Akshay
-
పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే. ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. -
కాంగ్రెస్‌కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
భోపాల్: లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్‌వర్గియ పేర్కొన్నారు. అక్షయ్‌తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
నా కొడుకుది ప్రమాదం కాదు, కావాలనే ఇలా చేశారు!
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని నామాపూర్‌కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు. నామాపూర్‌కు చెందిన మంగళి అక్షయ్(17) సోమవారం చీకోడు నుంచి స్నేహితుడితో కలిసి నామాపూర్ వైపు వస్తుండగా వాహనంపై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అక్షయ్‌ను సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అక్షయ్ మృతిపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు శమంత, దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కాగానొక్క కొడుకు మృతితో తాము దిక్కులేని వారమయ్యామని వారు రోదించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. -
పౌరాణిక సినిమాలు చూసి ఆకర్షితుడై.. గోల్డ్ మెడల్! ఒలింపిక్స్ లక్ష్యంగా..
చాట్ల అక్షయ్.. విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. గురితప్పని సాధనతో విజయాలను తన విలువిద్యతో సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా పౌరాణిక సినిమాలు చూసే అలవాటున్న అక్షయ్ ఆ సినిమాల్లోని బాణాల వైపు ఆకర్షితుడయ్యాడు. అది గమనించిన తండ్రి ఆర్చరీలో శిక్షణను ఇప్పించడంతో అతనిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది. నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన చాట్ల రాజేష్, సుమలకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ విలువిద్యల్లో రాణిస్తున్నారు. పెద్దబ్బాయి చాట్ల అక్షయ్ మహదేవ్ 2019లో విలువిద్య సాధన ప్రారంభించారు. 3వ తరగతిలో ప్రారంభమైన విలువిద్య 8వ తరగతికి వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రారంభించిన ఏడాది నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. విలువిద్యలో మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఇండియన్ రౌండ్ సెగ్మెంట్ జాతీయ స్థాయిలో, రికార్వ్ సెగ్మెంట్ ఒలింపిక్స్‌లో, కాంపౌండ్ సెగ్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఆకాష్ మహదేవ్ క్లిష్టతరమైన రికార్వ్ సెగ్మెంట్లో రాణించడం విశేషం.- నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) కాస్ట్లీ క్రీడ... అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నెల్లూరులో ఆర్చరీకి తగిన ఆదరణ లేని సమయంలో అక్షయ్ మాధవ్ తాత చాట్ల నర్సింహారావు స్కూల్ డైరెక్టర్‌గా తన స్కూలు కోసం ఒక ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక విల్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటుంది. బాణాలు రూ.12 వేలు, రూ.40 వేలు వరకు విలువ చేస్తాయి. ఇక టార్గెట్ పేస్లు, టార్గెట్ బట్టర్స్ ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడినవే. ఇప్పటి వరకు విజయవాడ, హైదరాబాదులకు పరిమితమైన ఈ ఆర్చరీ శిక్షణ నెల్లూరులో ప్రారంభం కావడంతో అక్షయ్‌కు కలిసి వచ్చింది. ఖర్చు అధికమైనప్పటికీ ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 6.30 గంటల వరకు సాధన చేస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతూ పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించేవాడు. ఖర్చు అధికమైనప్పటికీ స్కూల్లో పిల్లలు సైతం విలు విద్యలో రాణిస్తారని, ఏకాగ్రత సాధించగలుగుతారని స్కూల్ డైరెక్టర్ చాట్ల నర్సింహారావు తెలిపారు. అక్షయ్ మహదేవ్లో విలువిద్య క్రీడా ఆసక్తిని గమనించిన తండ్రి రాజేష్ శిక్షణ ఇప్పించేందుకు జార్ఖండ్ నుంచి దివ్య ప్రకాష్‌ను ఎంపిక చేసుకున్నారు. కోచ్ దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం సాధనలు చేస్తున్నాడు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పావురాల వేణు, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి సత్యనారాయణలు మంచి సహాయ సహకారాలను అందచేస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు బాటలు వేస్తున్నారు. పతకాలిలా... 2022వ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అక్షయ్ ప్రతిభ కనపరిచారు. 2023 జూలైలో శ్రీలంకలో జరిగిన కొలంబో ఓపెన్ ఆర్చరీ ఇంటర్నేషనల్ పోటీల్లో అండర్–12 రికార్వ్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను, 30 మీటర్ల ఓపెన్ రికార్వ్ పోటీల్లో సిల్వర్ మెడల్‌ను సాధించి అబ్బుర పరిచారు. గోల్డ్ మెడల్ లక్ష్యం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి పేరు తెస్తాను. చదువుల్లో రాణించి ఐఏఎస్ అధికారి కావాలన్నది కోరిక. ఉదయం సాయంత్రం సాధన చేస్తూ చదువుల్లో కూడా రాణిస్తాను. పోటీల్లో పాల్గొనడం వల్ల వివిధ క్రీడాకారుల ఆట తీరు, పలు ప్రాంతాల పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. చదువుకుంటూనే ఇష్టమైన క్రీడల్లో రాణించవచ్చు. తాతయ్య, అమ్మ నాన్నలు, కోచ్‌లు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. – చాట్ల అక్షయ్ మహదేవ్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
గెలుపు గ్రామర్
విజయం సాధించడంలో ఎంత కిక్ ఉందో....ఇతరులను విజయం సాధించేలా చేయడంలో అంత కంటే ఎక్కువ కిక్ ఉంది!ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ప్రిప్‌ఇన్‌స్టా’తో ఆశయ్ మిశ్రా, కౌశిక్, మనీష్ అగర్వాల్‌లు విజయం సాధించడమే కాదు యువత తమ కలలు సాకారం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు... కౌశిక్, ఆశయ్ మిశ్రా, మనీష్ అగర్వాల్‌లు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటీ యూనివర్శిటీ, తమిళనాడు)లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత బెంగళూరులో వేరు వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు.‘చాలామంది స్టూడెంట్స్‌లో ప్రతిభ ఉన్నా తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారిలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడంలో అనుసరించాల్సిన వ్యూహంపై అవగాహన లేకపోవడం...’ ఇలాంటి ఆలోచనలను రెగ్యులర్‌గా బ్లాగ్‌లో రాసేవాడు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న కౌశిక్.తన బ్లాగ్ ఎంత హిట్ అయిందంటే సంవత్సరం తిరిగేసరికల్లా నెలకు లక్ష వ్యూలు వచ్చేవి.ఆ టైమ్‌లోనే కౌశిక్‌కు ‘ఫ్లిప్‌కార్ట్’ నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే దాన్ని కాదనుకొని ఇద్దరు మిత్రులతో మాట్లాడాడు.అలా ఈ ముగ్గురి మేధో మథనం నుంచి పుట్టిందే... ప్రిప్‌ఇన్‌స్టా.ప్రిప్‌ఇన్‌స్టా(ప్రిపేర్ ఫర్ ప్లేస్‌మెంట్స్ ఇన్స్టంట్లీ) అనేది వోటీటీ ఫార్మట్ ప్లాట్‌ఫామ్. యూజర్లు డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ టైమ్‌లో(నెలలు లేదా సంవత్సరాలు) 200 కోర్సులతో యాక్సెస్ కావచ్చు. అప్స్కిలింగ్ సబ్జెక్ట్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (లాజిక్, వెర్బల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్)...మొదలైనవి ఆ కోర్సులలో ఉంటాయి.‘ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. యూత్ తమ డ్రీమ్ జాబ్స్‌ను గెలుచుకునేలా చేయడంలో మా ప్లాట్‌ఫామ్ విజయం సాధించింది’ అంటున్నాడు కో–ఫౌండర్ ఆశయ్ మిశ్రా. నోయిడా(ఉత్తర్‌ప్రదేశ్), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ యాభైకి పైగా కాలేజీలతో కలిసిపనిచేస్తుంది. రాబోయే కాలంలో మూడు వందల కాలేజీలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.‘మాది సెల్ఫ్–పేస్డ్ ప్లాట్‌ఫామ్. స్టూడెంట్స్ తమకు అనుకూలమైన టైమ్, షెడ్యూల్లో చదువుకోవచ్చు.బీ2సీ (బిజినెస్–టు–కన్జ్యూమర్) మోడల్లో ఈ ప్లాట్‌ఫామ్‌కు 2.25 లక్షల పెయిడ్ యాక్టివ్ సబ్స్రైబర్లు ఉన్నారు. కోవిడ్ కల్లోల కాలంలో మాత్రం ఈ స్టార్టప్ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం సగానికి సగం పడిపోయింది. పేరున్న ఎడ్టెక్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. ‘నిరాశ’ మెల్లిగా దారి చేసుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సమయంలో గట్టిగా నిలబడ్డారు ముగ్గురు మిత్రులు. కంపెనీని రీవ్యాంప్ చేశారు. ఉద్యోగుల సంఖ్యను పెంచారు.‘ఇక కనిపించదు’ అనుకున్న కంపెనీ లేచి నిలబడి కాలర్ ఎగరేసింది! 25 కోట్ల క్లబ్లో చేరిన ఈ స్టార్టప్ తన విస్తరణలో భాగంగా వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.రిస్క్ అనిపించే చోట ‘ప్లాన్ బీ’ను దృష్టిలో పెట్టుకోవడం మామూలే. అయితే ‘ప్లాన్ ఏ’ పకడ్బందీగా ఉంటే ‘బీ’తో ఏంపని? అని ఈ ముగ్గురు అనుకున్నారు. వారి నమ్మకం నిజమైంది . ఎన్నో ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్‌ఇన్‌స్టా తీసుకువచ్చాం. – ఆశయ్ మిశ్రా -
బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు బంగారం గిఫ్ట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో పలు భాషల్లో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తెలుగులో ఆరో సీజన్ ముగియగా తాజాగా మరాఠీలో నాలుగో సీజన్‌కు గ్రాండ్‌గా ముగింపు పలికారు. వంద రోజుల పాటు హౌస్‌లో ఉండి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హిందీ నటుడు అక్షయ్ కేల్కర్ ట్రోఫీ అందుకున్నాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న అక్షయ్ ట్రోఫీతో పాటు గోల్డ్ బ్రాస్లెట్, రూ.15,55,000 నగదు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ బెస్ట్ కెప్టెన్‌గా అవతరించినందుకుగానూ మరో రూ.5 లక్షలు విలువైన చెక్ అందుకున్నాడు. వంద రోజులపైనే సాగిన ఈ షోకు నటుడు మహేశ్ మంజ్రేకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అక్షయ్‌ను విన్నర్‌గా ప్రకటించాడు. ఇక ఈ షోలో అపూర్వ నెమ్లేకర్ ఫస్ట్ రన్నరప్‌గా, కిరణ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. వివాదాస్పద నటి రాఖీ సావంత్ రూ.9 లక్షలతో పోటీ నుంచి వైదొలగింది. సీజన్ విన్నర్‌గా నిలిచిన అక్షయ్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Akshay Kelkar (@akshaykelkar) View this post on Instagram A post shared by Nirom मराठी (@nirom_marathi_official) చదవండి: కేజీఎఫ్ సినిమాలో యశ్ కనిపించడా? -
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్. అదేలా అంటే... ‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం... అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్. వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్లాంటి కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో. దీనికి ముందు... పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్లైన్ మార్కెట్ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు. ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’ పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. -
'సంతోషం'లో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2002లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునకు జంటగా శ్రియా సరన్ నటించింది. మ్యూజికల్‌గానూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన బుడ్డోడు గుర్తున్నాడా? పెద్ద కళ్లద్దాలతో ఎంతో క్యూట్‌గా అలరించిన ఆ బుడతడి పేరు అక్షయ్ బుచ్చు. ఓ బాలీవుడ్ చిత్రంలో అక్షయ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిన నాగార్జున సంతోషం సినిమాలో ఛాన్స్ ఇప్పిచ్చాడట. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో ప్రభాస్, త్రిష నటించిన వర్షం సినిమాలోనూ నటించాడు. సంతోషం సినిమా టైంకి అక్షయ్ వయస్సు కేవలం ఆరు సంవత్సరాలేనట. అంతకుముందే పలు సినిమాల్లో నటించినా అక్షయ్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కానీ సంతోషం హిట్‌తో అక్షయ్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఎందుకో కానీ టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్లోనే సెటిల్ అయిపోడారు. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అంతేకాకుండా దాదాపు 45 యాడ్ ఫిల్మ్స్‌లోనూ నటించి మరింత పాపులర్ అయ్యాడు. తర్వాత కొద్దికాలం యాక్టింగ్ కెరీర్ నుంచి బ్రేక్ తీసుకున్న అక్షయ్.. ప్రస్తుతం సింగర్‌గా అలరిస్తున్నాడు. అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోవైపు సింగర్‌గానూ అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు హిందీ పాటలు పాడుతూ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నాడు. సాంగ్స్ పాడుతూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నాడు. చదవండి : 'డాడీ' మూవీ చిన్నారి ఇప్పుడు ఎక్కడుందంటే... బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రియల్ లైఫ్ ట్రైలర్
అన్ని థియేటర్లలో ‘ప్యాడ్‌మ్యాన్’ ట్రైలర్ చూపిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను చూస్తూ మహిళా ప్రేక్షకులు బిడియపడుతున్నారు. వాస్తవానికది ఒక మహోన్నతమైన సందేశాన్నిచ్చే చిత్రం. ‘మగవాళ్లకేం తెలుసు ఆడవాళ్ల ఇబ్బందులు. వాళ్లకేమైనా నెలసరి పాట్లు ఉంటే కదా’ అని హీరో అక్షయ్‌కుమార్ ట్రైలర్లో అంటాడు. ఎంత ఉన్నతమైన సందేశం అయినా, బహిరంగంగా వినడానికి, చూడ్డానికీ, మాట్లాడుకోడానికి మొహమాట పడే సబ్జెక్ట్ ఇది. పిక్చర్ ఈ నెల 9న రిలీజ్ అవుతోంది. ఆ లోగా సొసైటీని ఈ థీమ్‌కి, ఈ పిక్చర్‌కి మెల్లిమెల్లిగా రెడీ చేయడానికేనేమో బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో ‘ప్యాడ్‌మ్యాన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. శానిటరీ ప్యాడ్‌ని చేత్తో పట్టుకుని ఫొటో తీయించుకుని దానిని అప్లోడ్ చేస్తున్నారు. ఇంతవరకు ఆమిర్‌ఖాన్, దీపికా పదుకోన్, అక్షయ్‌కుమార్, సోనమ్ కపూర్, అతిథి రావ్ హైదరీ, రాధికా ఆప్టే, ఆలియా భట్, దియా మీర్జా, ట్వింకిల్ ఖన్నా, స్వరా భాస్కర్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, షబానా అజ్మీ.. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు. నేప్కిన్ ప్యాడ్స్‌ని కొని తేవడానికే తటపటాయించే మగధీరులు బహుశా ఈ సినిమా చూశాక కొద్దిగా ధైర్యాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు. -
పట్టుబిగించిన విదర్భ
ఇండోర్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన విదర్భ జట్టు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో పటిష్ట స్థితిలో నిలిచింది. అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీకి తోడు ఆదిత్య సర్వతే, సిద్ధేశ్ నేరల్లు అర్ధశతకాలు సాధించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి విదర్భ 156 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. అంతకుముందు 206/4తో ఆట కొనసాగించిన విదర్భ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (78), వాఖరే (17) త్వరగానే పెవిలియన్ చేరినా... వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (243 బంతుల్లో 133 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఆదిత్య సర్వతే (79; 11 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 169 పరుగులు జోడించిన అతను.. సర్వతే అవుటైన అనంతరం సిద్ధేశ్ నెరల్ (92 బంతుల్లో 56 బ్యాటింగ్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అభేద్యమైన 113 పరుగుల జతచేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మూడో రోజు మొత్తం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 322 పరుగులు చేయడం విదర్భ ఆధిపత్యాన్ని చూపి స్తోంది. ఢిల్లీ బౌలర్లలో సైనీకి 3, ఆకాశ్‌కు 2 వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 233 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కోలుకొని మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా నడిపించగలిగినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ మొదటి సారి రంజీ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
రజనీకి పోటీగానా... నో చాన్స్!
చాన్సే లేదు... రజనీకాంత్ ‘2.0’కి పోటీగా అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్మాన్’ వచ్చే చాన్సే లేదు. ఎందుకంటే... ‘నా సినిమాతో నేనెందుకు పోటీ పడతా?’ అనడుగుతున్నారు అక్షయ్! ‘2.0’ను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ను జనవరి 26న (అంటే ‘2.0’ విడుదల తర్వాతి రోజున) విడుదల చేస్తామని ఆ యూనిట్ ప్రకటించింది. ‘2.0’లో ఈ హిందీ హీరో యాంటీ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అదేంటి? విలన్‌గా నటించిన సిన్మాకి పోటీగా హీరోగా నటించిన సిన్మాను అక్షయ్ ఎలా విడుదల చేస్తానంటున్నారు? రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పదా? అని అనుకున్నారంతా! ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే... ‘‘నా సినిమాకి పోటీగా నేను నటించిన మరో సినిమా రిలీజ్‌ను ఎందుకు ప్లాన్ చేస్తా? నాకు తెలిసి... ఇప్పటివరకూ ‘2.0’ విడుదల తేదీ ఖరారు కాలేదు. ఒకవేళ రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ‘2.0’ను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటిస్తే, ‘ప్యాడ్మాన్’ను విడుదల చేయను’’ అని క్లారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే... అక్షయ్ అండ్ కో ‘ప్యాడ్మాన్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 13న విడుదల చేయాలనుకున్నారు. ‘2.0’ వెనక్కి వెళ్తుందని తెలిసిందో ఏమో... విడుదల తేదీని జనవరికి జరిపారు. అక్షయ్ చెప్పిన మాటలను బట్టి ఒక్కటి స్పష్టమైంది. అయితే ‘2.0’... లేదంటే ‘ప్యాడ్మాన్’... రెండిటిలో ఏదో ఒక్క సినిమాయే జనవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది!! -
అక్షయ్‌కి అలియా పంచ్
-
అక్షయ్ 7/74
సాక్షి, హైదరాబాద్: నిజామ్ కాలేజి బౌలర్ టి. అక్షయ్ (7/74) విజృంభించాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో బాలాజీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బాలాజీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫయాజ్ (63) రాణించగా, మిగిలిన వారిలో అజయ్ రెడ్డి 36, అబిద్ 36, మహిర్ విజయ్ 30 పరుగులు చేశారు. చివరి రోజు ఆటలో అక్షయ్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం పొందిన నిజామ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల వద్ద ఆలౌటైంది. శరత్ 43 పరుగులు చేయగా, మహిర్ విజయ్‌కి 3 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గ్రీన్‌టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 202, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 111 (త్రిశాంక్ గుప్తా 5/52, సాయి శ్రాగ్వి 4/31), గ్రీన్‌టర్ఫ్ రెండో ఇన్నింగ్స్: 166/8 డిక్లేర్డ్ (అబ్దుల్ వాహిద్ 61, కుస్రో కిస్టీ 35; ఫర్దీన్ ఉమాని 6/55), మహమూద్ సీసీ రెండో ఇన్నింగ్స్: 121/3 (యశ్ బన్సాల్ 51, గణేష్ 51). డెక్కన్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 272, అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 318 (సయ్యద్ నూరుల్లా 102, అహ్మద్ షాజిల్ 80; మణికాంత్ 3/28, అఖిలేశ్ 3/52). విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 386/7 డిక్లేర్డ్, పీకేఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 233 (అభినవ్ 30, వరుణ్ 32), ఫాలోఆన్ రెండో ఇన్నింగ్: 56/6. నేషనల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 208, ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 313 (నాగ శ్రీనివాస్ 75, విన్సెంట్ వినయ్ 60, హరిబాబు 51, అబుబాకర్ 45; కేశవులు గౌడ్ 3/15). -
'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..
-
'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..
ఆగస్టు 12 న విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తారల్లో కూడా ఆ మానియా ఊపందుకుంది. అక్షయ్ రుస్తుం సినిమా విడుదలకు ఆత్రుతతో ఎదురుచూస్తున్న విషయాన్ని యువతార అలియా భట్ కళాత్మకంగా తెలిసింది. అక్షయ్, రవీనాల హిట్ సినిమా 'మొహ్రా'లో కుర్రకారును ఊపేపిన వాన పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌తోపాటు అక్షయ్‌ను కూడా ఫిదా చేసింది ఉడ్తా పంజాబ్ స్టార్. ఆ పాటలో రవీనా కట్టుకున్న పసుపు రంగు చీరనే ధరించి.. అచ్చంగా ఆమెలానే డ్యాన్స్ చేసింది అలియా. తన తల మీద నేవల్ ఆఫీసర్స్ క్యాప్‌ను ధరించి 'రుస్తుం' సినిమాను ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో అక్షయ్ తొలిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ వీడియోను చూసిన అక్షయ్.. ఇక నుంచి నా ప్రతి సినిమాలో ఓ వాన పాట తప్పనిసరి అవుతుంది, సూపర్బ్ అలియా అంటూ ట్వీట్ చేశారు. అలియా అభిమానులైతే ఆ వీడియోను షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. After this act you're sure to get a mandatory rain song in every film -
ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్!
ఇటీవల వినూత్న లుక్ లో అలరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ స్పోర్ట్స్ హెయిర్ స్టయిల్ వెనుక రహస్యం ఏమిటి అంటే... అంతా ఆయన క్రీడాభిమాని అవటం వల్లేనట. అదొక్కటే అసలు కారణం కాదు. చిన్నపాటి క్రాఫ్ ను తిన్నగా పాపిడి తీసి దువ్వినట్లుగా కనిపిస్తున్నఆయన కొత్త హెయిర్ స్టయిల్ వెనుక క్రీడాభిమానంతోపాటు మరో కారణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికే ట్రయలర్ తో అభిమానులను అలరిస్తూ త్వరలో విడుదల కాబోతున్నఅక్షయ్ చిత్రం.. 'హౌస్ ఫుల్ 3' నేపథ్యంలోనిదే ఆయన క్రాప్ వెనుక కథ. అక్షయ్... ఆ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రోనాల్డో, సెర్జియో ఆగ్రో కేశాలంకరణను అనుకరించే కొత్త లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. క్రీడలపై తనకున్న ప్రేమ దాచేది కాదని... అది క్రికెట్, కరాటే, ఫుడ్‌బాల్ వంటివి ఏవైనా కావచ్చొని అక్షయ్ కుమార్ అంటున్నారు. అయితే వర్షాలు ఇతర అన్ని క్రీడలకు అడ్డంకిగా మారినా, ఫుడ్ బాల్ విషయంలో మాత్రం అటువంటి ఇబ్బంది ఎదురుకాదని, వర్షంలో కూడా ఎంతో ఎంజాయ్ చెయ్యగలిగే ఆటగా అక్షయ్ పేర్కొన్నారు. బంతిని ఒక్క తన్నుతన్ని కింద పడటం... బట్టలపై నీళ్ళుపడి మురికైపోవడం సాధారణంగా అందరికీ ఉండే మంచి అనుభవమని, కొడుకు ఆరవ్, తాను రుతుపవనాలు వస్తే ఫుడ్ బాల్ ఆడాలని ఎదురు చూస్తుంటామని, ఎందుకంటే అది తమ ఇద్దరికీ ఎంతో ఇష్టమని అక్షయ్ తెలిపారు. ఇక 'హౌస్ ఫుల్ 3' విషయానికి వస్తే... ఆ సినిమాలో తాను ఫుడ్ బాల్ ప్లేయర్ అని, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్ లతో సినిమా కోసం ఫుట్ బాల్ సరదాగా ఆడటం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అక్షయ్ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, నార్గిస్ ఫఖ్రి, లిసా హాయ్దోన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ తారాగణంగా నటిస్తున్న'హౌస్ ఫుల్ 3' చిత్రం.. మూడు నిమిషాల ఫస్ట్ ట్రయలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 3న విడుదలకు సిద్ధమౌతోంది. -
నయా నేరగాళ్లు!
మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆగస్టు 28న స్నాచింగ్ కేసుల్లో అక్షయ్ శర్మ, సుమిత్ కుమార్, సయ్యద్ అబ్దుల్ మెహిద్లను అరెస్టు చేశారు. బేగంబజార్‌కు చెందిన అక్షయ్, సుమిత్‌లు బాగా స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. కేవలం జల్సాల కోసం నేరబాటపట్టి పోలీసులకు చిక్కారు. - సాక్షి, సిటీబ్యూరో అక్షయ్, సుమిత్‌ల ఉదంతమే కాదు. ఇటీవల కాలంలో జల్సాల కోసం నేరాల బాటపడుతున్న యువత, విద్యాధికుల ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. వీరు చేస్తున్న నేరాల్లో స్నాచింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 2013-2015 అక్టోబర్ మధ్య నమోదైన స్నాచింగ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే పోలీసులకు చిక్కిన నేరగాళ్ళలో 40.87 శాతం కొత్త వారే. మారిన జీవన విధానం, పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరగాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడం సైతం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. స్నాచింగ్సే ఎందుకంటే..? ‘నయా’ నేరగాళ్ళు చేస్తున్న నేరాల్లో చైన్ స్నాచింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణంగా ఈజీ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. ఓ ఇంట్లోనో, దుకాణంలోనూ దొంగతనం చేయాలంటే దానికి భారీ తతంగం తప్పదు. రెక్కీ, చుట్టు పక్కల పరిస్థితుల అధ్యయనం తదితరాల తరవాతే ఇంట్లోకో/దుకాణంలోకో ప్రవేశించాల్సి ఉంటుంది. అంత ‘కష్టపడినా’ ఎంత వరకు ‘గిట్టుబాటు’ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అదే స్నాచింగ్ చేయడానికి నేరగాళ్ళు పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం ఉండదు. ఓ అనుచరుడిని తీసుకుని, ద్విచక్ర వాహనంపై రోడ్డమీదికి వస్తే సరిపోతుంది. మార్కెట్లో పెరిగిన బంగారం రేట్ల కారణంగా ఒక్క గొలుసు చోరీ చేసినా కనీసం రూ.10 వేలు ఎక్కడికీ పోవు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొత్త నేరగాళ్ళు స్నాచింగ్స్ వైపు మళ్ళుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెరుగ్గా మొదలెట్టి భేషుగ్గా... కొత్త నేరగాళ్లు తొలినాళ్లలో కొంత బెరుగ్గానే నేరాలు చేస్తున్నారు. ఒక నేరం చేసిన తరవాత ఈజీ మనీకి అలవాటు పడిపోయి పట్టుబడే వరకు వరుసగా చేసుకుపోతున్నారు. పోలీసులకు చిక్కి, జైలుకు వెళ్తున్న తరవాత చట్టాల్లో ఉన్న లోపాలు, తేలిగ్గా బెయిల్స్ దొరుకుతున్న విధానం, తీర్పులు వెలువడటంలో ఉన్న జాప్యం...ఇవన్నీ వీరిని అదే బాటలో కొనసాగేలా పురిగొల్పుతున్నాయి. నివాస ప్రాంతాలు, పేర్లను తరచుగా మార్చుకుంటూ భేషుగ్గా నేరాలు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని స్నాచర్లు రెచ్చిపోయే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇళ్ళల్లోకి వచ్చి, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్న వారినీ టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నారు. కారణాలనేకం... యువతలో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడానికి సామాజిక, ఆర్థిక, కుటుంబ పరంగా అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సమాజంలో విలాసాలు అనేవి ఒకప్పుడు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనం, సెల్ఫోన్లు, పార్టీలు కాలక్రమంలో నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. గ్రామాల నుంచి నగరాలకు వస్తున్న వారు, నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి వారు వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒకసారి విలాసాలకు అలవాటుపడి పదే పదే అలాంటి జీవితం కోసం ఈజీమనీ వైపు మొగ్గి స్నాచింగ్ తరహా నేరాల బాటపడుతున్నారు. నగర యువత కూడా గర్ల్‌ఫ్రెండ్స్, స్నేహితురాళ్లతో షికార్ల కోసం, వారిని మెప్పించేలా ఖర్చులు చేయడం కోసం నేరగాళ్లుగా మారిన ఉదంతాలూ అనేకం ఉన్నాయి. తల్లిదండ్రుల అజమాయిషీ లేక... నగరంలో ఒంటరి జీవులు పెరిగిపోతున్నారు. చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు అనేక మంది వలస వస్తున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగింది. ఇలా వస్తున్న యువత తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా సహోద్యోగులు, మిత్రులతో కలిసో, ఒంటరిగానో జీవిస్తున్నారు. దీంతో ఏం చేసినా పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు. నగరంలోనూ మారిన జీవన విధానం, చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషీ తక్కువగా ఉంటోంది. వీరి బాగోగులు పట్టించుకోవడం, కదలికల్ని కనిపెట్టడంలో వారు విఫలం కావడంతో పెడదారి పడుతున్న యువకుల సంఖ్య ఎక్కువ అవుతోందన్నది పోలీసుల మాట. విలాసాల కోసమే అధికంగా... సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. విలాసాలకు బానిసలుగా మారుతున్న ఉన్నత విద్యావంతులు, పెద్ద కుటుంబాలకు చెందిన వారు కూడా స్నాచింగ్స్ వంటి నేరాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ పరిణామం పోలీసులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పేరుమోసిన దొంగలు, ముఠాలకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరిపై కన్నేసి ఉంచుతారు. అయితే కొత్తగా పుట్టుకు వస్తున్న ఈ కొత్త దొంగల కారణంగా కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగి, కొలిక్కితేవడం కష్టసాధ్యంగా మారుతోందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. స్నాచింగ్ వంటి నేరాల్లో వేలిముద్రలు వంటి ఆధారాలు సైతం ఉండవు. దీంతో పక్కా సమాచారంతో నేరగాళ్ళను పట్టుకునే వరకు ఆ కేసులు కొలిక్కి రావట్లేదు. అర్బనైజ్డ్ క్రైమ్‌గా స్నాచింగ్స్... అర్బనైజ్డ్ క్రైమ్‌గా మారిన చైన్‌స్నాచింగ్స్ బెడద కేవలం జంట కమిషనరేట్లకే కాదు... దేశ వ్యాప్తంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా వెయ్యికి తగ్గకుండా స్నాచింగ్స్ చోటు చేసుకుంటున్నాయి. 2013లో మూడు వేలు, 2014లో ఏకంగా ఏడువేలు దాటాయి. ముంబైలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అక్కడి పోలీసు చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 2834 ఉదంతాలు జరిగాయి. దీంతో ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) సైతం స్నాచర్ల కోసం వేట ప్రారంభించింది. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలోనూ అర్బనైజ్డ్ క్రైమ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ ‘గొలుసులు’ లేకపోవడంతో వాహనాల చోరీలు జరుగుతాయని వివరిస్తున్నారు. సింగిల్ హ్యాండ్ స్నాచర్... స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, హెల్మెట్టు, మాస్క్‌తో దూసుకువచ్చి పంజా విసిరే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. అయితే నగరంలో ఇటీవల ఓ ‘సింగిల్ స్నాచింగ్’ సైతం జరిగింది. గత నెల 29 అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటోను వెంబడిస్తూ వచ్చిన స్నాచర్ ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుపోయాడు. -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
బాల్కొండ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన అక్షయ్(19) ఇంటర్మీడియట్ మధ్యలో నిలిపి వేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తల్లి సుజాత పోలీసులకు సమాచారం అందించింది. ఉరికి గల కారణాలు తెలియలేదు. మృతుడి తండ్రి మర్రెన్న 15 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. దీంతో తల్లి సుజాత అక్షయ్‌ని అల్లారుముద్దుగా పెంచింది. కన్న కొడుకు, కట్టుకున్న భర్త ఇద్దరూ చనిపోవడంతో సుజాత కన్నీరుమున్నీరైంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతికి గత కారణాలపై ఆరా తీస్తున్నారు. -
ఆస్తి కోసం ఉన్మాదం
తల్లి, భార్య, కూతురిని గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి బాలాపూర్‌లో ఘోరం హైదరాబాద్: ఆస్తిపై పెంచుకున్న మమకారం ముందు రక్త సంబంధం ఓడింది. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురి గొంతుకోసి ముగ్గురినీ దారుణంగా హత్యచేశాడు. మరో కుమార్తె త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంత బాలాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు సంరెడ్డి బల్వంత్‌రెడ్డి, సుభద్ర(65) దంపతుల కుమారులు గోవింద్‌రెడ్డి, రాంరెడ్డి. 2013లో సాయినగర్‌లో నిర్మించిన కొత్త భవనంలోకి వీరంతా మకాం మార్చారు. మొదటి అంతస్తులో రాంరెడ్డి తన భార్య రాధిక (36), కుమార్తెలు ప్రత్యూష (16), అక్షయ (14)లతో నివాసముంటుండగా రెండో అంతస్తులో ఉంటున్న గోవింద్‌రెడ్డి తల్లిదండ్రులనూ తనవద్దే ఉంచుకున్నాడు. ఇల్లు నచ్చలేదంటూ... ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే రాంరెడ్డి తనకు ఇల్లు నచ్చడం లేదని, వేరే ఇల్లు కట్టుకుంటానంటూ అందరికీ తరచూ చెప్పేవాడు. వారు అతని ప్రతిపాదనను వ్యతిరేకించేవారు. ఇలా అతని ధోరణిలో మార్పు రాకపోవడంతో పాటు ఆస్తికోసం వేధింపులు పెరగడంతో తండ్రి బల్వంత్‌రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన ఇరువురి కోడళ్ల పేరిట రాశాడు. ఇది వారి మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి. సొంత కుటుంబీకులూ అతని తీరును వ్యతిరేకించ డంతో అందరిపైనా రాంరెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు నిద్రపోతున్న భార్య రాధిక గొంతును కత్తితో కోసి చంపాడు. అదే విధంగా నిద్రలో ఉన్న తల్లినీ హత్య చేశాడు. ఆమె పక్కనే పడుకున్న కూతుళ్లు అక్షయ, ప్రత్యూషలు పరిస్థితిని గమనించి పారిపోయేందుకు యత్నించగా అక్షయను వెంబడించి వంటగదిలో అంతమొందించాడు. ప్రత్యూష మాత్రం బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని కేకలు వేసింది. దీంతో అదే ఇంట్లో పై పోర్షన్లో ఉన్న గోవింద్ కిందికి రాగానే రాంరెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఏసీపీ సుదర్శన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా బయటకు వెళ్లిన నిందితుడు సాయిహోమ్స్కాలనీలోని ఓ బావిలోకి దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాంరెడ్డి తనకు కారు కొనివ్వాలంటూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. -
తుమ్మెద గీతాలు
రాజా, వర్షపాండే, విజయ్‌ధరణ్, అక్షయ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘తుమ్మెద’. ‘మనసులేని ప్రేమికుల కథ’ అనేది ఉపశీర్షిక. కె.నారాయణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నరేష్ అడపా, సరయు చిట్టాల, అడపా కొండలరావు నిర్మాతలు. ఎం.ఆర్. స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని డీఎస్ రావుకి అందించారు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ‘ఆనంద్’ తర్వాత తనకు మళ్లీ అంతటి పేరు తెచ్చే సినిమా అవుతుందని రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల యూనిట్ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేశారు. -
‘రాజమహల్’లో రహస్యం
హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాజమహల్’. అప్పాజీ కొండా దర్శకుడు. సన్ ఐ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్యనాథ్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఆరుగురు హీరోయిన్లు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథా కథనాలు వైరైటీగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. మిగిలిన షూటింగ్‌ని త్వరలో పూర్తి చేసి, డిసెంబర్లో పాటలను, ఫిబ్రవరి రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రియా, అక్షయ, సుమన్, జీవా, సూర్య, కాదంబరి కిరణ్‌కుమార్, జయవాణి, సందీప్తి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: సురేష్ యువన్. -
బంగారం కోసం పాతబస్తీలో చిన్నారి కిడ్నాప్
పాత బస్తీలో బంగారం కోసం రెండేళ్ల చిన్నారి అక్షయ్ కిడ్నాప్ గురైన ఘటన ఆలస్యం వెలుగులోకి రావడం ఆప్రాంతంలో సంచలనం రేపింది. వారం క్రితమే చిన్నారి కిడ్నాప్ గురైందని బంధువులు తెలిపారు. కిడ్నాపర్లు 3 కిలోల బంగారం కోసం కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని బంధువులు తెలిపారు. కిడ్నాప్ వ్యవహారం విషయం బయటకు పొక్కితే చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా కిడ్నాప్ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్గ్ అయ్యారు. కిడ్నాప్ వ్యవహారాన్ని చేధించేందుకు పోలీసులు వివరాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.