బంగారం కోసం పాతబస్తీలో చిన్నారి కిడ్నాప్ | Two year baby kidnapped in Old city of Hyderabad | Sakshi
Sakshi News home page

బంగారం కోసం పాతబస్తీలో చిన్నారి కిడ్నాప్

Published Fri, Nov 8 2013 7:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Two year baby kidnapped in Old city of Hyderabad

పాత బస్తీలో బంగారం కోసం రెండేళ్ల చిన్నారి అక్షయ్ కిడ్నాప్ గురైన ఘటన ఆలస్యం వెలుగులోకి రావడం ఆప్రాంతంలో సంచలనం రేపింది. వారం క్రితమే చిన్నారి కిడ్నాప్ గురైందని బంధువులు తెలిపారు. కిడ్నాపర్లు 3 కిలోల బంగారం కోసం కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని బంధువులు తెలిపారు. 
 
కిడ్నాప్ వ్యవహారం విషయం బయటకు పొక్కితే చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా కిడ్నాప్ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్గ్ అయ్యారు. కిడ్నాప్ వ్యవహారాన్ని చేధించేందుకు పోలీసులు వివరాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement