భోపాల్: లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్‌వర్గియ పేర్కొన్నారు. అక్షయ్‌తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment