సాక్షి, హైదరాబాద్: జయంత్ (7/11) బౌలింగ్‌లో చెలరేగినప్పటికీ స్పోర్టివ్ సీసీ జట్టు పరాజయం పాలైంది. ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో నేషనల్ సీసీ జట్టు 5 వికెట్ల తేడాతో స్పోర్టివ్ సీసీ జట్టుపై గెలుపొందింది. శుక్రవారం రెండో రోజు ఆటలో స్పోర్టివ్ సీసీ జట్టు రెండో ఇన్నింగ్‌సలో 26.1 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. గోపీకృష్ణ (30) రాణించాడు. నేషనల్ సీసీ బౌలర్లలో సుమిత్ 5, ప్రణీత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం నేషనల్ సీసీ జట్టు రెండో ఇన్నింగ్‌సలో 12.3 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి గెలిచింది. ప్రశాంత్ (46), నరేశ్ (30) ఆకట్టుకున్నారు. స్పోర్టివ్‌సీసీ బౌలర్లలో అనుదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్‌సలో స్పోర్టివ్ సీసీ 138 పరుగులు చేసి ఇన్నింగ్‌స డిక్లేర్డ్ చేయగా... నేషనల్ సీసీ 96 పరుగులు మాత్రమే చేసింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
నిజామ్ సీసీ: 301 (సందీప్ 44, శరత్ 34, అక్షయ్ 126 నాటౌట్; సంపత్ 4/122, అఖిలేశ్ 4/76), రెండో ఇన్నింగ్‌స 41/2; డెక్కన్ బ్లూస్: 268 (హర్షవర్ధన్ 43, డి. హర్షవర్ధన్ 126; అన్వేష్ /90, సారుు కుమార్ 3/50).
విజయ్ హనుమాన్: 252/7 (శశిధర్ 46, మెహర్‌ప్రసాద్ 71, రంగనాథ్ 61); మాంచెస్టర్ 23/1.
బ్రదర్స్ ఎలెవన్: 129/9 డిక్లేర్డ్ (మొహమ్మద్ ముష్ఫికర్ 43; రిషబ్ 5/34, మొహమ్మద్ రజా 3/39); జైభగవతి: 104/4 (శిరీష్ 72 నాటౌట్).
స్పోర్టివ్ సీసీపై నేషనల్ సీసీ గెలుపు
Published Sat, Aug 27 2016 10:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
Advertisement
Advertisement