aslam
-
హనుమాన్ శోభాయాత్రలో హింస
న్యూఢిల్లీ: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు అన్సర్‌తోపాటు ఎస్సైపై కాల్పులు జరిపాడంటున్న మహ్మద్ అస్లాంను అరెస్టు చేశామన్నారు. అస్లాం నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. ‘మసీదు సమీపంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాడులకు దిగాయి. 8 మంది పోలీసులు, ఒక స్థానికుడు గాయపడ్డారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. ఇతర నిందితులనూ గుర్తిస్తాం. బులెట్ గాయాలైన ఎస్ఐ పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీలో మత ఘర్షణలు ఇదే మొదటిసారి. ఆదివారం జహంగీర్‌పూర్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంపైనే కేసులు సరి కాదని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా అన్నారు. బయటివారి కుట్రే శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గానికి చెందిన ప్రార్థన మందిరంలోకి చొరబడి మతపరమైన జెండాలను ఎగురవేసేందుకు కొందరు ప్రయత్నించారని, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే ఘర్షణ జరిగిందని అంటున్నారు. సి–బ్లాక్ మసీదు వద్ద ఘర్షణకు దిగినవారు ఇక్కడివారు కాదని, బయటి నుంచి వచ్చినవారేనని స్థానికులు చెబుతున్నారు. జహంగీర్‌పూర్‌లో హిందువులు, ముస్లింలు దశాబ్దాలుగా కలసిమెలిసి జీవిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. బయటి శక్తులు తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడుతున్నారు. వారిపైనా ఎఫ్ఐఆర్: ఎన్సీపీసీఆర్ ఢిల్లీ మతఘర్షణల్లో చిన్నారులు భాగస్వాములై రాళ్లు విసరడం పట్ల జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆదివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల్లో పిల్లలను వాడుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. హింస కోసం పిల్లలను వాడుకోవడం జువెనైల్ జస్టిస్ చట్టం కింద నేరమేనని గుర్తుచేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టాలని పేర్కొంది. నిందితులపై చేపట్టిన చర్యలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఉత్తరాఖండ్‌లోనూ.. హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో భగవాన్‌పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా శనివారం ఘర్షణ జరిగింది. ప్రదర్శనలో పాల్గొంటున్నవారిపై మరోవర్గం ప్రజలు రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. ఘర్షణకు కారణమైన 9 మంది నిందితులను అరెస్టు చేశామని, 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. -
ఈజీ మైండ్ ఇట్టే ముంచేసింది..
తుమకూరు: రాజధానిలో బయటపడిన వేలాది కోట్ల ఐఎంఏ జ్యువెల్లర్స్ కుంభకోణం సద్దుమణగక ముందే అదే దారిలో మరో ఘరానా కంపెనీ ప్రజలను నిండా ముంచేసి బోర్డు తిప్పేసింది. చదువులు, పెళ్లిళ్లు, జనరల్ ప్లాన్స్ ఇలా పలు రకాల స్కీములతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా నగదు సేకరించి షట్టర్ మూసేసింది. తుమకూరు నగరానికి చెందిన మహ్మద్ అస్లాం అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా హెచ్ఎంఎస్ షాదీ మహల్ ఆవరణలోని వాణిజ్య సముదాయంలో ‘ఈజీ మైండ్’ పేరుతో మార్కెటింగ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పలు రకాల స్కీములతో పాటు ఓలా, ఉబర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వచ్చే లాభాల్లో వాటాలు ఇస్తానంటూ ప్రజలను ఆకర్షించాడు. ఇలా సుమారు ఐదు లక్షల మంది నుంచి రూ.600 కోట్ల మేర సేకరించినట్లు బాధితులు, పోలీసులు చెబుతున్నారు. తుమకూరుతో పాటు ఇతర జిల్లాలు, కేరళ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజల నుంచి కూడా డబ్బులు సేకరించాడు. కంపెనీలో పని చేసే ఉద్యోగులు సైతం రెండింతలు డబ్బులు వస్తాయనే ఆశతో తమ జీతాలు కూడా కంపెనీలో పెట్టి మోసపోయారు. మార్చిలోనే దుబాయ్‌కి పరారీ భారీ మొత్తంలో నగదు చేకూరడంతో బోర్డు తిప్పేసి మూడో కంటికి తెలియకుండా మార్చిలో దుబాయ్‌కు పారిపోయాడు. మార్చ్‌లో మూతబడ్డ ఈజీ మైండ్ కార్యాలయం తలుపులు ఈరోజో రేపో తెరుచుకుంటాయని ప్రతి రోజూ ఆశగా పడిగాపులు పడుతున్న బాధితులకు నిరాశే మిగిలింది. మూడునెలలైనా తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయిండంతో ఘటన వెలుగు చూసింది. వెల్లువెత్తిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జిల్లా ఎస్పీ వంశీకృష్ణకు మొర పెట్టుకోవడంతో విచారణ జరిపించాలంటూ డీవైఎస్పీ తిప్పేస్వామికి సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు మహ్మద్ కోసం వేట మొదలుపెట్టారు. ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే రఫిక్ అహ్మద్.. ప్రజలను వంచించిన నిందితుడు ఎక్కడ దాక్కున్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దసంఖ్యలో బాధితులు గొల్లుమంటూ వెల్లువెత్తారు. -
రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం
► బీబీనగర్ వద్ద ఘటన ► మృతుడి స్వస్థలం వరంగల్‌లోని శివనగర్ ► స్వగృహానికి చేరుకున్న మృతదేహం ఖిలా వరంగల్: సినీరంగంలో హీరో స్థాయికి ఎదిగిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓరుగల్లు బిడ్డను చిరుప్రాయంలోనే మృత్యువు కబళించింది. తన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన వరంగల్–హైదారాబాద్ జాతీయ రహదారిపై యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. బంధువులు, మిత్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం 18వ డివిజన్ శివనగర్‌కు చెందిన సరోహా రూపేష్, ఫరిజానా(ఫాతిమా) దంపతులకు ఇద్దరు కుమారులు అస్లాం (ఖరన్సింగ్) (21), సల్మాన్ఉన్నా రు. మూడేళ్ల కిత్రం చిన్నపాటి ఉద్యోగం చేసేందుకు అస్లాం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ మిత్రుడి సహకారంతో సినిమా రంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. గత ఏడాది నుంచి ప్రేమమయం సినిమాకు హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆడియో ప్రారంభం, వచ్చే నెల సినిమా విడుదలకు సిద్ధం చేశారు. రంజాన్ పండుకు అస్లాం హైదరాబాద్ నుంచి శివనగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ఇద్దరు ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అస్లాంకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే సికిందరాబాద్‌లోని ఎంజీఎంకు తరలించారు. అస్లాం మృతదేహం పోస్టుమార్టం పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం శివనగర్‌లోని తన స్వగృహానికి చేరుకుంది. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సినిమా ప్రముఖులు తరలివచ్చి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో మెట్టు శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్,ప్రవీణ్, శ్రీరాం రాజేష్, కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీపద్మ, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
సన్గ్రేస్ను గెలిపించిన శుభ్, అస్లామ్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శుభ్ అగర్వాల్ (4/8), మొహమ్మద్ అస్లామ్ (4/8) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో సన్‌గ్రేస్ జట్టు విజయం సాధించింది. శనివారం సెయింట్ సాయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌గ్రేస్ జట్టు 21.5 ఓవర్లలో 51 పరుగుల అల్ప స్కోరుకే ఆలౌటైంది. విక్రాంత్ చౌదరీ (19) టాప్ స్కోరర్. సెయింట్ సాయి బౌలర్లలో నిఖిల్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్, తేజ, సన్నీ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి జట్టు శుభ్ అగర్వాల్, అస్లామ్ ధాటికి 26.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. రిలయన్స, యూనివర్సల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రిలయన్స జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూనివర్సల్ జట్టు 22.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. హర్ష (23) రాణించాడు. రిలయన్స బౌలర్లలో కౌస్తుబ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రిలయన్స జట్టు 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి గెలిచింది. అఖిల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. -
వీసీకే దక్కని న్యాయం!
సాధారణంగా అసమ్మతి అధ్యాపకులు, విద్యార్థులు ఆర్టీఐని దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని వేధించుకు తింటున్నారని ైవైస్ చాన్స్లర్లు, విశ్వవిద్యాలయ అధికారులు ఆర్టీఐని నిందిస్తూ ఉంటారు. కాని ఆర్టీఐ ఒక వైస్ చాన్స్‌లర్‌కు కూడా ఏ విధంగా న్యాయమైన సాయం అందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాం సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. ముందు ఇన్చార్జిగా ఆ తరువాత పూర్తికాలపు వైస్ చాన్స్‌లర్ గానూ ప్రొఫెసర్ అస్లాం నియమితులైనారు. ఇగ్నో కొన్ని అవకతవకలకు, లోపాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపైన 18 నవంబర్ 2014న దర్యాప్తునకు ఆదేశించారు. అనుమతి లేకుండా క్యాంపస్ బయట సెంటర్లు తెరవడం, జ్ఞాన్ దర్శన్, జ్ఞాన్ వాణి టీవీ కార్యక్రమాలను నిలిపివేయడం, భారత సైన్యానికి ఉద్దేశించిన కోర్సులను మూసివేయడం, చాలా మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయవలసి రావడం, నిధులు వచ్చినా చైర్ నియామకాలు జరపకపోవడం, రిజిస్టర్ చేయకుండా ఇగ్నో రిలీఫ్ ఫండ్‌ను సృష్టించడం, భారత సైన్యం 28 కోట్లు, వైమానిక దళం ఉద్యోగులు 5 కోట్లు నిధులు ఇచ్చినా వారికి పరీక్ష లు నిర్వహించకపోవడం వంటి అవకతవకల గురించి విచారణ ను ఆదేశించారు. గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆధ్వర్యంలో విచారణ సమంజసంగా జరగడానికి వీలుగా 28.11.2014 నాడు ైవైస్ చాన్స్‌లర్‌ను సెలవుపై వెళ్లమని మానవ వనరుల మంత్రిత్వ అధికారులు ఆదేశించారు. ఇది కేవలం విచారణే కాని వైస్ చాన్స్‌లర్ పైన నిందారోపణ కాదని ఆ శాఖ వివరించింది. దర్యాప్తు పూర్తయి నివేదిక సిద్ధంగా ఉన్నా తనకు ఇవ్వడం లేదని సహ దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే నివేదికను పరిగణించేముందు, ప్రొఫెసర్ అస్లాంను మళ్లీ పదవిలోకి తీసుకునే ముందు తమ అనుమతి తీసుకోవాలని 20.2.2015న మంత్రిత్వ శాఖ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు లేఖ రాసింది. ఈ విచారణ నివేదికను ఇగ్నో విజిటర్ అయిన భారత రాష్ర్టపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ అస్లాం పిటిషన్‌పైన భారత ప్రభుత్వ న్యాయవాది విచారణ నివేదికను 3 సెప్టెంబర్ 2015న విజిటర్‌కు సమర్పిస్తామని ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చారు. అక్టోబర్ 7, 2015న హైకోర్టు విచారణ నివేదికను రాష్ర్టపతికి ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సారాంశాన్ని వెంటనే విడుదల చేయరాదని, మూసిన కవర్లో కోర్టుకు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించారు. రాష్ర్టపతి త్వరగా నిర్ణయం తీసుకునే వీలుందేమో ఆలోచించండి అంటూ ఢిల్లీ హైకోర్టు 15.12.2015న ఒక ఆదేశాన్ని జారీ చేసింది. 25.1.2016 నాడు మళ్లీ ఢిల్లీ హైకోర్టు విజిటర్ భారత రాష్ర్టపతి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తూ విచారణ ముగించింది. ఇంతకూ భారత రాష్ర్టపతికి నివే దిక అందిందా లేదా తెలియదు. విపరీ తంగా ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రొఫె సర్ అస్లాం వైస్ చాన్స్‌లర్ పదవీకాలం గడిచిపోతూ ఉంటుంది. సాధార ణంగా ఆలస్యం వల్ల కోరిన సమా చారం పనికి రాకుండా పోతుంది. కాని ప్రొఫెసర్ అస్లాం ఒక్కో రోజు ఆలస్యం వల్ల ఒక్కోరోజు పదవీకాలాన్ని కోల్పోతున్నారు. ఇంకొన్నాళ్లకు పదవీ కాలం పూర్తిగా ముగిసిపోవచ్చు. సమాచార వితరణలో ఆలస్యం సహ చట్టం కింద ఉల్లంఘనే. సమాచార నిరాకరణే కాకుండా, ప్రొఫెసర్ అస్లాం వైస్ చాన్స్‌లర్‌గా కొనసాగే హక్కుకూడా హరిస్తోంది. విచారణలో ఉంది కనుక నివేదిక ప్రతి ఇవ్వజాలమనే రక్షణ ఇప్పుడు ఎంహెచ్ఆర్డీకి లేదు. ఇగ్నో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అస్లాంకు దూరవిద్యలో నిపుణుడని మంచి పేరు ఉంది. ఆయనమీద వ్యక్తిగతమైన ఆరోపణేదీ లేదని సంబంధిత అధికారులే వివరణ ఇచ్చారు. సక్రమంగా పరిశోధన జరిపి ప్రొఫెసర్ అస్లాం సైరైన వ్యక్తి అని భావించి ఆయనను వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. విచారణ నివేదిక ఇవ్వకపోవడం వల్ల ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. ఏ దర్యాప్తు కారణంగా ఆయన సెలవుపై వెళ్లవలసి వచ్చిందో, ఆ ఆరోపణలపై దర్యాప్తు నివేదికను కోరుకునే హక్కు ప్రొఫెసర్ అస్లాంకు ఉంది. ఇది సహజన్యాయం కూడా. కానీ దర్యాప్తు నివేదికను ఇచ్చిన తరువాత కూడా రాష్ర్టపతికి ఇస్తున్నామని, మున్ముందు ఇస్తామని అంటూ కాపీ ఇవ్వకపోవడం న్యాయం కాదు. నివేదికను బట్టి సత్వర చర్య తీసుకోవడం సుపరిపాలన అవసరం. ఏ చర్యా తీసుకోకపోవడం వెనక ఏవో శక్తులు ఉన్నాయని ప్రొఫెసర్ అస్లాం అనుమానిస్తున్నారు. ప్రొఫెసర్ అస్లాం వయసుకు, పదవికి, పేరు ప్రతిష్టలకు కనీస గౌరవం ఇచ్చినా విచారణ నివేదికను నిలిపివేయడం జరిగేదికాదు. ఇప్పుడీ విచారణ నివేదిక రాష్ర్టపతికి ఇస్తారా ఇవ్వరా, దీనిపైన ఏవైనా చర్యలు ఉంటాయా లేదా? ప్రొఫెసర్ అస్లాంను వైస్ చాన్స్‌లర్ పదవిలోకి రానిస్తారా రానివ్వరా తెలియని గందరగోళం కొనసాగుతున్నది. నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాధికారులు కాలహరణం చేయడాన్ని ప్రశ్నించడానికే ఆర్టీఐ వచ్చింది. నివేదిక ప్రతి ఎప్పుడు ఇస్తారు? ఏ చర్య తీసుకున్నారు. నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కమిషన్ ఆదేశించింది. (ప్రొఫెసర్ అస్లాం, వర్సెస్ ఎంహెచ్ఆర్డీ CIC/CC/A/2015/004250-SA కేసులో 29.3.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్