extremists
-
కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. కెనడా భారత్‌పై ఆరోపణలు చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. కెనడాలో జరిగిన దాడి ఘటన భారత్‌కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు.#Breaking: EAM Dr S Jaishankar reacts to Canada developments "Canada has developed a pattern of making allegations without providing specifics" Unacceptable Indian diplomats put under surveillance "Political space given to extremists force" in #Canada pic.twitter.com/lj9bIjTv91— Rohit Chaudhary (@rohitch131298) November 5, 2024 -
ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్ ఆడే చదరంగం
ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?.. ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్‌ఫిన్‌మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది. గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. కాగా, గ్యారీ కాస్పరోవ్‌పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి. -
అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ
లండన్: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్’ తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్’ పేర్కొంది. -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్‌లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు. -
వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల
ఇస్లామాబాద్: బాలిక చేతిలో పుస్తకం మత చాందస వాదులకు వణుకు పుట్టిస్తోందని, అందుకనే పాఠశాలలు తగులబెడుతున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్ (21) మండిపడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు గురువారం 12 స్కూళ్లను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ధ్వంసమైన పాఠశాలలను తిరిగి పునరుద్ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. భయానికి వెరవకుండా దేశంలోని బాలబాలికలు బాగా చదువుకొని.. విద్య తమ హక్కు అని మత జాఢ్యంలో మునిగితేలుతున్న తీవ్రవాదులకు తెలియజెప్పాలని ఆకాక్షించారు. కాగా, ఉగ్రవాదుల చేతిలో దాడికి గురైన పాఠశాలల్లో ఎక్కువగా నిర్మాణ దశలో ఉన్నవేనని దియామిర్ డివిజన్ పోలీసు కమిషనర్ అబ్దుల్ వహీద్ షా తెలిపారు. The extremists have shown what frightens them most - a girl with a book. We must rebuild these schools immediately, get the students back into their classrooms and show the world that every girl and boy has the right to learn. https://t.co/99J7ZivafC — Malala (@Malala) August 3, 2018 బాలికా విద్యకై ప్రాధాన్యమిస్తాం: ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాఠశాలల విధ్వంసంపై స్పందించారు. ‘విద్యాలయాలపై ఉగ్ర దాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించబోను. త్వరలో కొలువుదీరే మా ప్రభుత్వం.. విద్యావ్యవస్థ పటిష్టానికి ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా బాలికా విద్యకై కృషి చేస్తాం’అన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. పాఠశాలల వద్ద గట్టి భద్రత కల్పిస్తామని అన్నారు. Shocking & condemnable torching of schools in GB, more than half of them girls' schools.This is unacceptable & we will ensure security for schools as we are committed to focusing on education, esp girls' education which is integral to Naya Pakistan. https://t.co/lSlQDjSkeS — Imran Khan (@ImranKhanPTI) August 3, 2018 -
‘బీజేపీ, ఆరెస్సెస్‌లోనూ అతివాదులు’
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ, ఆరెస్సెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్‌లో హిందుత్వ అతివాదులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో ఉగ్రవాదులు ఉన్నారని ఆయన గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ‘వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్) హిందుత్వ ఉగ్రవాదులని నేను చెప్పాను. నేను హిందువునే. కానీ నేను మానవత్వం ఉన్న హిందువును. కానీ వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్) మానవత్వం లేని హిందువులు’ అని అన్నారు. అయితే ఖలిస్తాన్‌తో పాటు ఎల్టీటీఈకి అండదండలు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. -
అసోంలో టెర్రరిస్టుల దాడి, 13 మంది మృతి
-
అసోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
అసోం: ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శుక్రవారం కోక్రాఝర్‌లో విరుచుకుపడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
'36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు'
అసొం : అసొంలో బోడో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్డీఎఫ్బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు 36 గంటల్లో 30మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 12మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా బోడోలండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఆధిపత్యం ఉన్న కోక్రాజార్, బాక్సా జిల్లాల్లో మూడు వేరు వేరు సంఘటనల్లో బోడోలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించినా దాడులు యధేచ్చగా కొనసాగాయి. ఆర్మీజవానులు ఫ్లాగ్ మార్చ్‌లు, కనిపిస్తే కాల్చివేయడం లాంటి ప్రకటనలను బోడోలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మృతుల్లో ఎక్కువగా ఒక వర్గానినే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్టీఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. పరిస్థితి చేయి దాటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. బాక్సా జిల్లాలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. -
అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం
అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు. కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు.