militant attacks
-
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
మూడవ రోజుకు ఎన్ఐఏ ఆపరేషన్.. అదుపులో 20మంది
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహిసున్న సోదాలు మూడువ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 20 మందిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హుమయున్ నగర్, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్, బాలాపూర్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడుల హెచ్చరిక నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఉగ్ర కలకలం : సిటీలో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గత మూడు రోజులుగా హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్న అధికారులు పాతబస్తీలోని షాయిన్ నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం అభిపురాకు చెందిన రెహమాన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు.. బీహార్‌లోని బౌద్ధగయ, ఉత్తరాఖండ్‌లోని అర్ధ కుంభమేళలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. (నగరంలో ఐసిస్ కలకలం) కేరళ, బెంగుళూరుల్లో కూడా.. బౌద్ధగయలో మారణహోమాన్ని సృష్టించేందుకు ఐఈడీలను అమర్చారనే ఆరోపణలపై ఈ నెల మూడో తేదీన కేరళలో ఇద్దరిని, ‘జమాతే ఉల్ ముజాహిదీన్’ అనే బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే సమాచారంతో బెంగుళూరులో మరో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్‌లోని షాహీన్ నగర్‌కు చెందిన తండ్రీ కొడుకులు అబ్దుల్ కుద్దుస్, అబ్దుల్ ఖదీర్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. -
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది
-
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది : ఉగ్రవాది
కశ్మీర్ : నన్ను ఇండియన్ ఆర్మీ కాపాడింది.. ఈ మాట చెప్పింది ఓ కరుడు కట్టిన ఉగ్రవాది. బారాముల్లాలో భారత సైనికులతో పాటు, ప్రజలపై దాడులకు పాల్పడుతూ పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు. ఓ వీడియో విడుదల చేస్తూ.. హింసను విడనాడాలంటూ తనతోటి స్నేహితులు, మిలిటెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరు అజీజ్ అహ్మద్ గోజ్రీ అని చెప్పిన అతడు, తన స్నేహితులు సుహైన్ అభూబ్, మొహసీన్ ముస్తాక్ భట్, నాసిర్ అమిన్ డ్రాజీలను ఉగ్రవాదం విడిచి తమ స్వస్థలాలకు రావాలంటూ కోరాడు.. ఇళ్లను, తల్లిదండ్రులను విడిచి, తప్పుడు మార్గంలో వెళ్తూ.. అడవుల్లో జీవించే తర స్నేహితులు ఇంటికి రావాలంటూ కోరాడు. ఆర్మీ అధికారులు తనను అరెస్టు చేసినప్పుడు, చంపే అవకాశం ఉన్నా, చంపకుండా జీవితాన్ని కాపాడారని వెల్లడించాడు. అంతకు ముందు రోజే పాకిస్తాన్ తనతో భారత భద్రతా బలగాలు చాలా క్రూరమైనవని అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ అది వాస్తవం కాదన్నాడు. భారత ఆర్మీ అధికారులను కలిస్తే అసలు విషయం బోధపడుతుందన్నాడు. ఇదంతా పాకిస్తాన్ చేసే కుట్రని పేర్కొన్నాడు. పాకిస్తాన్, లష్కరే తోయిబా కాశ్మీరీ యువత జీవితాలతో ఆడుకుంటోందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏప్రిల్ 30న ఉత్తర కశ్మీర్లో భారత భద్రతా బలగాలు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి స్వయం ప్రకాశ్ మాట్లాడుతూ లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని చెప్పడానికి తమ దగ్గర చాలా సాక్షాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు. -
కాల్పుల్లో కాంగ్రెస్ నేత మృతి
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎప్పుడూ సామాన్య ప్రజలపై విరుచుకుపడే ఉగ్రవాదులు ఈ సారి రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని రాజ్‌పూర్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేత గులాం నబీ పటేల్ మృతి చెందారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పటేల్ మృతి చెందగా, అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ తీవ్రంగా ఖండించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. -
అల్లా దయవల్ల తిరిగి వచ్చాం: హైదరాబాద్ యాత్రికులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8-10 తేదీల్లో ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన కర్బలా, నజఫ్లకు వెళ్లిన దాదాపు 350 మంది హైదరాబాద్ షియా ముస్లింలలో 25 మందితో కూడిన బృం దం బుధవారం క్షేమంగా తిరిగి వచ్చింది. మిగ తా వారు కూడా అక్కడ క్షేమంగానే ఉన్నారని యాత్రికులు తెలిపారు. మిలిటెంట్ల దాడులతో ఇరాక్ అట్టుడుకుతుండటంతో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అల్లా దయవల్ల తిరిగి వచ్చామని రజాఖాన్, రాజసబ్రి, సయ్యద్సద్దర్ హుసేన్ తెలిపారు. -
'36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు'
అసొం : అసొంలో బోడో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్డీఎఫ్బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు 36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా బోడోలండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఆధిపత్యం ఉన్న కోక్రాజార్, బాక్సా జిల్లాల్లో మూడు వేరు వేరు సంఘటనల్లో బోడోలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినా దాడులు యధేచ్చగా కొనసాగాయి. ఆర్మీజవానులు ఫ్లాగ్ మార్చ్‌లు, కనిపిస్తే కాల్చివేయడం లాంటి ప్రకటనలను బోడోలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మృతుల్లో ఎక్కువగా ఒక వర్గానినే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్టీఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. పరిస్థితి చేయి దాటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. బాక్సా జిల్లాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి.