తుమ్మెద గీతాలు | Tummeda movie audio released | Sakshi
Sakshi News home page

తుమ్మెద గీతాలు

Published Mon, Nov 25 2013 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

తుమ్మెద గీతాలు

తుమ్మెద గీతాలు

రాజా, వర్షపాండే, విజయ్‌ధరణ్, అక్షయ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘తుమ్మెద’. ‘మనసులేని ప్రేమికుల కథ’

రాజా, వర్షపాండే, విజయ్‌ధరణ్, అక్షయ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘తుమ్మెద’. ‘మనసులేని ప్రేమికుల కథ’ అనేది ఉపశీర్షిక. కె.నారాయణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నరేష్ అడపా, సరయు చిట్టాల, అడపా కొండలరావు నిర్మాతలు. ఎం.ఆర్. స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని డీఎస్ రావుకి అందించారు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ‘ఆనంద్’ తర్వాత తనకు మళ్లీ అంతటి పేరు తెచ్చే సినిమా అవుతుందని రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల యూనిట్ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement