‘బీజేపీ, ఆరెస్సెస్‌లోనూ అతివాదులు’ | Karnataka slugfest continues: Now, Siddaramaiah says BJP, RSS are ‘Hindus without humanity’ | Sakshi
Sakshi News home page

‘బీజేపీ, ఆరెస్సెస్‌లోనూ అతివాదులు’

Published Fri, Jan 12 2018 4:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

Karnataka slugfest continues: Now, Siddaramaiah says BJP, RSS are ‘Hindus without humanity’ - Sakshi

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ, ఆరెస్సెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్‌లో హిందుత్వ అతివాదులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో ఉగ్రవాదులు ఉన్నారని ఆయన గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే.

‘వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్‌) హిందుత్వ ఉగ్రవాదులని నేను చెప్పాను. నేను హిందువునే. కానీ నేను మానవత్వం ఉన్న హిందువును. కానీ వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్‌) మానవత్వం లేని హిందువులు’ అని అన్నారు. అయితే ఖలిస్తాన్‌తో పాటు ఎల్టీటీఈకి అండదండలు అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనని బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement