సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శుభ్ అగర్వాల్ (4/8), మొహమ్మద్ అస్లామ్ (4/8) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో సన్‌గ్రేస్ జట్టు విజయం సాధించింది. శనివారం సెయింట్ సాయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌గ్రేస్ జట్టు 21.5 ఓవర్లలో 51 పరుగుల అల్ప స్కోరుకే ఆలౌటైంది. విక్రాంత్ చౌదరీ (19) టాప్ స్కోరర్. సెయింట్ సాయి బౌలర్లలో నిఖిల్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్, తేజ, సన్నీ తలా రెండు వికెట్లతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి జట్టు శుభ్ అగర్వాల్, అస్లామ్ ధాటికి 26.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. రిలయన్‌స, యూనివర్సల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రిలయన్‌స జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూనివర్సల్ జట్టు 22.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. హర్ష (23) రాణించాడు. రిలయన్‌స బౌలర్లలో కౌస్తుబ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రిలయన్‌స జట్టు 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి గెలిచింది. అఖిల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
సన్‌గ్రేస్‌ను గెలిపించిన శుభ్, అస్లామ్
Published Sun, Sep 18 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement
Advertisement