bodo
-
శాంతి, అహింసల విజయం
కోక్రాజర్: బోడో ఒప్పందం ద్వారా శాంతి, అహింస విజయం సాధించాయనీ అది ప్రజల వల్లే సాధ్యమైందనీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బోడో శాంతి ఒప్పందం 21వ శతాబ్దంలో అస్సాం సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంభం అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఈ ప్రాంతా భివృద్ధికి తోడ్పడుతుందని మోదీ తెలిపారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ‘‘రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించింది’’అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అస్సాంలోని బోడోల్యాండ్ ఉద్యమ సంస్థలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం రాష్ట్రంలో శాశ్వత శాంతికి పునాదులు వేస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. ‘తిరిగి హింసను ఆమోదించేది లేదు’అని మోదీ స్పష్టం చేశారు. భారత పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం మోదీ అస్సాంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
-
'నన్నెవరు కొట్టలేదు..మనస్పూర్తిగా స్వాగతించారు'
గుహావటి : గత డిసెంబర్లో పార్లమెంట్లో పౌరసత్వ సవరణ చట్టం బిల్ పాస్ అయి అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంలో శుక్రవారం పర్యటించారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోలేదని మోదీ తెలిపారు. కొన్ని దశాబ్ధాలుగా బోడో మిలిటెంట్లతో ఈ ప్రాంతం నిరసన, హింసతో అట్టుడికిపోయేదని, కొన్ని వేలమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారని మోదీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోక్రాఝర్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ బోడో వేడుకను ఒక పండుగలా జరుపుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో అస్పాం రాష్ట్రంలో శాంతి మంత్రం కోసమే బోడో వంటి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుచేశారు.(నెహ్రూపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు) ప్రధాని మాట్లాడుతూ.. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్( ఎబిఎస్యూ), నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్‌డిఎఫ్‌బి), బిటిసి చీప్ హగ్రమా మొహిలరీ, అస్సాం ప్రభుత్వం బోడో ఒప్పందం సక్రమంగా జరగడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారందరికి తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ తెలిపారు. చారిత్రాత్మకమైన బోడో ఒప్పందం ద్వారా ఇక నుంచి అస్సాం ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించనుందని మోదీ వెల్లడించారు. అస్సాంలో బోడో డామినేట్ ప్రాంతంలో శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో జనవరి 27న కేంద్ర ప్రభుత్వంతో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇతర పౌర సమాజ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం జరిగిన రెండు రోజులకే వేల సంఖ్యలో బోడో మిలిటెంట్లు వచ్చి తమ ఆయుధాలు సరెండర్ చేశారని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలపై పట్ల గత ప్రభుత్వాల్లాగా కాకుండా తమ ప్రభుత్వం ఎంతో ప్రేమ చూపుతోందన్నారు. ఒకప్పుడు కేంద్రం ఎలాంటి నిధులు ఇస్తుందోనని ఈశాన్య రాష్ట్రాలు ఎదురుచూసేవని... కానీ ఇప్పుడు అవే ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధిలో కీలకంగా మారాయని మోదీ తెలిపారు. చారిత్రాత్మక బోడో ఒప్పందం ద్వారా ఇకపై ఈ ప్రాంతంలో హింసకు తావు లేకుండా శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు తర్వాత తాను ఈశాన్య రాష్ట్రంలో అడుగుపెడితే కర్రలతో తనను తరిమి కొడతారని కొందరు వాఖ్యానించినట్లు మోదీ పేర్కొన్నారు. ' ఈరోజు నేను ఈశాన్య రాష్ట్రంలో అడగుపెట్టాను. ఏ ఒక్కరు నాపై కర్రలతో దాడి చేయకపోగా నన్ను సాధరంగా ఆహ్వానించారు. నా వెనుక వేల సంఖ్యలో అక్కా, చెల్లెమ్మల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరు తరిమికొట్టలేరని ప్రధాని మోదీ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విటర్ వేదికగా పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు. PM Modi in Kokrajhar, Assam: Kabhi kabhi log danda marne ki baatein karte hain. Lekin jis Modi ko itne badi matra mein mata aur beheno ka suraksha kawach mila ho us par kitne bhi dande gir jaye, usko kuch nahi hota. pic.twitter.com/yo7wjU14tP — ANI (@ANI) February 7, 2020 -
ఫోర్త్ ఎస్టేట్ : అస్సాంలో అల్లర్లపై ప్రత్యేక చర్చ
-
'36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు'
అసొం : అసొంలో బోడో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్డీఎఫ్బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు 36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా బోడోలండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఆధిపత్యం ఉన్న కోక్రాజార్, బాక్సా జిల్లాల్లో మూడు వేరు వేరు సంఘటనల్లో బోడోలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినా దాడులు యధేచ్చగా కొనసాగాయి. ఆర్మీజవానులు ఫ్లాగ్ మార్చ్‌లు, కనిపిస్తే కాల్చివేయడం లాంటి ప్రకటనలను బోడోలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మృతుల్లో ఎక్కువగా ఒక వర్గానినే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్టీఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. పరిస్థితి చేయి దాటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. బాక్సా జిల్లాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. -
అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం
అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు. కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు.