ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గత మూడు రోజులుగా హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్న అధికారులు పాతబస్తీలోని షాయిన్ నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
నాలుగు రోజుల క్రితం అభిపురాకు చెందిన రెహమాన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. బీహార్‌లోని బౌద్ధగయ, ఉత్తరాఖండ్‌లోని అర్ధ కుంభమేళలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
(నగరంలో ఐసిస్ కలకలం)
కేరళ, బెంగుళూరుల్లో కూడా..
బౌద్ధగయలో మారణహోమాన్ని సృష్టించేందుకు ఐఈడీలను అమర్చారనే ఆరోపణలపై ఈ నెల మూడో తేదీన కేరళలో ఇద్దరిని, ‘జమాతే ఉల్ ముజాహిదీన్’ అనే బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే సమాచారంతో బెంగుళూరులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌లోని షాహీన్ నగర్‌కు చెందిన తండ్రీ కొడుకులు అబ్దుల్ కుద్దుస్, అబ్దుల్ ఖదీర్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment