Kokrajhar
-
జిగ్నేష్ మేవానీకి ఎట్టకేలకు బెయిల్
కొక్రాఝర్: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. దౌర్జన్యపూరితంగా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో అస్సాంలోని బార్పేట సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గుజరాత్లో ఏప్రిల్ 20న జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 25న ఆయనకు బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడి దాడి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బార్పేట చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముకుల్ చెతియా.. బెయిల్ నిరాకరించి ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేవానీ ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 29న బెయిల్ మంజూరు చేసింది. రూ. 1,000 వ్యక్తిగత బాండ్‌పై కోర్టు బెయిల్ ఇచ్చిందని మేవానీ తరపు న్యాయవాది అంగ్షుమన్ బోరా తెలిపారు. దీన్ని బట్టే ఇది అక్రమ కేసు అని అర్థమవుతోందన్నారు. మొదటి కేసుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి మేవానీని తిరిగి కొక్రాఝర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని, ఆపై విడుదల చేస్తారని.. దీనికి ఒక రోజు పట్టవచ్చని బోరా చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా తనను కేసుల్లో ఇరికించాయని మెవానీ అంతకుముందు ఆరోపించారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అధికార బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా మేవానీ అరెస్ట్‌ను విపక్షాలు పేర్కొంటున్నాయి. (క్లిక్: తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీకి దూరం కానున్నాడా?) -
ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం!
గువాహటి: అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. కోక్రాజ్హర్ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్హర్ పోలీసులు చెప్తున్నారు. చదవండి: శారీరక సుఖం కోసం పోయి.. -
అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి
కొక్రాఝర్: పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోని బాలాజన్ టినాలి మార్కెట్ పై జరిగిన ఉగ్రదాడిలో 13 మంది పౌరులు మృతి చెందగా, గాయలపాలైన వారి సంఖ్య 18కు పెరిగింది. దాడిపై స్పందించిన ప్రభుత్వం మరిన్ని దళాలను ఘటనాస్థలానికి హుటాహుటిన పంపింది. కాగా దాడిని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. మొత్తం ముగ్గురు మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారని డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ న్యూటన్ చెప్పారు. ఒక మిలిటెంటును భద్రతాదళాలు హతమార్చినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరి కోసం భద్రతాదళాలు గాలిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలో హైఅలర్ట్ ఉన్న సమయంలో దాడి జరగడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. దాడిపై స్పందించిన అసోం డీజీపీ సహాయ్ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్ బీ) కు మిలిటెంట్లు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నట్లు చెప్పారు. కొక్రాఝర్ మిలిటెంట్ల దాడి దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అసోం ప్రభుత్వం నుంచి దాడిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
అసొంలో మిలిటెంట్ల కాల్పులు
-
ప్రతిదానికి మోడీని నిందిస్తే ఎలా?
గువాహటి: అస్సాంలోని బోడో ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండగానే రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. బీజేపీ నడుపుతున్న విద్వేష రాజకీయాల ఫలితమే బోడో ప్రాంతంలో జరిగిన హింసాకాండ అని కాంగ్రెస్ నాయకలు మీమ్ అఫ్జాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం, అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రతిదానికి అనవసరంగా నరేంద్ర మోడీని నిందించడం సరికాదని అన్నారు. అసోంలో జరిగిన హింసాకాండ దురదృష్టకరమని, ఖండించదగినదని చెప్పారు. రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి ఇది సమయం కాదన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. పరస్పరం నిందించుకోవడం మానేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. కోక్రాఝర్, బక్సా మారణహోమంపై అస్సాం సీఐడీ విభాగం దర్యాప్తు చేపట్టింది. కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో తీవ్రవాదులు మైనారిటీ వర్గాల ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 32 మంది మృతి చెందారు. -
'36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు'
అసొం : అసొంలో బోడో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్డీఎఫ్బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు 36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా బోడోలండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఆధిపత్యం ఉన్న కోక్రాజార్, బాక్సా జిల్లాల్లో మూడు వేరు వేరు సంఘటనల్లో బోడోలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినా దాడులు యధేచ్చగా కొనసాగాయి. ఆర్మీజవానులు ఫ్లాగ్ మార్చ్‌లు, కనిపిస్తే కాల్చివేయడం లాంటి ప్రకటనలను బోడోలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మృతుల్లో ఎక్కువగా ఒక వర్గానినే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్టీఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. పరిస్థితి చేయి దాటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. బాక్సా జిల్లాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. -
అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం
అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు. కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు.