'36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు'
అసొం : అసొంలో బోడో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్డీఎఫ్బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు 36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా బోడోలండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఆధిపత్యం ఉన్న కోక్రాజార్, బాక్సా జిల్లాల్లో మూడు వేరు వేరు సంఘటనల్లో బోడోలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినా దాడులు యధేచ్చగా కొనసాగాయి.
ఆర్మీజవానులు ఫ్లాగ్ మార్చ్లు, కనిపిస్తే కాల్చివేయడం లాంటి ప్రకటనలను బోడోలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మృతుల్లో ఎక్కువగా ఒక వర్గానినే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్టీఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. పరిస్థితి చేయి దాటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. బాక్సా జిల్లాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి.