కోక్రాజర్: బోడో ఒప్పందం ద్వారా శాంతి, అహింస విజయం సాధించాయనీ అది ప్రజల వల్లే సాధ్యమైందనీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బోడో శాంతి ఒప్పందం 21వ శతాబ్దంలో అస్సాం సహా మొత్తం ఈశాన్య ప్రాంతానికే ఒక నూతన ప్రారంభం అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఈ ప్రాంతా భివృద్ధికి తోడ్పడుతుందని మోదీ తెలిపారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ‘‘రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించింది’’అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల శాంతి, అభివృద్ధి కోసం కలిసిపనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అస్సాంలోని బోడోల్యాండ్ ఉద్యమ సంస్థలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం రాష్ట్రంలో శాశ్వత శాంతికి పునాదులు వేస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. ‘తిరిగి హింసను ఆమోదించేది లేదు’అని మోదీ స్పష్టం చేశారు. భారత పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం మోదీ అస్సాంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
శాంతి, అహింసల విజయం
Published Sat, Feb 8 2020 1:33 AM | Last Updated on Sat, Feb 8 2020 1:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment