UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్‌ హెచ్చరిక | UP by Election 2024 Akhilesh Yadav Warned for Trouble | Sakshi
Sakshi News home page

UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్‌ హెచ్చరిక

Published Wed, Nov 20 2024 11:08 AM | Last Updated on Wed, Nov 20 2024 11:50 AM

UP by Election 2024 Akhilesh Yadav Warned for Trouble

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్  నేటి (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా  ఒక పోస్టు చేశారు.

‘ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వెలువడతాయి. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. ఇది ఓటు హక్కు సద్వినియోగానికి ఉదాహరణ. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను గమనిస్తున్నారు. అన్ని చోట్లా వీడియోగ్రఫీ జరుగుతున్నదని అఖిలేష్‌ అన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక’ అని పేర్కొన్నారు.  
 

యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్‌పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్‌ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నదని ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు ఓటు వేయనున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న  వెలువడనున్నాయి. 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement