అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం | Bodo extremists kill 10 in Asom | Sakshi
Sakshi News home page

అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం

Published Fri, May 2 2014 12:02 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం

అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం

అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు.

కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది.

గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement