్ 47, అర్జున్ 44; రిషబ్ 5/35) శాంతి ఎలెవన్: 146 (జగన్ 47 నాటౌట్; సుశిక్షిత్ 5/37), భరత్: 147/4 (రోహిత్ దివేశ్ 52) సెయింట్ ప్యాట్రిక్స్: 229 (నిఖిల్ 40 నాటౌట్, శ్రీమాన్ 37; నీరజ్ 5/48), ఎం.ఎల్.జయసింహా: 189 (వినయ్ 55, సాత్యకి 3/40) ఎంపీ బ్లూస్: 236 (యేసుదాస్ 77 నాటౌట్; కశ్యప్ 4/64), మాంచెస్టర్: 178 (సొహైల్ ఖాన్ 47 నాటౌట్; సతీశ్ 4/58) -
రాణించిన సోహన్, గణేశ్
జింఖానా : భరత్ క్రికెట్ క్లబ్ భదీంతో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో శాంతి ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శాంతి ఎలెవన్ 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భరత్ సీసీ 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో స్పోర్టివ్ సీసీ బౌలర్ ఎన్ఎస్ గణేశ్ 7 వికెట్లు పడగొట్టి డెక్కన్ బ్లూస్ జట్టును కట్టడి చేశాడు. అయితే చివరకు వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత బరిలోకి దిగిన డెక్కన్ బ్లూస్ 168 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదిల్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. స్పోర్టివ్ సీసీ బౌలర్ రాము 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన స్పోర్టివ్ సీసీ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసేంది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు రెండేసి పాయింట్లు ఇచ్చారు.