అక్షయ్ 7/74 | akshay takes 7 wickets for nizam college | Sakshi
Sakshi News home page

అక్షయ్ 7/74

Published Sat, Aug 20 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

akshay takes 7 wickets for nizam college

సాక్షి, హైదరాబాద్: నిజామ్ కాలేజి బౌలర్ టి. అక్షయ్ (7/74) విజృంభించాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో బాలాజీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బాలాజీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫయాజ్ (63) రాణించగా, మిగిలిన వారిలో అజయ్ రెడ్డి 36, అబిద్ 36, మహిర్ విజయ్ 30 పరుగులు చేశారు.  చివరి రోజు ఆటలో అక్షయ్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం పొందిన నిజామ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల వద్ద ఆలౌటైంది. శరత్ 43 పరుగులు చేయగా, మహిర్ విజయ్‌కి 3 వికెట్లు దక్కాయి.


 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు


  గ్రీన్‌టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 202, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 111 (త్రిశాంక్ గుప్తా 5/52, సాయి శ్రాగ్వి 4/31), గ్రీన్‌టర్ఫ్ రెండో ఇన్నింగ్స్: 166/8 డిక్లేర్డ్ (అబ్దుల్ వాహిద్ 61, కుస్రో కిస్టీ 35; ఫర్దీన్ ఉమాని 6/55), మహమూద్ సీసీ రెండో ఇన్నింగ్స్: 121/3 (యశ్ బన్సాల్ 51, గణేష్ 51).
  డెక్కన్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 272, అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 318 (సయ్యద్ నూరుల్లా 102, అహ్మద్ షాజిల్ 80; మణికాంత్ 3/28, అఖిలేశ్ 3/52).
  విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 386/7 డిక్లేర్డ్, పీకేఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 233 (అభినవ్ 30, వరుణ్ 32), ఫాలోఆన్ రెండో ఇన్నింగ్: 56/6.
  నేషనల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 208, ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్: 313 (నాగ శ్రీనివాస్ 75, విన్సెంట్ వినయ్ 60, హరిబాబు 51, అబుబాకర్ 45; కేశవులు గౌడ్ 3/15).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement