trouble
-
UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ నేటి (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు.‘ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వెలువడతాయి. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. ఇది ఓటు హక్కు సద్వినియోగానికి ఉదాహరణ. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను గమనిస్తున్నారు. అన్ని చోట్లా వీడియోగ్రఫీ జరుగుతున్నదని అఖిలేష్ అన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక’ అని పేర్కొన్నారు. वोट की प्रक्रिया को लेकर जो प्रयास ‘रात-दिन’ किया जा रहा है, उससे ये स्पष्ट हो गया है कि अब तो मतदाता दुगुने उत्साह से वोट डालनें जाएंगे। परिणाम तभी निकलते हैं जब एक भी वोट न तो बँटता है, न घटता है। उप्र के जागरूक और साहसी मतदाता अपने वोट करने के उस अधिकार के लिए शत-प्रतिशत घर… pic.twitter.com/muqlzJ7Zsu— Akhilesh Yadav (@yadavakhilesh) November 20, 2024యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నదని ఎన్నికల సంఘం తెలిపింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు ఓటు వేయనున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన -
Ganesh Immersion 2024: గణేశ్ నిమజ్జనం వేళ డీజేల హోరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. గణేష్ నిమజ్జనం వేళ డీజేలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. పీసీబీ పరిమితులను గణేష్ మండప నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్ధరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా పీసీబీ, మున్సిపల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉గణేష్ ఊరేగింపుల్లో డీజేల చప్పుళ్లు, లౌడ్ స్పీకర్లు, జనరేటర్ల వినియోగం, టపాసులు కాల్చడం, వాహనాల హారన్లు, యువతీయువకులు బూరలతో శబ్దాలు చేయడం తదితర కారణాలతో నిమజ్జనం వేళ పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. ప్రధానంగా హుస్సేన్‌సాగర్, అబిడ్స్, బహదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని నివాసితులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేరే రాష్ట్రాల్లో కేసులు.. పుణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అధిక శబ్దాలను గుర్తించేందుకు పోలీసులు ప్రధాన రహదారుల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.వినికిడి సమస్యలు.. మితిమీరిన శబ్దాలతో చిన్న పిల్లల కర్ణభేరి సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు వినికిడి శక్తి లోపించే ప్రమాదం ఉంది. పరిమితికి మించి శబ్ధాలతో తలనొప్పి, చికాకు, గుండె స్పందనలో వేగం, రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 65 డెసిబుల్స్‌కు మించిన ధ్వనితో గుండె జబ్బులు, చెవుడు కూడా రావచ్చు. -
మొరాయిహించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. మరో వాహనం ఎక్కి వినుకొండకు ప్రయాణం
-
మధుర సీటుపై ఎన్డీఏ మల్లగుల్లాలు? హేమా మాలినికి మొండి చెయ్యి?
ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ టిక్కెట్ కేటాయింపుపై నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) మల్లగులల్లాలు పడుతోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ ఎన్డీఏలో చేరుతుందనే చర్చల నడుమ మధుర లోక్‌సభ సీటు కేటాయింపుపై ఆసక్తికర చర్చ ప్రారంభమయ్యింది. తాజాగా మధుర ఎంపీ హేమ మాలిని తాను మథుర నుండి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ‘ఇండియా’ కూటమిని వీడి ఎన్డిఎలో చేరుతారనే చర్చ ప్రారంభమైనప్పటి నుండి, బీజేపీ- ఆర్ఎల్డీ మధ్య సీట్ల కేటాయింపుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మధుర సీటు జయంత్ చౌదరి పార్టీకి దక్కవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. జయంత్ చౌదరి 2009లో తొలిసారిగా మధుర నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి హేమమాలిని ఈ స్థానం నుంచి గెలుపొందారు. కాగా తాజాగా మధుర వచ్చిన హేమమాలిని ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నేతల మధ్య కూర్చుని విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పార్టీ ఆదేశిస్తే మథుర నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
మంత్రాలయంలో వెలవెలబోతున్న తుంగభద్ర
సాక్షి, కర్నూలు: మంత్రాలయంలో తుంగభద్ర నది వెలవెలబోతుంది. నీళ్లు లేక భక్తులు స్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం అధికారులు తూతూ మంత్రంగా షవర్లు ఏర్పాటు చేశారు. మురుగునీటితో నిండిన తుంగభద్ర.. దుర్వాసన వెదజల్లుతుంది. కాగా, శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అంగరవైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం విశ్వమోహనుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం శ్రీమఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత రాఘవేంద్రుల మూల బృందావనికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాఘవేంద్రుల బృందావన ప్రతిమను బంగారు పల్లకీలో ఊరేగించారు. పూజామందిరంలో స్వామిజీ మూలరామ, వేదవ్యాసుల పూజోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు -
రియల్ ఎస్టేట్ కంపెనీలతో చైనా ఆర్థిక వ్యవస్థకు తంటాలు!
చైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే వార్తలు ఈమధ్య ఎక్కువగానే అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ చైనా ‘ప్రపంచానికి ఫ్యాక్టరీ’ అనే ప్రశంసలు అందుకుంది. 2019 చివరిలో వేగంగా ప్రయాణం మొదలెట్టిన మహమ్మారి కొవిడ్–19 దెబ్బతో చైనా ఎదురులేని ఆర్థికాభివృద్ధి తగ్గుముఖం పట్టడం మొదలైంది. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకుని విధించిన అదనపు దిగుమతి సుంకాలు చైనాపై వ్యతిరేక ప్రభావం చూపించడం ఆరంభమైంది. ‘ప్రపంచ వర్క్‌షాప్’ అనే పేరు నెమ్మదిగా కోల్పోయే పరిస్థితులు చైనా కళ్ల ముందు కదలాడుతున్నాయి. అప్పటి వరకూ తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనాలో కొనసాగిస్తున్న కొన్ని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇతర దేశాల్లో ఆ పనిని చేయించడం ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలైన యాపిల్, శామ్సంగ్ తమ కార్యకలాపాల్లో కొంత భాగాన్ని 2022లో మరో ఆసియా దేశం వియత్నాంకు తరలించాయి. పిల్లల బొమ్మల తయారీ కంపెనీ హాస్బరో 2019లోనే తన ఉత్పత్తి పనులను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంకు తరలించింది. తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో రిస్కును తగ్గించుకోవడానికే చైనాను ఈ కంపెనీలు వదిలిపోయాయని అంతర్జాతీయ వాణిజ్యంలో పరిణామాలను అధ్యయనం చేసే మూడీస్ అనలిటిక్స్ ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ అభిప్రాయపడ్డారు. అంతేగాక, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు తగ్గుముఖం పట్టిన ఫలితంగా ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా లబ్ధిపొందుతున్నాయి. ఇప్పుడు ఇతర అనేక సమస్యలు చైనా ఆర్థిక వ్యవస్థను మున్నెన్నడూ లేనంతగా పీడిస్తున్నాయి. జనాభా తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంతో ఆందోళనకర పరిణామాలు గత మూడు దశాబ్దాల్లో చైనా జనాభా బాగా పెరిగింది. ఉపాధి, ఆర్థిక అవకాశాల కోసం చైనీయులు పెద్ద సంఖ్యలో నగరాల బాట పట్టారు. ఆరంభంలో వారి కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్లు వేగంగా ఆధునిక అపార్ట్ మెంట్లు నిర్మించలేకపోయారు. అనేక కంపెనీలు ఈ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించి నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగించాయి. రియల్ ఎస్టేట్ రంగం చైనా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఇంజన్ మాదిరిగా ఉపయోగపడింది. స్థిరాస్తి రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. అనేక కుటుంబాలు పొదుపు చేసుకుని మదుపు చేయడానికి ఈ రంగం గొప్ప అవకాశం కల్పించింది. ఇలా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం సైజు చైనాలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాల్లో నాలుగో వంతుకు చేరింది. ఇక ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందనుకున్న స్థిరాస్తి రంగంపై చైనా ఆధారపడడం ఎక్కువైంది. కాని, తర్వాత ప్రజల అవసరాలకు మించిన సంఖ్యలో గృహాల నిర్మాణం, అందుకోసం శక్తికి మించిన మొత్తాల్లో గృహనిర్మాణ కంపెనీలు అప్పులు చేయడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతున్నంత వరకూ ఈ కంపెనీలు తేలికగా తమకు లభ్యమైన రుణాలతో చెల్లింపులు జరిపాయి. ఇప్పుడు ఇళ్లకు గిరాకీ తగ్గడంతో కంపెనీలకు అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు తీర్చలేకపోతున్నాయి. అన్ని సమస్యలకూ కొవిడ్–19 వల్ల ఎడాపెడా పెట్టిన లాక్ డౌన్లే కారణమని జనం నిందించే పరిస్థితి వచ్చింది. అలాగే, అన్ని ఇబ్బందులకూ కారణం రియల్ ఎస్టేట్ రంగమేనని ఇప్పుడు మరి కొందరు తప్పుబడుతున్నారు. ఈ ఆగస్టులో కంట్రీ గార్డెన్ వంటి 50కి పైగా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయలేక దివాలా స్థితికి చేరుకుంటున్నాయి. గత మూడేళ్లుగా ఈ సంక్షోభం ముదురుతోంది. ఈ ఏడాది జులైలో 100 చైనా అగ్రశ్రేణి రియల్టీ కంపెనీల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 33% పడిపోయాయి. జూన్ లో 28 శాతం తగ్గిపోయాయని చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దివాలాకు సిద్ధమౌతున్న స్థిరాస్తి కంపెనీల సంఖ్య పెరుగుతున్నా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లేదు. కేవలం, తనఖా నిబంధనలు సరళతరం చేయడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చర్యలకే పరిమితమైంది సర్కారు. ఇళ్ల ధరలు పెరుగుతున్నంత సేపూ భారీ అప్పులతో గృహాలు నిర్మించి అమ్ముకునే స్థిరాస్తిరంగం బాగుంటుందని, ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేదని చైనా మోడల్ నిరూపిస్తోంది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
విపక్షాలను సర్కార్ వేధిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ‘విపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. దీనిని ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నా. మమ్మల్ని అవమానించడం అంటే మా ప్రజలను అవమానించడమే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మా హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది’అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు, ఇళ్లు, ఆస్తులు నష్టపోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని సూచించారు. పొలాలు కోతకు గురయ్యాయని, ఇసుక మేటలు వేశాయని, పొలాలను బాగు చేసుకోవడానికి గతంలో సీఎం చేసిన ప్రకటన మేరకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున రైతులకు సహాయం చేయాలని ఈటల అన్నారు. పంట రుణమాఫీలో జాప్యంతో రైతులపై రూ.10 వేల కోట్ల వడ్డీల భారం పడిందని, ఎప్పటిలోగా రుణాలు మాఫీ చేస్తారో తెలపాలని కోరారు. రైతు కూలీలకూ రైతుబీమా పథకం వర్తింపజేయాలని ఆయన సూచించారు. సర్కారీ బడులు మూత.. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్సిటీల్లో కోర్సుల ఫీజులను భారీగా పెంచారని, వాటిని తక్షణమే తగ్గించాలని కోరారు. ప్రైవేటు వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కలి్పంచాలని, గెస్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని అన్నారు. భూముల విక్రయాలు వద్దు.. ప్రభుత్వ భూముల విక్రయాలపై పునరాలోచన చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదలనుంచి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులకు కూడా దళితబంధు ఇస్తామనడం సరికాదని, పేదవారికి మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సొంత జాగాలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సహాయం అందజేయాలని సూచించారు. -
నీరు లేదు.. వాన నీరే..
నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎస్వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు. -
దంపతులు మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్ కెమెరా పిక్స్..జైలుపాలైన భర్త
కేరళ రాష్ట్రం ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అత్యాధునిక ట్రాఫిక్ కెమరాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రాఫిక్ కెమెరాలు ప్రస్తుతం వివాదస్పదమవ్వడమే గాక ఏకంగా ఓ కుంటుంబంలో కలతలు తెచ్చిపెట్టింది. కేరళలోని ఓ వ్యక్తి ఓ మహిళా స్నేహితురాలితో బైక్‌పై ప్రయాణించాడు. అతడు ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో వారి మొబైల్‌కి ఫోటోతో సహా మెసేజ్ వెళ్లింది. ఐతే అతడి బైక్ భార్య పేరు మీద ఉండటంతో ఆమె మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బైక్‌పై ఎక్కించుకున్న మహిళ ఎవరని ప్రశ్నించింది భార్య. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, తాను కేవలం ఆమెకు లిఫ్ట్ ఇచ్చానని భార్యాతో చెప్పాడు. కానీ ఆమె నమ్మలేదు. దీంతో ఇరువురి మద్య ఈ విషయమై గొడవలయ్యాయి. ఆ తర్వాత ఆమె తనపట్ల, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడమే గాక జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, సేఫ్ కేరళలో భాగంగా రోడ్డు భద్రతా ప్రాజెక్టు రహదారులపై ఈ అత్యాధునిక ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల ఒప్పందాల్లో చాలా అవినీతి జరిగిందంటూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ కెమెరాలు సామాన్య ప్రయాణికుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పాలు చేస్తుండటం బాధకరం. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పెషెంట్..) -
వివాదాల ఆదిపురుష్..!
-
రామ.. రామ! భద్రాద్రి ఈవో అత్యుత్సాహం.. ఆలయానికి ఒకరోజు తాళం
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో బుధవారం ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. వివరాలివి. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు. దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. చదవండి: ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి -
ఇబ్బందుల్లో ట్విటర్ డీల్, ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా?
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ డీల్‌కు సంబంధించి టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. టెక్ బిలియనీర్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు డీల్ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్ దాని స్పామ్ ఖాతా డేటా, బాట్లను ఎదుర్కొనే టెక్నాలజీ బాగానే ఉన్నాయనీ, రోజుకు 10 లక్షల నకిలీ ఖాతాలను బ్లాక్ చేశానని ట్విటర ప్రకటించిన తరువాత ఇలాంటి వార్తలు రావడం గమనార్హం. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ట్విటర్ కొనుగోలుకు సంబంధించిన చర్చలు మస్క్ నిలిపివేశారు. దీంతో ఈ డీల్ ఇప్పట్లో పూర్తవుతుందా అని సందేహాలు నెల కొన్నాయి. లారీ ఎల్లిసన్, వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, ఫిడిలిటీ, క్రిప్టోఎక్స్ఛేంజ్ బినాన్స్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఖతార్‌తో కలిసి సంయుక్తంగా ట్విటర్ డీల్‌ను చేసుకోవాలని మస్క్ ప్రయత్నించారు. కాగా ట్విటర్లో నకిలీ ఖాతాల విషయంలో ట్విటర్ డేటాతో విబేధిస్తున్న మస్క్ తాత్కాలికంగా ఈ డీల్‌ను నిలిపిస్తున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏమవుతోందో ఏమో!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం నేప థ్యంలో రాష్ట్రానికి వచ్చిన పీకే రెండురోజుల పాటు సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరపడం, టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు రావడంతో ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. పీకే కాంగ్రెస్‌లో చేరి ఆయనకు చెందిన ఐ ప్యాక్ సంస్థ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే రా ష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తేలేవరకూ టెన్షనే.. పీకే, టీఆర్ఎస్ల మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో ధ్రువీకరణ అయ్యేవరకు నమ్మే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి కేడర్ భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఈ విషయంలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేయరని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలు పు కోసమే ఆయన పనిచేస్తారని కొందరు నేత లు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇది టీఆర్ఎస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనమని అంటూనే పీకే విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని మీడియాతో చెప్పారు. రాష్ట్ర స్థాయి నేతలు పైకి ఏం చెబుతున్నా లోలోపల మాత్రం వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోందనేది బహిరంగ రహస్యం. ఏమీ అర్ధం కావడం లేదు.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికీ ఏమీ అంతుపట్టడం లేదు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ఢిల్లీలో సమావేశమైనప్పటికీ పీకే చేరే అంశంపై ఏమీ తేల్చకుండా సమావేశం ముగించడం గందరగోళాన్ని మరింత పెంచింది. ఏది ఏమైనా వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పే విధానాన్ని బట్టి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. -
Fishermen: ‘వల’సి సొలసి
బరంపురం: రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్, షట్డౌన్లతో రోజువారీ కూలీలు, కొన్ని సంప్రదాయ వృత్తుల వారు పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనాది కాలంగా చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అయితే మరీ దారుణం. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ వేట కొనసాగించలేని వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమై, ఆకలితో పస్తులుంటున్నారు. కొంతమంది తీరం వైపు చూస్తూ తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తావమని సముద్ర దేవునికి దండం పెట్టుకుంటున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, వేటకు వెళ్తే కానీ ఆ రోజు కాలం గడవదని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి, తమకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 475 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న గంజాం జిల్లాలో సూన్‌పూర్ నుంచి చందిపూర్ వరకు దాదాపు 108 మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాల్లోని 15 వేల కుటుంబాలు చేపల వేటని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆదుకోవాలని పలు మత్స్యకార సంఘాల ప్రతినిధులు జి.ఎర్రయ్య, టి.సింహాద్రి, జి.పాపారావు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని కొత్త అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ తెలిపారు. అధ్యక్షుడిగా ట్రంప్ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పునరుద్ఘాటించారు. అధికార మార్పిడికి సంబంధించిన తన ప్రణాళికలకు అడ్డంకులేవీ రాలేదని, ప్రపంచదేశాల నేతలతో మాటాలు కలపడం మొదలుపెట్టానని బైడెన్ డెలవేర్‌లోని విల్మింగ్టన్లో చెప్పారు. అధికార మార్పిడి ప్రక్రియను మొదలుపెట్టేందకు ట్రంప్ యంత్రాంగం నిరాకరించినా నిష్ప్రయోజనమని, తాము చేయాల్సింది చేస్తామని స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీకి అన్నీ సక్రమంగానే పూర్తవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరు దేశాల నేతలు తనకు ఫోన్ చేశారని, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వారు ఇందులో ఉన్నారని చెప్పారు. బైడెన్ బృందంలో 20 మంది... ప్రస్తుత ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాల సమీక్ష కోసం బైడెన్ ఏర్పాటు చేసిన సమీక్ష బృందాల్లో 20 మందికిపైగా భారతీయ అమెరికన్లున్నారు. వీరిలో ముగ్గురు ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష మార్పిడి సాఫీగా జరిగేందుకు ఈ సమీక్ష బృందాలు ఉపయోగపడతాయని అంచనా. అమెరికా చరిత్రలో ఇంత వైవిధ్యతతో కూడిన సమీక్ష బృందం ఏదీ లేదని బైడెన్ వర్గం తెలిపింది. ఈ బృందాల్లో సగం మంది మహిళలు. సుమారు 40 శాతం మంది చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన వారు. విద్యుత్తు పరమైన అంశాల సమీక్షకు ఏర్పాటు చేసిన బృందానికి స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన అరుణ్ మజుందార్ నేతృత్వం వహిస్తూండగా, మాదకద్రవ్యాల నియంత్రణ బృందానికి రాహుల్ గుప్తా, ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్కు కిరణ్ అహూజాలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రవీణా రాఘవన్, ఆత్మన్ త్రివేదీ, శుభశ్రీ రామనాథన్, రాజ్ డే, సీమా నందా వంటి వారికీ చోటు దక్కింది. -
ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 238 ఇంజనీరింగ్ కాలేజీలకు కష్టకాలం వచ్చింది. 2020–21 విద్యా సంవత్సరంలో వాటికి గుర్తింపు వస్తుందో.. లేదోనన్న.. ఆందోళన మొదలైంది. రాష్ట్రం లోని ఆయా కాలేజీలకు భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా భవనాలను నిర్మించి కొనసాగిస్తున్నాయి. ఈ అంశం పై రెండేళ్ల కిందట అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ యాజమాన్యాలకు ఏఐసీటీఈ నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలిస్తేనే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపు ఇస్తామని తెలిపింది. చివరకు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏఐసీటీఈ ఆ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రెండే ళ్లలో అనుమతులు తెచ్చుకోవాలని చెప్పింది. అయినా యాజమాన్యాలు ఇప్పటికీ అనుమతులు తీసుకోలేదు. ముగిసిన గడువు.. మళ్లీ నోటీసులు.. గతంలో యాజమాన్యాలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఏఐసీటీఈ నిరాకరించడం, దానివల్ల రాష్ట్రంలో 238 కాలేజీల్లో ప్రవేశాలు ఆగిపోతే మంచిది కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏఐసీటీఈకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో రెండేళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు గత నెలతోనే ముగిసిపోవడంతో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండీఏలోనే అధికం.. అనుమతుల్లేకుండా కొనసాగుతున్న కాలేజీల్లో ఎక్కువ శాతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. వాటిల్లోనూ 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 42 కాలేజీలు ఉన్నాయి. 238 కాలేజీల్లో కొన్ని కాలేజీలు గ్రామ పంచాయతీ అనుమతితో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాయి. ఆ 238 కాలేజీల స్థలాలు, భవనాలు, ఇతర అనుమతుల పత్రాలను తనిఖీ చేసి అక్టోబర్‌లోపు నివేదిక అందించాలని ఏఐసీటీఈ గత ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది. అది ఆ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగించింది. ఇంతవరకు కనీసం వాటిని తనిఖీ చేయలేదు. చివరకు ఆ బాధ్యతను జేఎన్టీయూకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. దీంతో సంబంధిత అనుమతి పత్రాలను అందజేయాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ లేఖలు రాసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఏఐసీటీఈ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. -
ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !
సాక్షి,తాడేపల్లి : తమ జీపు స్టార్ట్ కాక, వంతుల వారీగా తోసుకుంటూ పోలీసులు నానా తిప్పలు పడిన ఘటన సోమవారం తాడేపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే వెలగపూడి సచివాలయం నుంచి ఉండవల్లి సెంటర్ వైపు జీపులో నలుగురు పోలీసులు బయల్దేరారు. యూటీకే లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వవద్దకు వచ్చేటప్పటికి జీపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతసేపు స్టార్ట్ చేసినా కదలకపోవడంతో ఇక లాభం లేదని తోసుకుంటూ ముందుకెళ్లారు. ఇలాగైతే లాభం లేదనుకున్నారే ఏమో.. ఇద్దరు తోస్తూ, ఇద్దరు లోన కూర్చునే విధంగా బండిని తీసుకెళ్లారు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న అతనికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇలా వంతుల వారీగా అరకిలోమీటరు తీసుకెళ్లారు. చివరకు మళ్లీ ప్రయత్నించి ఈ సారి సఫలమయ్యారు. అప్పటివరకు మొరాయించిన జీపు ఒక్కసారిగా ఘీంకరిస్తూ స్టార్ట్ అయింది. దీంతో బతుకు జీవుడా అంటూ నలుగురు జీపులో ఎక్కి ఉండవల్లి సెంటర్ వైపుగా వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు దొంగలను పట్టుకునేటప్పుడు ఇలాంటి జీపులు వేసుకుని వెళితే వారు నడుచుకుంటూ తప్పించుకోవచ్చు గదా అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
ఉత్తరాఖాండ్‌లో ట్రాఫిక్ ఇక్కట్లు
డెహ్రాడూన్: దేశంలో అధికంగా హిల్ స్టేషన్లు ఉండి వేసవి కాలంలో నిత్యం సందర్శకులతో కళకళలాడే సందర్శన ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరఖండ్. భారీ సంఖ్యలో వస్తున్న సందర్శకులతో రోడ్లు కిక్కిరిసిపోతూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్లాలంటే సమయం రెండితలు అవుతోంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్ చేరుకోవాలంటే సుమారు 18 గంటల సమయం పడుతోందని ట్రాఫిక్ నియంత్రణ అధికారి తెలిపారు. 80 వేల పైగా మంది తమ వాహనాలలో ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారని హరిద్వార్ ఎస్ఎస్పీ జన్మేజయ్ కందూరి తెలిపారు. అదనపు అధికార బలగాలు ట్రాఫిక్ని తగ్గించే చర్యలు తీసుకున్నా భారీ సంఖ్యలో సందర్శకుల ప్రయాణించడం వల్ల నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. రిషికేశ్, ముస్సోరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, గంగోత్రి, యమునోత్రి, నైనిటాల్ ప్రాంతాల్లో కూడా యాత్రికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిషీకేశ్ రోడ్లను విస్తరించే క్రమంలో వెలువడ్డ శిథిలాలు వల్ల అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని జస్మిత్ బ్లాక్ ప్రముఖ్ ప్రకాశ్ రావత్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయపడాలంటే వెంటనే రోడ్ల మీద పేరుకుపోయిన శిథిలాలను తోలగించాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలం లేకపోవడం, చిన్న వాహనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం ట్రాఫిక్ స్తంభనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
డ్రైవర్ కొలువుల్లో కోత..
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంతో అక్కడి కంపెనీలు కుదేలయ్యాయి. ఆ ప్రభావం ఇంటి కార్లు నడిపించే డ్రైవర్లపైనా పడింది. షేక్‌లు నష్టాలను చవిచూడటంతో డ్రైవర్లకు వేతనాలు తగ్గించడం, కొంత మందికి కొన్ని నెలల వేతనాలు ఇవ్వకుండా వేధించడం జరిగింది. ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ ప్రభుత్వం మహిళలపై ఉన్న కఠిన చట్టాల్లో మార్పులకు అవకాశం కల్పించింది. దీనికి తోడు అక్కడి మహిళల్లో చైతన్యం రావడంతో ప్రభుత్వం కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళలు డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా కార్లు నడుపుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఆడవారికి డ్రైవింగ్‌కు అవకాశం ఉంది. కళాశాలకు వెళ్లే వారు, ఉద్యోగాలు చేసేవారు, ఇతరత్రా పనులు చేసే మహిళలకు సౌదీ ప్రభుత్వం కేటాయించిన సమయం అనుకూలంగా మారింది. దీంతో అనేక మంది డ్రైవర్లను అరబ్ షేక్‌లు తొలగించారు. ఒక ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే ఒక్కరినే కొనసాగిస్తూ ఇతరులను తొలగిస్తున్నారు. అంతేగాక గతంలో ఇచ్చిన వేతనాలను ఇప్పుడు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా షేక్‌లకు ఎదురు చెప్పే ధైర్యం మనవారికి లేక తక్కువ వేతనాలకే విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితిలో మన కరెన్సీలో రూ.18వేలకు మించి వేతనం లభించడం లేదు. భోజనం ఇతర ఖర్చులకు రూ.8వేలను మినహాయిస్తే మన కార్మికులు తమ ఇంటికి పంపించేది రూ.10వేల మాత్రమే. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతుండటంతో సౌదీలో డ్రైవర్ విధుల నిర్వహణ వెట్టి చాకిరే అవుతుంది. ఇప్పటికే వందలాది మంది డ్రైవర్లను సౌదిలోని షేక్‌లు తొలగించారు. ఉపాధి కోల్పోయి ఇంటికి చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలనే డిమాండ్ వినిపిస్తోంది. డ్రైవర్ కొలువులకు పెద్ద పీట వేసిన సౌదీ అరేబియాలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితి నెలకొంది. సౌదీ అరేబియాలోని మహిళలు సొంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మనవారి డ్రైవర్ కొలువులకు కోత పడింది. ఆ దేశంలో నాలుగు నెలల ముందు వరకు మహిళలు డ్రైవింగ్ చేయడం నిషేధం. ఈ నిషేధం మొదటి నుంచి కొనసాగుతుంది. దీంతో సౌదీలో ఇంటికి, కంపెనీలకు సంబంధించిన కార్లు, ఇతర వాహనాలను పురుషులే నడపాల్సి ఉంది. ప్రధానంగా ఇళ్లలోని ఆడవారిని బయటకు తీసుకెళ్లి.. మళ్లీ ఇంట్లో దిగబెట్టడానికి మగవారే డ్రైవింగ్ చేస్తారు. అలాగే అరబ్ షేక్‌ల పిల్లలను స్కూళ్లు, కళాశాలలకు తీసుకెళ్లి.. తీసుకరావడానికి కూడా డ్రైవర్లు అవసరం. సౌదీ అరేబియా మినహా మిగిలిన గల్ఫ్ దేశాల్లో ఆడవారికి డ్రైవింగ్‌కు అనుమతి ఉంది. ఒక్క ఈ దేశంలోనే మహిళల స్వేచ్చపై కఠినమైన ఆంక్షలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఇంటి కార్లు నడపడానికి డ్రైవర్లు అవసరం కావడంతో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మన కార్మికులు అనేక మంది సౌదీలో డ్రైవర్లుగా చేరారు. ఒక్కో ఇంటికి మూడు నుంచి ఐదు కార్లు ఉంటాయి. మరి కొందరు షేక్‌ల ఆర్థిక స్థితి బాగుంటే ఇంకా ఎక్కువ కార్లు ఉంటాయి. ఒక్కో ఇంటికి ఇద్దరు నుంచి ఐదుగురు వరకు డ్రైవర్లను షేక్‌లు పనిలోకి తీసుకున్నారు. పనికి తగిన వేతనం కూడా గతంలో లభించింది. ఒక్కో డ్రైవర్‌కు మన కరెన్సీలో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు జీతం వచ్చింది. సీనియర్ డ్రైవర్లకైతే రూ.35వేల వరకు వేతనం లభించిన సందర్భాలు ఉన్నాయి. వేతనంతో పాటు టిప్పుల రూపంలోనూ డ్రైవర్లకు అదనపు ఆదాయం సమకూరేది. మంచి వేతనంతో పాటు నివాస సదుపాయాన్ని అరబ్ షేక్‌లు కల్పించేవారు. కేవలం భోజనం మాత్రమే డ్రైవర్లు సమకూర్చుకోవాలి. సౌదీలో డ్రైవింగ్ చేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కార్మికులు ముందుకు వచ్చినా అరబ్ షేక్‌లు ఎక్కువగా తెలంగాణ కార్మికులకే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ 80 శాతం మంది డ్రైవర్లు తెలంగాణవారే. ఆరు నెలల జీతం ఎగ్గొట్టారు.. నా పేరు మహబూబ్. మాది ఏర్గట్ల. నేను ఐదేళ్ల నుంచి సౌదీలో హౌస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. నెలకు వేతనం రూ.20వేల వరకు లభించేది. డ్రైవర్‌గా చేరిన రెండేళ్లలో వేతనం సక్రమంగానే ఇచ్చారు. ఆ తరువాత కోత విధించడం మొదలు పెట్టారు. నెలకు రూ.20వేలు ఉన్న వేతనం రూ.18 వేలకు తగ్గించారు. ప్రశ్నిస్తే ఏదైనా నేరం మోపి పోలీసులకు పట్టిస్తారనే భయంతో యజమానిని ఏమీ అడుగలేదు. ఆరు నెలల పాటు వేతనం ఇవ్వలేదు. ఇంటికి వెళ్లే ముందు ఇస్తామని చెబితే ఓపికతో ఉన్నా. చివరకు విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. చేసేది లేక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే ముందు ఆరు నెలల వేతనం చెల్లించాలని కోరితే లేదు పొమ్మన్నారు. లక్షా ఎనిమిది వేల రూపాయల వేతనం ఎగ్గొట్టారు. వేతనం తగ్గించి ఒప్పందం చేసుకున్నారు నా పేరు ఇర్ఫాన్. మాది పాలెం గ్రామం. సౌదీలో ఇంటి కారు నడుపడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఏజెంటు మొదట నెలకు రూ.20వేలు అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌదీలో డ్రైవర్లకు డిమాండ్ లేకపోవడంతో వేతనం తగ్గిస్తున్నారు. నెలకు రూ.18వేలకు మించి వేతనం ఇవ్వమన్నారు. తక్కువ వేతనమైనా కొన్ని రోజులు పనిచేయాలనే ఉద్దేశంతో వీసా కోసం డబ్బులు చెల్లించాను. ఒప్పందం ప్రకారం వేతనం ఇస్తే ఇంటికి కొంత సొమ్ము పంపవచ్చు. ఇవ్వకపోతే మాత్రం నష్టపోతాం. అంతా అల్లాపై నమ్మకం ఉంచి సౌదీకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. -
మొరాయించిన తిరుపతి ప్యాసింజర్
గుంతకల్లు : గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ రైలు (57476) గూళపాళ్యం రైల్వేస్టేషన్లో మొరాయించింది. దీంతో సుమారు 2 గంటలు ఆలస్యంగా నడిచింది. వివరాలు.. ఉదయం 7.15 గంటలకు గుంతకల్లు నుంచి బయలుదేరిన రైలు గూళపాళ్యం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రైలు ఆగినట్టు అధికారులు తెలిపారు. అయితే గుంతకల్లు నుంచి మరో ఇంజన్ పంపి రైలుకు అటాచ్ చేయగా 9.30 గంటలకు రైలు కదిలింది. -
ఎల్లెల్లో...!
-
వేతన వెతలు
పోలీస్ సంక్షోభం =హోంగార్డులకు మూడు నెలలుగా అందని జీతం =బడ్జెట్ ఉన్నా మంజూరు చేయని అధికారులు =దయనీయ పరిస్థితిలో చిరు ఉద్యోగులు అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న శివ(పేరు మార్చాం) అనే హోంగార్డుకు నెలసరి వేతనం రూ.12 వేలు. ఇంటి అద్దెకు రూ. 4 వేలు, ఇంటి సరుకులు రూ. 3 వేలు, కరెంట్, పాల బిల్లు రూ. 900, డిష్ బిల్లులు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.5 వేలు ఖర్చు అవుతోంది. ప్రతినెలా వచ్చే ఈ జీతంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కుటుంబ పోషణకు అవసరమైన డబ్బును వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తోంది. రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. కేవలం ఒక్క శివ మాత్రమే కాదు జిల్లాలోని 961 మంది హోంగార్డూలదీ ఇదే పరిస్థితి. ‘అనంత’లోనే ఈ పరిస్థితి పొరుగున ఉన్న వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లోని హోంగార్డులకు 5,6 తేదీల్లో జీతాలు అకౌంట్లో జమ అవుతుండగా, జిల్లాలో మాత్రం వేతనాల చెల్లింపులు గందరగోళంగా మారాయి. జిల్లాలో హోంగార్డులకు వేతనాలు ఎప్పుడు ఇస్తారోకూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కనీసం ఉన్నతాధికారులకు విన్నవించుకునే సాహసం కూడా చేయలేని పరిస్థితిలో హోంగార్డులు బతుకీడిస్తున్నారు. ఒకవేâýæ వినతిపత్రం ఇస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతామో అనే భయాందోళన వారిలో వ్యక్తమవుతోంది. మానసిక క్షోభను అనుభవిస్తున్న హోంగార్డులు : పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డుల సంక్షేమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. హోంగార్డుల పేరును మార్చి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్(ఎస్పీఏలు)గా మార్చారు. బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ కలిపి రూ.19,884 ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం రూ. 12 వేలు మాత్రమే వస్తోంది. అది కూడా సక్రమంగా రాకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కుటుంబాలు కూడా సక్రమంగా గడవని పరిస్థితి నెలకొంది. కేవలం హోంగార్డులే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టని పోలీసు సంక్షేమం జిల్లాలో హోంగార్డులు అవస్థలు పడుతున్నా పోలీసులు అధికారుల సంఘం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులంటే కేవలం కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఆపై స్థాయి అధికారులు మాత్రమేనా అని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖులు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా ఒళ్లు హూనం అయ్యే లా పనిచేస్తోంది హోంగార్డులేనన్న విషయం ఉన్నతాధికారులకు తెలియదా? అని మండిపడుతున్నారు. పోలీసు అధికార సంక్షేమ సంఘంలో తమకు ఓటు లేదనే సంఘం నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. బడ్జెట్ రాలేదు : బడ్జెట్ రాకపోవడంతో హోంగార్డుల జీతాలు ఆగాయి. త్వరలో బడ్జెట్ వస్తుంది. మూడు నెలలవి కలిపి ఒకేసారి చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఏఆర్ డీఎస్పీ -
'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు
-
'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు
ముంబై: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా ఫ్రీ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. జియో 90 రోజుల ఉచిత డేటా మరియు వాయిస్ ఆఫర్ పొడిగింపు తాజా నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని అడిగింది. ఈమేరకు జియోకు వారం క్రితం లేక పంపించామని, త్వరలోనే జవాబును ఊహిస్తున్నామని ట్రాయ్ సీనియర్అధికారి వెల్లడించారు. ఈ విషయాలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. ముకేష్ అంబానీ నేతృత్వంలో జియోను ప్రమోషన్ ఆఫర్ పై వివరాలు తెలియజేయాల్సిందిగా డిసెంబర్20న లెటర్ పంపించామని అయిదురోజుల్లో వారి స్పందన రావాల్సి ఉందని చెప్పారు. డాటా ఆఫర్ లో స్వల్ప మార్పు తప్ప పాత ఆఫర్ కు పొడిగింపుగానే జియో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని ఆ అధికారి తెలిపారు. మరోవైపు రిలయన్స్ జియోకు తాజా ఆఫర్ కు వ్యతిరేకంగా భారతీ ఎయిర్ టెల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన తర్వాత కూడా ‘ఉచిత ఆఫర్’ కొనసాగింపునకు ఎలా అనుమతి ఇచ్చారంటూ ట్రాయ్ ను నిలదీసింది. ఈ మేరకు టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిలయన్స్ జియోకు ట్రాయ్ వంతపాడుతోందని ఆరోపించింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నుండి మూడు నెలల పాటు అందుబాటులోకి తెచ్చిన ఉచిత డేటా మరియు వాయిస్ కాల్స్ సేవలు డిసెంబర్ 3 న ముగియనుండగా డిసెంబర్ 1 న 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' ప్రకటించింది జియో. మార్చి 2017 వరకు పొడిగించిన ఈ ఆఫర్ ను పొడిగించింది. గతంలో రిలయన్స్ జియో 90 రోజుల ఉచిత సర్వీసులపై కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, ఇతర టెలికాం కంపెనీలఆరోపణలను తోసిపుచ్చిన ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల
-
కష్టాలు.. కన్నీళ్లే!
►రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం జనం విలవిల ►క్యూలైన్లలో సొమ్మసిల్లుతున్న వృద్ధులు ► పలు చోట్ల తొక్కిసలాటలు, ఆందోళనలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనమంతా బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే అదీ తొలి వంద, రెండు వందల మంది ఖాతాదారులకే చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు నగదు లేదంటూ ‘నో క్యాష్’ బోర్డులు పెడుతున్నారు. అటు గురువారం కూడా హైదరాబాద్‌లోని సుమారు 1,435 బ్యాంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు. మొత్తంగా ఉన్న ఏడువేల ఏటీఎంలలో గురువారం తెరుచుకున్నవి వెయ్యిలోపు మాత్రమే. ఎస్డీ రోడ్‌లోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యూలైన్లో నిలబడిన కృష్ణ సూర్యనారాయణ (65) అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను పోలీసులు వెంటనే లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఇక పలు చోట్ల బ్యాంకులు ఇచ్చే కొద్దిపాటి నగదు అయినా.. వారానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలతో కోఠి, అబిడ్స్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మోండా మార్కెట్, చార్మినార్ తదితర మార్కెట్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలు.. ఆందోళనలు.. నగదు కోసం బ్యాంకుల వద్దకు జనం భారీ సంఖ్యలో చేరుకుంటుండడంతో తొక్కిసలాట, తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల నగదు అందక జనం ఆందోళనలకు దిగుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట భారీగా జనం చేరారు. ఉదయం 10.30కు బ్యాంకు గేటు తెరవడంతో.. వారంతా ఒక్కసారికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ రైతులు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వేర్వేరుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నగదు ఇవ్వకుంటే తాము పంటలు ఎలా వేసుకోవాలంటూ బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్బీహెచ్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నగదు లేదనడంతో రైతులు రాస్తారోకో చేశారు. ఏటీఎంకు పూజలతో నిరసన జనాలకు డబ్బులు అందజేయాల్సిన ఏటీఎంలు.. నోట్ల రద్దుతో ఎందుకూ పనికిరాని డబ్బాలుగా మారిపోయాయి. దీంతో జనం ఏటీఎంలకు పూజలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం కామారెడ్డిలోని పలు ఏటీఎంలకు పట్టణ కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. అన్ని బ్యాంకుల ఏటీఎంలలోనూ డబ్బులు పెట్టడం లేదని.. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కన్నయ్య పేర్కొన్నారు. తిండీతిప్పలూ బ్యాంకు వద్దే.. అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తోపాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కొండపాక, దుద్దెడ ఆంధ్రా బ్యాంకులకు వచ్చారు. రూ.4వేల చొప్పున ఇస్తామంటూ బ్యాంకు అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ సేవలు పనిచేయకపోవడంతో నగదు ఇవ్వలేదు. దీంతో ఖాతాదారుల్లో చాలా మంది బ్యాంకు వద్దే నిరీక్షించారు. వారిలో కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులు తిని కడుపు నింపుకున్నారు. వృద్ధురాలికి ‘పెద్ద’ కష్టం ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు భాగ్యమ్మ (70). ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామం. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో గురువారం పింఛన్ సొమ్ము తీసుకుం దామని చెరువుమాధారం ఏపీజీవీ బ్యాంకుకు వచ్చింది. 2 గంట ల పాటు క్యూలో నిలబడడంతో.. సొమ్మసిల్లి పడిపోయింది. ఇది చూసిన మస్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే భాగ్యమ్మ తుంటి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితేమిటని వృద్ధురాలు కన్నీరమున్నీరవుతోంది. క్యూలైన్లోనే బీడీలు చుడుతూ.. రోజూ బీడీలు చుడితేగానీ పూట గడవని పరిస్థితి వారిది. నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి. దీంతో అటు బ్యాంకుల ముందు క్యూలైన్లో ఉంటూనే.. ఇటు బీడీలూ చుడుతు న్నారు కొందరు మహిళలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఆం ధ్రాబ్యాంకు ఎదుట గురువారం తెల్ల వారుజామున కనిపించిన దృశ్యమిది. పోత్గల్‌కు చెందిన ఈర్ల లక్ష్మి, ముస్తా బాద్‌కు చెందిన ఆరుట్ల లక్ష్మి, మరి కొందరు క్యూలైన్ల ఉండే బీడీలు చుడుతూ తమ వంతు కోసం ఎదురు చూశారు. గంటలు గంటలు నిలబడా ల్సి వస్తోందని, దాంతో పని పోతుం దనే ఉద్దేశంతో లైన్లోనే బీడీలు చుడుతున్నామని వారు పేర్కొన్నారు. అమ్మా.. పాలకులను కదిలించేనా నీ కంటి చెమ్మ.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి.. ఉన్నచోటి నుంచి కదలాలన్నా కష్టమైన పరిస్థితి.. అటు తిండికీ, ఇటు మందులకూ నెల నెలా వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. కానీ ‘నోట్ల రద్దు’తో ఆ పింఛన్ సొమ్మునూ తీసుకోలేని పరిస్థితి.. కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుకు వచ్చినా లైన్లో నిలబడలేక.. నిలబడినా సొమ్ము చేతికి అందక కన్నీళ్లే మిగులుతున్నాయి.. గురువారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చిన కమలమ్మ అనే వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. దుండిగల్ మండలం బౌరంపేట్‌కు చెందిన ఆమె.. అందరికన్నా ముందే బ్యాంకుకు వచ్చింది. కానీ నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తల బాదుకుంటూ, రోదిస్తూ ఇంటిదారి పట్టింది. ఇలా పింఛన్ సొమ్ము అందక ఎందరో పండుటాకులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. వాస్తవానికి తొలుత పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేసేవారు. తర్వాత ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘నగదు’ సమస్యల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు కష్టాలు తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా?.. పాత పద్ధతిలో నేరుగా పింఛన్ సొమ్ము అందజేసేందుకు ఏర్పాట్లు చేయలేదా..? -
ప్రజాపంపిణీకి ఇబ్బంది రానీయం
–ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం –జేసీ హరికిరణ్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరంలో డిసెంబరు నెల ప్రజా పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. వంద మంది డీలర్లు సస్పెండ్ అయినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... కొన్ని షాపులకు ఇన్చార్జీలను నియమిస్తున్నామన్నారు. మరికొన్ని షాపులకు తాత్కాలిక డీలర్లుగా నియమించేందుకు ఈ–పాస్ మిషన్లను ఆపరేట్ చేయగల యువకులను గుర్తిస్తున్నామన్నారు. ఈ–పాస్ మిషన్లను బైపాస్ చేసి అక్రమాలకు పాల్పడిన 149 మంది డీలర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. డీలర్లు కోర్టుకు వెళ్లారని, దీనిపై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. -
నిర్మాత కరణ్ జోహార్‌కు షాక్
-
నవాజ్ సర్కార్‌ను షేక్ చేస్తున్న డాన్ కథనం
-
సిబ్బంది లేక ఇబ్బంది
* తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఆవేదన * మూడేళ్లుగా సిబ్బంది కొరతతో సతమతం * అదనపు పనితో యాతన * పడుతున్నా స్పందించని ఉన్నతాధికారులు గుంటూరు (లక్ష్మీపురం): జిల్లా తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరతతో సతమతవుతోంది. గత మూడేళ్లుగా సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లా తూనికలు కొలతల శాఖ కార్యాలయం పట్టాభిపురంలో గత 10 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంది. శాఖలో మొత్తం ముగ్గురు జిల్లా ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉండాలి. అయితే మూడేళ్లుగా ఇద్దరు జిల్లా ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఒక రీజినల్ డెప్యూటీ కంట్రోలర్ ఉండాలి. అయితే ఆ పోస్ట్‌లో కూడా వైజాగ్ రీజినల్ డెప్యూటీ కంట్రోలర్ పి.సుధాకర్ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నారు. అంతా ఆ నలుగురే... ముగ్గురు జిల్లా ఇన్స్పెక్టర్లకు గాను ఇద్దరే విధులను నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రెగ్యులర్ జిల్లాఇన్‌స్పెక్టర్ అయిన దయాకర్‌రెడ్డి గుంటూరు ఇన్చార్జ్ జిల్లా ఇన్‌స్పెక్టర్‌గాను, నరసరావుపేట ఇన్చార్జి ఇన్‌స్పెక్టర్‌గాను విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పురుషోత్తం తెనాలి జిల్లా ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా నల్లబోతుల అలూరయ్య గుంటూరు రెగ్యులర్ ఇన్స్పెక్టర్ కాగా,సత్తెనపల్లి ఇన్‌చార్‌్జగా పనిచేస్తున్నారు.సయ్యద్ సలీం తెనాలి రెగ్యులర్ ఇన్స్పెక్టర్ కాగా, పొన్నూరు ఇన్‌చార్‌్జగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న చౌక డిపోలు 2660లను వీరు నలుగురు స్టాంపింగ్ చేస్తూ నానా యాత న పడుతున్నారు. పని భారంతో సతమతం.. తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్లు జిల్లా వ్యాప్తంగా చౌకడిపోలను ప్రత్యక్షంగా పరిశీ లించి ఈ పాస్ ఎలాక్ట్రానిక్ వేయింగ్ మిషన్ స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చిల్లర దుకాణాలు, పెట్రోల్ బంకులు, లారీ వేయింగ్లను, యార్డులలో ఉండే కాటాలను ఇలాæ తూకం వేసే ప్రతి వ్యాపారంపై పూర్తి నిఘా ఉంచాల్సి వస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిశీలించి దాడులు నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారుడిని మోసం చేసేందుకు వ్యాపారస్తుడు కాటాలో తేడా చూపించినట్టు సమాచారం అందితే హుటాహుటిన వచ్చి పరిశీలించి కేసులు నమోదు చేసి కాటాలను సీజ్ చేసే అధికారం కూడా ఈ శాఖలో ఇన్స్పెక్టర్లకు ఉంటుంది. అయితే సిబ్బంది లేని కారణంగా ఎనిమిదిమంది చేయాల్సిన పనిని నలుగురు మాత్రమే జిల్లాలో చేస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం జిల్లాలో మూడు సంవత్సరాలుగా సిబ్బంది కొరత ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఉండవలసిన ఎనిమిది మంది మాత్రమే కాకుండా మండలానికి ఓ ఇన్స్పెక్టర్ను నియమించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా కార్యాలయంలో కంప్యూటర్లు కూడా 2జిబి ర్యాం ఉన్నవి మూడు మాత్రమే ఉన్నాయి. 4జిబి ర్యాం ఉన్న కంప్యూటర్లు ఎనిమిది వరకు కావాలి. ప్రతి ఇన్స్పెక్టర్కు ఓ కంప్యూటర్ను కేటాయించి, సిబ్బంది కొరత తీర్చి, సొంత భవనంలోకి కార్యాలయాన్ని బదిలీ చేస్తే ప్రజలకు మరింత చేరువ అవుతాము. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశాం. – ఎ.కృష్ణచైతన్య, జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ -
కోతుల కట్టడి ఇలాగా.. ?
తెనాలి: జంతు సంరక్షణ చట్టాల్లో కాలానుగుణంగా మార్పులు తెస్తూ తగిన ప్రచారం చేస్తున్నా అమలు చేయాల్సిన ప్రభుత్వ శాఖలకు మాత్రం అవి చెవికెక్కటం లేదు. జంతువులను ప్రేమగా చూడాలని, హింసించవద్దనీ దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులు పోరాడుతున్నారు. మూడు చిన్న బోనుల్లో గురువారం తెనాలి పట్టణానికి చెందిన మున్సిపాలిటీ సిబ్బంది 96 కోతుల్ని ఇలా కిక్కిరిసేలా ఉంచారు. పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కోతులను అదుపులోకి తీసుకొని ఇలా చాలీచాలని బోనుల్లో బంధించారు. ఆ మూగజీవుల బాధను కళ్లారా చూసి చలించిన ఓ పౌరుడు తన స్మార్ట్‌ఫోనులో ఫొటో తీసి మీడియాకు పంపించారు. ఈ విషయం తర్వాత మున్సిపాలిటీ వారికి తెలిసిందో ఏమో? సాయంత్రానికల్లా టాటా ఏస్ వాహనం తీసుకొచ్చి కోతులను చిలకలూరిపేట వద్ద కొండల్లో వదిలేందుకు సిద్ధమయ్యారు. -
పునర్విభజన లొల్లి
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న ఉద్యమాలు సంకట స్థితిలో గులాబీ నేతలు పూలు చల్లిన చోటే రాళ్లు రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కరీంనగర్ సిటీ : జిల్లాల పునర్విభజన మంటలు అంతటా రాజుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. జిల్లా, డివిజన్, మండల సాధన కమిటీలు, జేఏసీలు పుట్టుకొచ్చి అచ్చం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీంతో పూలు చల్లిన చోటే రాళ్లు పడుతున్న చందంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రస్తుత పరిస్థితి సంకటంగా మారింది. భగ్గుమన్న సిరిసిల్ల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముందునుంచి ప్రచారంలో ఉన్నట్లు సిరిసిల్లకు బదులు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లా తెరపైకి రావడంతో సిరిసిల్ల ప్రాంతం భగ్గుమన్నది. అప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన చోటే దిష్టిబొమ్మల దహనానికి పూనుకున్నారు. హోర్డింగ్‌ల్లో మంత్రి ఫొటో ఉన్నా ధ్వంసం చేసేంతటి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సహజంగానే ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. అన్ని పార్టీలు, న్యాయవాదులు, కులసంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ తరహాలోనే జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన సెగ చివరకు రాష్ట్ర రాజధానికి సైతం తాకింది. మెున్నటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా హైదరాబాద్‌లో జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడంతో 48 గంటల బంద్ జరిగింది. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం జిల్లా సాధన కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టక తప్పలేదు. జేఏసీతో కలవకుండా వేరుకుంపటి పెట్టి రిలేదీక్షల పేరిట ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. చివరకు కేసీఆర్ కుటుంబసభ్యులు కూడా ఈ ఆందోళనలకు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి సిరిసిల్లలో నెలకొంది. ఉద్యమ ఉధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పదనే ధీమాతో జేఏసీ ఉండగా, ప్రభుత్వం సైతం పునరాలోచనలో పడిందనే ప్రచారం జరుగుతోంది. తెరపైకి పీవీ జిల్లా.. హన్మకొండను జిల్లా చేయొద్దంటూ ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా హుజూరాబాద్ జిల్లా తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలంటూ గత నాలుగు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లాలోకి ప్రతిపాదించిన హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలతో పాటు ప్రస్తుత వరంగల్ జిల్లాలోని పలు మండలాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కదులుతున్న కోరుట్ల వచ్చినట్లే వచ్చి చేజారి పోయిన రెవెన్యూ డివిజన్ సాధన కోసం కోరుట్ల ప్రాంత ప్రజలు ఏకమై కదులుతున్నారు. రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలంటూ కోరుట్లలో జరుగుతున్న ఆందోళన ఉధృతమైంది. తమ ప్రాంతానికి సరైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతోనే రెవెన్యూ డివిజన్ రాత్రికి రాత్రి మెట్‌పల్లికి మారిపోయిందని భావిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డివిజన్ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. ఇటీవల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి డివిజన్ గురించి విన్నవించారు. రెండు రోజుల పట్టణ బంద్ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. మెట్‌పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ల తీరును నిరసిస్తూ వారి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. – భూపాలపల్లి జిల్లాలోకి పోతున్న కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాలతో కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లితో పాటు కొత్తగా ఏర్పడే కొత్తపల్లి మండలాన్ని కలుపుకొని చొప్పదండి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష నాయకులు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. జఠిలంగా హుస్నాబాద్ మూడు ముక్కలైన హుస్నాబాద్ నియోజకర్గంలో పరిస్థితి రోజురోజుకు జఠిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని మండలాలు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లోకి పోవడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. గృహనిర్భంధం చేస్తామంటూ హెచ్చరిస్తూ టీఆర్ఎస్ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో కలిపిన ఇల్లంతకుంట, బెజ్జంకిలను కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలలో కలిపిన తమను పెద్దపల్లి జిల్లాలో చేర్చాలంటూ వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామస్తులు, కాల్వశ్రీరాంపూర్ మండలాన్ని మంథని రెవెన్యూడివిజన్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళన చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొత్తపల్లి మండలంలో తమను కలపాలంటూ రామడుగు మండలం వన్నారం, దేశరాజ్‌పల్లి, కొక్కెరకుంట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. మండలాల కోసం ఆందోళనలు జిల్లాలో కనీసం పది మండలాలు కొత్తగా ఏర్పడుతాయని ప్రచారం జరిగినా, ప్రభుత్వం కేవలం కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, అంతర్గాం, ఇల్లందకుంట... నాలుగు మండలాలతోనే సరిపెట్టింది. దీంతో మండలాల కోసం ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రోడ్డెక్కారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, కమాన్‌పూర్ మండలం రత్నాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి, రామగుండం మండలం బసంత్‌నగర్, జమ్మికుంట మండలం వావిలాల, భీమదేవరపల్లి మండలం కొత్తకొండను కొత్త మండలాలు చేయాలంటూ ఆయా ప్రాంతాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బసంత్‌నగర్‌కు చెందిన ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించి, బసంత్‌నగర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాల వెల్లువ డ్రాఫ్ట్ నోటిఫికే షన్లో అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆయా ప్రాంతాల్లోని ఉద్యమకారులు అనుకూలంగా మలుచుకొనే పనిలో పడ్డారు. ఇంటర్నెట్ కేంద్రాల్లో మకాం వేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు పంపించే పనిని కొంతమంది నాయకులకు ప్రత్యేకంగా అప్పగించారు. వేల సంఖ్యలో అభ్యంతరాలు వెళితే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనే అవకాశం ఉందంటూ ప్రచారం చేయడంతో స్వచ్చందంగానూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మెయిల్స్ పంపిస్తున్నారు. అధికార పార్టీకి సంకట స్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన విధంగా... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అధికార టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త సంకట స్థితిని తీసుకొంది. రాజకీయంగా జిల్లాలో ఎదురులేకుండా కొనసాగుతున్న టీఆర్ఎస్కు తామే తెచ్చిపెట్టుకున్న పునర్విభజన అంశం రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. మొన్నటి వరకు పూలు చల్లిన చేతులతోనే రాళ్లు వేస్తుండగా, కీర్తిస్తూ పాటలు పాడిన నోళ్లతోనే కించపరుస్తూ పేరడీ పాటలతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో తిరుగులేని శక్తిలా ఎదిగిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు జిల్లా సమస్య తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సిరిసిల్ల జిల్లా కాకపోవడంతో కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు పావులు కదపడంతో నిత్యం దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి. అక్కడక్కడా అధికార పార్టీకి, జేఏసీ ప్రతినిధులకు నడుమ వాగ్వాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి సిరిసిల్లను జిల్లాగా చేస్తే పెద్దపల్లి భవిష్యత్ ఏంటనే ప్రశ్న ఉత్కంఠను రేపుతోంది. సిరిసిల్ల జిల్లా అయితే పెద్దపల్లి రద్దవుతుందనే ఊహాగానాలతో అప్పుడే పెద్దపల్లిలో అఖిలపక్షం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హన్మకొండ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో, పెద్దపల్లి రద్దుకాకుండానే సిరిసిల్ల ఏర్పడుతుందంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. -
వివాదంలో విశాల్
తమిళసినిమా: నటుడు, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకు ముందు గత దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గ నిర్వాహకంపై విమర్శనాస్త్రాలు సంధించి వారి ఆగ్రహానికి గురైన విశాల్ ఆ తరువాత ఆ కార్యవర్గానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నిర్మాతల కార్యవర్గంపై విమర్శలు చేసి మరో సారి వివాదాల్లో చిక్కుకున్నారు. పైరసీని అరికట్టడానికి తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఒక భేటీలో ఆరోపణలు గుప్పించారు. ఆ సంఘంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, నడిగర్ సంఘం తరహాలోనే ఆ సంఘాన్ని చేజిక్కించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ విమర్శలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం మంగళవారం స్థానిక ఫిలించాంబర్ ఆవరణలో సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విశాల్ చర్యల్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అయితే నటుడు మన్సూర్ అలీఖాన్‌తో పాటు కొందరు మాత్రం విశాల్‌కు మద్దతుగా మాట్లాడడం విశేషం. విశాల్ తమిళ నిర్మాతల మండలిని అవమానించే విధంగా ఒక భేటీలో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, వారంలోపు ఈ వ్యవహారంలో తన విచారాన్ని వ్యక్తం చేయాలని లేని ఎడల దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన నటిస్తున్న కత్తిసండై చిత్రంతో పాటు ఆయన నటించే ఏ చిత్రానికి తమిళ నిర్మాతల మండలి, తమిళ నిర్మాతలు సహకరించరని తెలిపారు. ఈ వ్యవహారంపై విశాల్‌ను స్పందించాల్సిందిగా కోరగా తమిళ నిర్మాతల మండలి తరఫున ఇంత వరకూ తనను ఈ విషయమై వివరణ అడగలేదన్నారు. దీని గురించి వారు తనను అడిగినా, లేఖ పంపినా తగిన వివరణ ఇస్తానని అన్నారు. మొత్తం మీద ఈ అంశం కోలీవుడ్‌లో మంచి వేడినే పుట్టిస్తోందని చెప్పవచ్చు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. -
రైతులు సమస్యలు పరిష్కరించాలి
కావలిరూరల్ : దేశానికి అన్నంపెట్టే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సీఎస్ఆర్ కోటిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కావలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకతివిపత్తుల సమయంలో పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వాలు కంటితుడుపుగా నష్టపరిహారాలు చెల్లిస్తున్నాయన్నారు. దీంతో చాలామంది గిట్టుబాటు ధరలు లేక, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడన్నారు. పిల్లల చదువులకోసం భూములను అమ్ముకొని పట్టణాలకు వలసలు వెల్లి అక్కడ కూలీలుగా మారుతున్నారన్నారు. పంటలకు, రైతులకు, పశువులకు, వ్యవసాయ యంత్రాలకు, పనిముట్లకు ఉచితబీమాను అందించాలన్నారు. రైతులకు నష్టం వాటిలినప్పుడు శాటిలైట్ ద్వారా నష్టాన్ని అంచనా వేసి 30 రోజులలోపు వారిబ్యాంకు ఖాతాలలో పరహారం జమచేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలి. -
‘పథకం’.. పునాదికే పరిమితం
రెండేళ్లయినా కదలని ‘డబుల్ బెడ్రూం’ వెనకడుగు వేస్తున్న కాంట్రాక్టర్లు ఆరు వేలకు.. 422 ఇళ్లకే టెండర్లు పునాదిరాయి పడింది 110 ఇళ్లకే.. ఇదిగో ఇల్లు.. అదిగో ఇల్లు.. ఇలా రెండేళ్లు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ముందుకు కదలని పథకం.. గూడు లేని పేదలు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నా.. మచ్చుకు ఒక్క ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి.. డబుల్ బెడ్రూం ఇళ్ల కట్టుబాటులో తమకేమీ గిట్టదని కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో ఏర్పడిన అనిశ్చితి.. జిల్లావ్యాప్తంగా ఆరువేల ఇళ్లకు.. ఇటీవల 422 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి.. ఇప్పటికీ 110 ఇళ్లకే పునాదులు పడగా.. వైరా, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టెండర్ల ఊసే లేని దుస్థితి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో.. ఒక్కో దానికి 400 చొప్పున ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. ఖమ్మంకు అదనంగా 1,600 ఇళ్లను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 6వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. అయితే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తే తమకు కొంతైనా లాభం ఉండదని బడా కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.20లక్షలు, పట్టణాల్లో రూ.6.05లక్షలకు యూనిట్ విలువను పెంచింది. అయినా గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి వల్ల జిల్లా, నియోజకవర్గాలవారీగా కాకుండా గ్రామాలవారీగా టెండర్లు పిలవడంతో కొన్ని గ్రామాల్లోనే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. ఖమ్మం, ఖమ్మం రూరల్, ఇల్లెందు, మణుగూరు, పెనుబల్లి, వాజేడు ఇలా కొన్ని మండలాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో.. ఇప్పటివరకు 422 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో 22, ఇల్లెందు మండలంలో 20, లంకపల్లి 40, మణుగూరులో 28.. మొత్తం 110 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. టెండర్లు ఖరారైనప్పటికీ ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం లేదు. వైరా, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచినా స్పందన లేకుండాపోయింది. ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ.. ఇక నియోజకవర్గాల్లో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు చోటా మోటా నేతలు ఇళ్లు ఇప్పిస్తామంటూ ఇంకా హామీలిస్తున్నారు. ఇళ్లు లేని పేదల నుంచి దరఖాస్తులు తీసుకుని.. వారి వద్ద నుంచి కొంత సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గానికి పరిమితంగా ఇళ్లు మంజూరు కావడంతో ప్రజలు కూడా నేతలు చెప్పే మాటలు నమ్మి.. ఎలాగైనా తమకు ఇళ్లు ఇప్పించాలని అప్పో.. సప్పో చేసి కొంతమేరకు ముట్టచెబుతున్నారు. ఇలా వందలాది మంది వద్ద దరఖాస్తులు తీసుకున్న నేతలు.. అందులో తమకు ఎవరు ఎక్కువ ముట్టచెబితే వారికే ఇళ్లు ఇప్పించేందుకు అనుంగు ముఖ్య నేతలతో పైరవీలు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇక గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను గుర్తిస్తామని చెబుతున్న అధికారులు.. అధికార పార్టీ నేతలు తీసుకుంటున్న దరఖాస్తులపై నోరుమెదపకపోవడం గమనార్హం. అర్హులు ఒకచోట.. స్థల సేకరణ మరోచోట.. ఇళ్ల నిర్మాణ విషయంలో అర్హులు ఒక ప్రాంతంలో ఉంటే.. అధికారులు మాత్రం మరో ప్రాంతంలో స్థల సేకరణ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పట్టణాలకు సమీపంలో కాకుండా.. దూరంగా ఉన్న ప్రాంతంలో అధికారులు భూ సేకరణ పై దష్టి పెట్టడంతో పలు విమర్శలొస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైనా వీటి గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని కబ్జా చెర నుంచి విడిపిస్తే కనీసం నియోజకవర్గ కేంద్రంలో ఎంపికయ్యే లబ్ధిదారులకైనా ఇళ్లు నిర్మించే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ పథకం కింద నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించినా.. ఈ కాలనీల్లో ఇప్పటికీ రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సరఫరా లేదు. ఇళ్లు నిర్మించినా లబ్ధిదారులు మాత్రం వాటిలో అడుగు పెట్టలేదు. డబుల్ బెడ్రూం పథకం కింద నిర్మించే ఇళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మాత్రం తమకు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందా? అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. -
వానందం
-
డీఎస్‌ఏలో ప్రక్షాళన షురూ
♦ జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం ♦ పాత భవనంలోకి డీఎస్డీఓ ఛాంబర్ మార్పు ♦ ప్రస్తుత గదిని కలెక్టర్, శాప్ బోర్డు సమావేశాలకు కేటాయింపు ♦ స్టేడియం ఆధునికీకరణ ఇప్పట్లో లేకపోవడమే కారణమా? శ్రీకాకుళం న్యూకాలనీ: డీఎస్ఏ డీఎన్ఏ మారుతోంది. అదేనండీ జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ప్రక్షాళన మొదలైంది. భవనాల నుంచి సిబ్బంది వరకు మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. మళ్లీ పాత రోజుల వైపు ప్రయాణించడాన్ని క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ ప్రతిని ధులు, వెటరన్ క్రీడాకారులు స్వాగతిస్తున్నారు. చాంబర్ మార్పుతో మొదలు.. ప్రక్షాళన డీఎస్డీఓ చాంబర్తోనే మొదలైంది. పదేళ్లుగా పసగడ్డ సూర్యనారాయణ ద్వారానికి ఆనుకుని ఉన్న డీఎస్డీఏ చాం బర్ను డీఎస్ఏ ప్రధాన ద్వారం వద్ద గల భవనం గదుల్లోకి మార్చారు. పాత భవనమే అయినా నూతన చాంబర్లోకి ముఖ్యమైన ఫైళ్లతో ఉన్న బీరువా, ఫైళ్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని మార్చారు. ఇవే భవనాల్లో గతంలో శంకరరావు, సూరారెడ్డి, రామ్మోహనరావు, వేణుగోపాలరావు, పున్నయ్యచౌదరి, ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు జిల్లా క్రీడాభివృద్ధి అధికారులుగా పనిచేశారు. 2004–05లో డీ ఎస్‌డీఓగా ఎల్.దేవానందం బాధ్యతలు తీసుకున్న తర్వాత గేటుకు సమీపంలో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అయితే పాత రోజు లతో పోల్చితే భవనం మార్చిన తర్వాత పెద్దగా అభివృద్ధి లేదని విశ్రాంత పీఈటీలు, క్రీడాసంఘాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో పాత భవనంలోకి కార్యాల యాన్ని మార్చారు. మళ్లీ పాతరోజుల్లోకి... జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో మళ్లీ పాతరోజులని గుర్తుచేస్తూ ప్రస్తుత డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కోచ్‌గా, వందలాది మంది క్రీడాకారులను తయారుచేసిన శ్రీనివాస్, గతంలో ఇక్కడ అథ్లెటిక్స్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఇన్నాళ్లు ఉపయోగించిన తన చాంబర్‌ను జిల్లా కలెక్టర్‌తో సమావేశాలకు, శాప్ బోర్డు సమావేశాలకు, వీడియో కాన్ఫరెన్స్‌లకు, క్రీడాసామగ్రికి వినియోగించాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం ఆధునికీకరణ ఇప్పట్లో జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో ఉన్న సౌకర్యాల ను ఉపయోగించుకోవాలని, క్రీడాకారులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. సిబ్బంది లేమితో సతమతం.. మార్పుల వరకు బాగానే ఉన్నా సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న కొద్దిమంది సిబ్బందితోనే ఆధునికతను జోడిం చే విధంగా విధులు నిర్వర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది సిబ్బందిని స్టేడియంలోను మిగిలిన సిబ్బందిని డీఎస్ఏ పరిధిలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్లోను పని చేసే విధంగా వారి రోజువారి విధులను సిద్ధం చేస్తున్నారు. ప్రక్షాళన ఓ కొలిక్కి వస్తే అనంతరం ఈ సీజన్ క్రీడాపోటీలు, టోర్నీల షెడ్యూల్ ప్రణాళిక, వాటి అమలు, అకాడమీలు, మినీ స్టేడియాలపై దృష్టిసారించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. -
ఇంటికో గంట ప్రహసనంలా పల్స్ సర్వే
♦ కేటాయించిన వారైతేనే.. లేకపోతే ఓపెన్ కాని ట్యాబ్ ♦ ముందుగానే వీధులు.. ఎన్యుమరేటర్ల పేర్లు ఫీడింగ్ ♦ ఈ నెల 31లోపు పూర్తి చేయడం అసాధ్యం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ సర్వే ప్రహసనంలా మారింది... ఇది ప్రజలు, సిబ్బందిలో పల్స్ రేటు పెరిగేలా చేస్తోంది... ఒక్కో ఇంటికి గంట సమయం పడుతుండటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు... ఇందులో కుల గణన ప్రస్తావన ఉండటంతో అధిక శాతం మంది ప్రజలు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించాలని నిర్ణయించి పల్స్ సర్వేకి శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుత సర్వే పరిస్థితి చూస్తే ఆశించిన స్థాయిలో అనుకున్న లక్ష్యాలను సాధించేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఈ నెల 31లోపు పల్స్ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వాస్తవ పరిస్థితి చూస్తే సర్వే పూర్తి చేయడానికి నెలాఖరు కాదు.. రెండు, మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులే పేర్కొంటున్నారు. ఈ నెల 8 నుంచి పల్స్ సర్వే ప్రారంభించినా ఊపందుకోలేదనే చెప్పాలి. ఎన్నో సమస్యలు, ఒక్కో సారి ట్యాబుల ఇబ్బందులు, మరోసారి ఎన్యుమరేటర్లు ఏదో ఒక పరిస్థితుల నేపథ్యంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు సర్వే సాగుతోంది. ఒక ఇంటికి ఒక గంట ప్రభుత్వం తరఫున ఎన్యుమరేటర్లు చేపడుతున్న పల్స్ సర్వే చాలా సమయం తీసుకుంటోంది. ఒక ఇంటికి సంబంధించి సర్వే చేయాలంటే దాదాపు గంట సమయం పడుతోంది. సుమారు 91 కాలమ్స్‌ను సంబంధిత వ్యక్తులను అడిగి ఎన్యుమరేటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఆస్తులు, ఇల్లు, భూములు, ఇంటిలోని వస్తువులు, బయట పని చేస్తున్న ఉద్యోగం, కార్యాలయం, కులం, చదువు ఇలా చెబుతూ పోతే ఎన్నో రకాల ప్రశ్నలతో సమాధానాలు పూరించాలి. అంతే కాకుండా మొదట వీధిలోని ఇంటి వద్దకు వెళ్లగానే యజమాని ఆధార్ కార్డు నంబరు ఫీడ్ చేయడం, తర్వాత వేలిగుర్తు వేయగానే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత జీపీఎఫ్ ద్వారా ఇంటిని బంధించడం, తర్వాత ప్రశ్నల పరంపర మొదలవుతుంది. ఇలా ఒక్కోసారి చేపట్టే పనిలో ఇతర అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఒక ఇంటికి సంబంధించిన సర్వే పూర్తి చేయాలంటే గంట సమయం పడుతోంది. ఎన్యుమరేటర్ కేటాయించిన ప్రకారం వెళితేనే.. జిల్లాలో పల్స్ సర్వేకి సంబంధించి ఎన్యుమరేటర్లు కేటాయించిన వీధుల ప్రకారం వెళితేనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ట్యాబుల్లో ఎన్యుమరేట్లకు సంబంధించిన గుర్తులు ఫీడ్ చేయడంతో కచ్చితంగా సంబంధిత ఎన్యుమరేటరే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఫలానా వీధి, ఫలానా ట్యాబ్, ఫలానా ఎన్యుమరేటర్ మూడింటికి సంబంధించి లింక్ పెట్టడంతో వేరే వారు సర్వే చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కేటాయించిన ఎన్యుమరేటరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కులగణనపై పెదవి విరుపు పల్స్ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు కుల గణన రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం బీసీ, ఎస్సీ, ఓసీ ఇలా గణన నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం కులాలకు సంబంధించిన ప్రాతిపదికన బీసీల్లో ఉన్న ఉప కులాలు, ఎస్సీల్లో ఉన్న ఇతర కులాలు.. ఇలా అన్ని ఉప కులాలను చేరుస్తుండడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే రానున్న కాలంలో కులాల ప్రాతిపదిక పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం సమాచారాన్ని తీసుకుని అందుకు అనుగుణంగా పావులు కదపడానికి ప్రణాళిక రూపొందిస్తోందని చర్చించుకుంటున్నారు. 31లోపు అసాధ్యం ♦ ఈ నెల 8న ప్రారంభమైన పల్స్ సర్వే ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎన్యుమరేటర్లు, ఇతర సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ♦ ఎందుకంటే సర్వేలో 91 కాలమ్స్ ఉన్న నేపథ్యంలో ఒక ఇంటిని సర్వే చేయాలంటేనే గంట సమయం పడుతున్న క్రమంలో అంత ఈజీ కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులే పేర్కొంటున్నారు. ఒక్కొక్క ఇంటికి అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో 31లోగా సర్వే పూర్తి చేయడం దాదాపు అసాధ్యం! ఐదు సార్లు మారిన సాఫ్ట్వేర్ రాష్ట్ర ప్రభుత్వం పల్స్ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టినా అనేక రకాల సమస్యలతో రోజూ సాఫ్ట్వేర్ మారుస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైనా 13వ తేదికి అంటే ఐదు రోజుల నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌ను ఐదు సార్లు మార్చారు. దీంతో కొత్త ప్రశ్నలతోపాటు ఇతర అనేక రకాల అంశాలను చేరుస్తుండడంతో రోజురోజుకు సర్వే విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఇదేమిటని ప్రశ్నించే అధికారి లేకపోగా...ఉన్నతాధికారులు చెప్పిందేవేదంగా పలువురు ఎప్పటికప్పుడు మారుతున్న సాఫ్ట్వేర్కుఅనుగుణంగా సర్వే నిర్వహిస్తున్నారు. -
ప్రముఖ బాలీవుడ్ హీరోకి లీగల్ నోటీసులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(ఎమ్ హెచ్ఏడీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ కు సంబంధించి తప్పుడు ప్రకటన లో ఆయన ఉన్నందుకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఏక్తా వరల్డ్ లో నిర్మిస్తున్న ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక ప్రకటనను ఇచ్చారు. ఇందులో ఎమ్ హెచ్ఏడీఏ కంటే తక్కువ ధరకే తాము ఫ్లాట్ల అమ్మకం చేపడతామని ప్రకటించారు. తప్పుడు సమాచారంతో తమ సంస్థ పేరును వాడుకున్నారని ఏక్తా వరల్డ్ యాజమాని అశోక్ మెహనాని కి, ప్రకటనలో నటించినందకు అనిల్ కపూర్ కూ నోటీసులను ఎమ్ హెచ్ఏడీఏ జారీచేసింది. -
ఇక ఫ్రీడం రూ.251 అంతేనా?
న్యూఢిల్లీ: నోయిడా కు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ దారు రింగింగ్ బెల్స్ భారీ కష్టాల్లో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలో నే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన ఫ్రీడం రూ. 251 స్మార్ట్ ఫోన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నవాళ్లు ఇక నీళ్లు వదలు కోవాల్సిందేనా అన్న అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాల పడుతూ వస్తున్న ఈ ఫోన్ల్ జారీ ప్రక్రియ ..తాజా వార్తల నేపథ్యంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఫిబ్రవరిలో ఫోన్ ఆవిష్కరణ తర్వాత భారీ బుకింగ్స్ ను సాధించిన ప్పటికీ, తన మొదటి ఫోన్ డెలివరీ ఇంకా స్టార్ట్ కాకముందే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కంపెనీ వాగ్దానం చేసినట్టుగా ఫోన్లను అందించడంలో పలుమార్లు విఫలమైన సంస్థ యాజమాన్యం మధ్య విభేదాలు చెలరేగినట్టు తెలుస్తోంది. మేనేజ్మెంట్ స్థాయిలో ఆర్థిక పరంగా తీవ్రమైన విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. దీంతోపాటు ఫ్రీడం 251 ఫోటోను వెబ్ సైట్ (రింగింగ్ బెల్స్.కో.ఇన్) నుంచి తొలగించడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అలాగే మిగతా స్మార్ట్ ఫోన్ల కోసం వెతికినపుడు, బై నౌ బటన్ ప్రెస్ చేస్తే.. 72 గంటల్లో అమ్మకాలు పూర్తయ్యాయని ... తొందర్లోనే బుకింగ్ మొదలు కానున్నాయి అన్న సందేశం దర్శనమిస్తుండడం విశేషం. కంపెనీ అధ్యక్షుడిగా పరిచయమైన అశోక్ చద్దా సీఈవో మోహిత్ గోయల్ మధ్య తీవ్రమైన ఆర్థిక విభేదాలు వచ్చాయినీ.. అందుకే సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండడం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై చద్దాను వివరణ కోరినపుడు రింగింగ్ బెల్స్ కి తాను పనిచేయడంలేదనీ సలహాదారుగా మాత్రమేనని సమాధానం చెప్పారు. అటు సీఈవో మొహిత్ గోయల్ కు ఫోన్ చేసినపుడు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించే నాధుడు కోసం వేచి చూస్తోంది. కాగా ఈ ఫ్రీడం ఫోన్ తయారీకి 1200 రూ. ఖర్చవుతోందని , కానీ వినియోగదారుల కోసం రూ.251 కే అందించనున్నామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ఒక్కో యూనిట్ కు సుమారు రూ 900 ల భారీ నష్టానికే సరఫరా చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ నష్టాలు.. వివాదాల్లో రింగింగ్ బెల్స్ కూరుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే జులై 7న తమ ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందించినున్నట్టు ఇటీవల గోయల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతును కోరునున్నట్టు ప్రకటించడం గమనార్హం. -
సెల్ఫీ కష్టాల్లో మావోయిస్టు అగ్రనేత
విశాఖపట్నం: చిన్నా పెద్దా అందరికీ సెల్ఫీ ల మోజు సామాన్యమైంది కాదు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సెల్ఫీ వివాదంలో ఓ మావోయిస్ట్ అగ్రనేత చిక్కుకోవడంతో వైజాగ్ రూరల్ పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. అవును...చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఉనికి ఇపుడు ప్రమాదంలో పడింది. చలపతి ఆచూకీ లభ్యం కాక ..కనీసం అతని ఫోటో కూడా దొరకక తలపట్టుకున్న పోలీసులకు .. అతను భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ లభ్యం కావడం ఆసక్తకరంగా మారింది. మావోయిస్టు నేత, కోరాపూట్- శ్రీకాకుళం డివిజన్ కమిటీ డిప్యూటీ కమాండర్, మోస్ట్ వాంటెడ్ చలపతి అలియాస్ అప్పారావు, అతని భార్య అరుణఫోటో పోలీసులకు చిక్కింది. దీంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు అతికించడం కలకలం రేపింది. అయితే ఏడాది మే14న జరిగిన ఎన్ కౌంటర్ లో అరుణ సోదరుడు, మావోయిస్ట్ అజాద్ సహా, మరోఇద్దర్ని పోలీసులు కాల్చిచంపారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో ఆయుధాలు, కిట్ బ్యాగులు,ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చలపలి సెల్ఫీ ఫోటోను సేకరించారు పోలీసులు. వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల తూర్పు డివిజన్ కార్యదర్శి కూడా అయిన చలపతిపై 20 లక్షల రివార్డు ఉండగా, అరుణపై 5 లక్షల రివార్డు ఉంది. ఎప్పుడో 90ల్లో దిగిన సరిగా కనిపించని ఫొటోతోనే ఇన్నాళ్లూ పోలీసులు చలపతి కోసం గాలించారు. కానీ ఇప్పుడు ఏకంగా అతడే ఇలా సెల్ఫీతో తన ఆనవాళ్లు అందించడంతో తమ పని సులువైందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత సెల్ఫీని లాప్టాప్లో దాచుకోవడం వాళ్లు చేసిన పెద్ద పొరపాటని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోటోల సహాయంతో చలపతి ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు, సెల్ఫీ వార్తలపై అటు మావోయిస్టు వర్గాలనుంచి గానీ, ఇతర విప్లవ పార్టీలనుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. -
‘డబుల్’కు తప్పని ట్రబుల్
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఖర్చు తగ్గించే పరిజ్ఞానంపై ఆరా ఆసక్తివ్యక్తీకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం డిజైన్లు సమర్పించేందుకు నెలాఖరు వరకు గడువు ఖర్చుకు జడిసి ముందుకురాని కాంట్రాక్టర్లు మూడు చోట్ల మినహా ఎక్కడా ఖరారు కాని టెండర్లు హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ట్రబుల్ తప్పడంలేదు. ప్రతిపాదిత యూనిట్‌కాస్ట్ తమకు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు మొహంచాటేస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇచ్చినా, సిమెంటు, స్టీలు లాంటి మెటీరియల్‌ను తక్కువధరకు సరఫరా చేసినా నిర్మాణం వ్యయం యూనిట్ కాస్ట్‌ను మించి అవుతుందని కాంట్రాక్టర్లు అంటున్నారు. తాను ప్రతిపాదించిన యూనిట్‌కాస్ట్‌లో ఇళ్లను నిర్మించదగ్గ పరిజ్ఞానం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఇందుకోసం ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు పరిజ్ఞానం, దాని ద్వారా నిర్మిస్తే అయ్యే వ్యయం, డిజైన్లు తయారు చేసుకుని రావాల్సిందిగా ప్రభుత్వం తాజాగా ఆసక్తివ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు వారు డిజైన్లు సమర్పించేందుకు గడువు విధించింది. మూడుచోట్లనే టెండర్లు రెండు పడక గదుల ఇళ్ల కోసం ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విడి విడిగా అంచ నా వ్యయం ఖరారు చేసింది. పట్టణ ప్రాంతా ల్లో రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలుగా నిర్ధారించింది. పట్టాణాల్లో ఇళ్లను ఒకేచోట కాలనీలుగా నిర్మించనుండగా, గ్రామీణ ప్రాంతాల్లో అది కుదరటం లేదు. ఫలితంగా ప్రభుత్వం నిర్ధారించిన అంచనా వ్యయంలో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు కావస్తున్నా, ఒక్క ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామం మినహా మరే గ్రామీణ ప్రాంతంలోనూ ఇళ్లను నిర్మించలేదు. కేవలం వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ పట్టణాల్లో మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. అవి కూడా జీప్లస్ 3 పద్ధతిలో నిర్మించేవాటికే ఆర్డరయ్యాయి. జీ ప్లస్ 1 పద్ధతిలో నిర్మించే ఇళ్లకు టెండర్లు పిలిస్తే చాలా ఎక్కువ మొత్తానికి కోట్ చేయటంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విపక్షాలు, ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా మీనమేషాలు లెక్కించటం మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం తక్కువఖర్చుతో తాను ప్రతిపాదించిన యూనిట్‌కాస్ట్‌తో ఇళ్లను నిర్మించే సంస్థ కోసం ప్రకటన జారీ చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతపై చూపు కార్పొరేట్ కంపెనీలు ‘సామాజిక బాధ్యత’గా కొంత ఉదారతను ప్రదర్శిస్తుంటాయి. ఆ ఉదారతను ఇప్పుడు రెండు పడక గదుల ఇళ్ల విషయంలో చూపాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ పథకం రూపంలో ప్రభుత్వ ఖజానాపై అత్యంత భారీ భారం పడుతోంది. దాన్ని భరించటం ప్రభుత్వానికి కష్టంగా మారబోతోంది. దీంతో బడా పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని కోరబోతోంది. సిమెంటు, స్టీలు, ఇతర నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు అతి తక్కువ ధరకు మెటీరియల్‌ను అందించేలా కోరాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. -
తీరని ఈ-పాస్ కష్టాలు
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలుతో గత నెలలో 2.44 లక్షల కుటుంబాలకు సరుకులు అందకుండా పోయాయి. మంచంపై ఉన్న వారైనా వేలిముద్ర, ఐరిష్ లేకపోతే సరుకులను నిలిపివేశారు. దీనివల్ల అనేక కుటుంబాలకు తిండిగింజలు లేని పరిస్థితి దాపురించింది. సుమారు 13,400 కుటుంబాలు రేషన్ తీసుకునేందుకు రాలేని పరిస్థితి ఉన్నా సరుకులు ఇవ్వలేదు. వారికి సరుకులు ఇవ్వాలన్నా పౌరసరఫరాలశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సిఉందని జిల్లా యంత్రాంగం దాటవేస్తున్నారు. దీంతో నాలుగు నెలలుగా రేషన్ కష్టాలు పేదలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ-పాస్ అమలులో మూడో స్థానం ఈ-పాస్ అమలులో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇందులో అగ్రభాగం కృష్ణా జిల్లా. ఇక్కడ 82 శాతం కుటుంబాలకు ఈ-పాస్ ద్వారా సరుకులు నాలుగు నెలలుగా పంపిణీ చేస్తున్నారు. రెండో స్థానం అనంతపురం. ఇక్కడ కూడా 77 శాతం కార్డులకు మాత్రమే సరుకులు ఇస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాది మూడో స్థానం. ఇక్కడ కేవలం 70 శాతం కార్డులకు మాత్రమే గత నెలలో సరుకులు అందజేశారు. పౌరసరఫరాల శాఖ మొండి పట్టుదల ప్రజలకు అందినా అందక పోయినా పర్వాలేదు. మీరు మాత్రం ఈ-పాస్ విధానాన్నే అమలు చేయాలంటూ పౌరసరఫరాలశాఖ మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. 30 శాంత కుటుంబాలకు అసలు నిత్యావసర సరుకులే అందకుండా పోతే ఇక ప్రభుత్వం చెబుతున్న ఆహార భద్రత అమలు ఎలా సాధ్యమని ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బయోమెట్రిక్ పద్ధతిలో ఈ-పాస్ విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. సెప్టెంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసింది. డీలర్లకు అవగహన కల్పించిన అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు సిద్ధపడ్డారు. జిల్లాలో ఈ విధానం అమలుకు 2001 మంది డీలర్లకు ఈ-పాస్ యంత్రాలను అందజేసిన ప్రభుత్వం బయోమెట్రిక్ కార్డుల అనుసంధానంతోనే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటినుంచి రేషన్ కార్డులు ఉన్నా సరుకులు అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా 8.14 లక్షల తెలుపు రేషన్ కార్డులు జిల్లాలో జన్మభూమి రేషన్‌కార్డులతో కలిపి ప్రస్తుతం 8,14,406 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోదుమలు, గోదుమ పిండి పౌరసరఫరాల దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సైతం సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆహారభద్రత చట్టం అమలు పేరుతో కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేసేవారు. తాజాగా ఈ-పాస్ విధానంతో ఈ చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఈ-పాస్ విధానం అమలులో మొదట్లో ఎదురైన సమస్యలనుంచి గట్టెక్కిస్తామన్న ప్రభుత్వం కొత్తగా మరికొన్ని వేలిముద్ర మెషిన్లను సరఫరా చేసింది. వాటిని కొత్తసర్వరుకు అనుసంధానం చేసినా పాతపరిస్థితే కొనసాగుతోంది. -
గల్ఫ్‌లో మనవాళ్ల గోస
అంతర్యుద్ధంతో కష్టాల్లో కార్మికులు వెనక్కు పంపేందుకు అంగీకరించని యాజమాన్యాలు మోర్తాడ్: సౌదీ అరేబియా, యెమెన్ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధ ప్రభావం తెలంగాణ కార్మికులపైనా పడుతోంది. సౌదీ సరిహద్దు పట్టణంలో పని చేస్తున్న ఈ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సౌదీ బల్దియూలో, పలు కంపెనీల్లో పని చేసేందుకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది కార్మికులు వలస వెళ్లారు. ఇందులో అత్యధికంగా యెమెన్ దేశానికి అనుకుని ఉన్న సౌదీ సరిహద్దులోని నజరేన్ పట్టణంలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య బాంబులు, తుపాకుల దాడి కొనసాగుతుండడంతో తెలంగాణ కార్మికులు అక్కడ పని చేయూలంటే భయపడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన తమలో నెలకొందని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రమేష్ అనే కార్మికుడు ‘సాక్షి’తో వాపోయాడు. కాగా, సౌదీలో పని చేస్తున్న వలస కార్మికుల పాస్‌పోర్టులు ఆయా కంపెనీల యాజమాన్యాలు స్వాధీనం చేసుకోవడంతో వారు తమ ప్రాంతాలకు రాలేకపోతున్నారు. బాంబుల దాడుల మధ్య ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తే యాజమాన్యాలు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని రమేష్ చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం, విదేశాంగ శాఖ తమను స్వరాష్ట్రానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
నో మెడిసిన్ గ్యాస్ గాన్..!
కొందరికి పొడుపు కథలు ఎంతగా చెప్పినా అర్థం కావు. కానీ... సాధారణంగా మనలో 40 ఏళ్లు దాటిన ప్రతివారికీ ఓ పొడుపు కథ వెంటనే అర్థమవుతుంది. అదేమిటో ఓసారి చెప్పుకుందాం. కాళ్లు లేకపోయినా పొట్టలోంచి పైకి తన్నేదేమిటి? గాలి లాంటి తేలిక పేరున్నా గుండెల మీద బరువు పెట్టినట్లుగా ఉండేదేమిటి? కేవలం ఈ రెండు ప్రశ్నలతోనే సమాధానం వచ్చేస్తుంది. ఆ జవాబే ‘గ్యాస్ ట్రబుల్’ అని. పేరులోనే ట్రబుల్ ఉన్నా... మందులేవీ వాడకుండానే గ్యాస్ వల్ల ట్రబుల్ లేకుండా చూసుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మనం ఆహారం తీసుకోగానే అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. కొందరిలో ఆ ఆసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేకపోతే మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. ఆసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. అప్పుడది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంటే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దాంతోపాటూ గ్యాస్ తాలూకు పొగలు (ఫ్యూమ్స్) పెకైగసినప్పుడు దాని ప్రభావం గొంతులోనూ తెలుస్తుంది. కొన్నిసార్లు ఆసిడ్ గొంతులోకి కూడా ప్రవేశించి, చేదుగా అనిపిస్తుంది. దీన్నే ‘వెట్ బర్ప్’ అని కూడా అంటారు. అప్పుడు గొంతు మంటగా అనిపించడం సహజం. హార్ట్‌బర్న్ అనుకోవడమూ సహజమే! మనం తిన్న ఆహారం ఈ ఈసోఫేగస్‌లోకి వెళ్లగానే అక్కడ దానిపై ఆసిడ్ ప్రభావం మొదలవుతుంది. ఈసోఫేగస్ దాదాపు గుండె ఉన్న ప్రాంతంలోనే ఉండటంతో ఈ ఛాతీలో మంటను ఒక్కోసారి గుండెమంటగా కూడా పొరబడి ‘గుండెపోటు’గా అపోహపడుతుంటారు. అందుకే దీన్ని ‘హార్ట్‌బర్న్’ అనుకోవడం కూడా సాధారణమే. అయితే మరికొన్ని పరిస్థితుల్లో గుండెకు సంబంధించిన నొప్పి వచ్చినా, దాన్ని ‘ఛాతీలో నొప్పి’ లేదా గ్యాస్ట్రబుల్ అనుకొని పొరబడ్డ సంఘటనలూ ఉన్నాయి. అందుకే గ్యాస్ట్రబుల్ను తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కారణాలు : గ్యాస్ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని... కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం తిన్నవెంటనే పడుకోవడం ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం పీచు తక్కువగా ఉన్న ఆహాపపదార్థాలు తీసుకోవడంతో ఆసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆహారనాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నార్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘జీఈ జంక్షన్’ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా ‘జీఈ జంక్షన్’ అనే మూతలాంటి నిర్మాణం అడ్డుపడుతుంది. అయితే కొన్నిసందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావడం, దాంతోపాటు గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ‘జీఈ జంక్షన్’ సరిగా పనిచేయడానికి ఎన్నో అంశాలు దోహదం చేయాలి. ఉదాహరణకు... కడుపు కండరాలు మృదువుగా ఉండటం, అక్కడ స్రవించాల్సిన రకరకాల హార్మోన్లు సక్రమంగా స్రవించడం వంటివి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత జీఈ జంక్షన్ అనే ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల మందులు, నరాల నుంచి ఆదేశాలు కూడా ఈ ‘జీఈ జంక్షన్’ అనే నిర్మాణం బలహీన పడటానికి దోహదం చేస్తుంటాయి. అప్పుడూ ఆహారంతో పాటు ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. చికిత్స : దీనికి నివరణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. గ్యాస్ సమస్య నివారణ ఇలా... చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవడం పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం. రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ అయిన లెస్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. ఆసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ. మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఇంట్లోనే వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. -
అయ్యయ్యో... కాలు జారె..!
ఫ్యాషన్ కోసం వేసుకునే కొన్ని దుస్తులు ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. బిగుతు దుస్తులతో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఇటీవల ఈ తరహా ఫ్యాషన్ డ్రెస్‌తో పాప్ స్టార్ మడొన్నా తెగ ఇబ్బందిపడిపోయారు. లండన్‌లో జరిగిన బ్రిట్ అవార్డ్స్ వేడుకలో ‘లివింగ్ ఫర్ లవ్..’ అనే పాటకు నర్తించారామె. చుట్టూ నృత్య కళకారులు, మధ్యలో మడొన్నాతో డాన్స్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో మడొన్నా వేసుకున్న డ్రెస్ ఆమె కాలుకి చిక్కుకుంది. దాంతో కిందపడిపోయారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు.. అంటూ ఒక్కో మెట్టు మీద నుంచి జర్రున జారారు ఈ పాప్ సుందరి. దాంతో వీక్షకులు కంగారుపడిపోయారు. కానీ, మడొన్నా కూల్‌గా లేచి నిలబడి, డాన్స్ చేశారు. షో పూర్తయిన తర్వాత ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వెళ్లగక్కారు. ‘‘నా అందమైన డ్రెస్ నన్ను ఇబ్బందిపెట్టేసింది. ఆ డ్రెస్‌ను మెడకు టైట్‌గా కట్టడం సమస్య అయ్యింది. పొడవాటి గౌను కాబట్టి, కాలుకు చిక్కుకుంది. ఘోరంగా పడ్డాను. అయినా, డోంట్ కేర్. నా ఆటను ఏదీ ఆపలేదు’’ అని మడొన్నా పేర్కొన్నారు. -
అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టొద్దు
గూడూరు టౌన్ : సొసైటీలకు చేరిన యూరియాను రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం తగదని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని రైతులు, అన్ని మండలాల ఏఓలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదాముల్లో ఉన్న యూరియాను కొంత మంది బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, మరికొంత మంది వారికి కావాల్సిన వారికి ఇచ్చుకోవడం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి పక్షపాతం తగదన్నారు. అనంతరం మండలాల వారీగా రైతులు ఎన్ని హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు, యూరియా అవసరం ఎంత.. ఎంత అందుబాటులో ఉంది తదితర విషయాలపై మండలాల వారీగా ఏఓలను అడిగి తెలుసుకున్నారు. వాకాడు మండలంలో సొసైటీ అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే యూరియా ఇస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వారు చెప్పిన వారికే యూరియా ఇస్తే మిగిలిన రైతులు ఏమై పోవాలని ప్రశ్నించారు. కోట మండలంలో మార్కెట్లో యూరియాను కొనుగోలు చేసుకోవాలని అధికారులే చెప్పడం ఏమిటన్నారు. గూడూరులో సొసైటీ కార్యాలయం ఒక్కటే ఉందని, రూరల్ ప్రాంతంతో పాటు పట్టణంలో కూడా రైతులు అధికంగా ఉన్నారని వారందరికి సరిపోయేలా యూరియా తెప్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏఓలు అందజేసిన వివరాలను పరిశీలించి యూరియా కోసం జిల్లా వ్యవసాయశాఖ జేడీతో మాట్లాడి తెప్పిస్తామని, అవసరమైతే మంత్రితో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ, గూడూరు, నాయుడుపేట వ్యవసాయాధికారులు శివనాయక్, నర్సోజీరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి ప్రభుత్వ భూములను పరిరక్షిచాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు వాటిని కాపాడాలన్నారు. గ్రామాల్లో ఇంటి, కుళాయి పన్నులను వసూలు చేసి ప్రతి రోజు ఆ విషయాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. గ్రామాల్లో పన్నులు వసూళ్లు కాకపోవడంతో విద్యుత్ బిల్లులను 13వ ఆర్థిక సంఘం నిధులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయ నాయకులు చెప్పారని వసూళ్లు ఆపితే ఇబ్బందులు పడేది ఉద్యోగులేనని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న లే అవుట్లను గుర్తించడంతో పాటు ఏర్పాటు చేసి ఉన్న లే అవుట్ల్లో ప్రజల కోసం వదిలిన స్థలాలను గుర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ప్రొటోకాల్‌ను పాటించాలని సూచించారు. ఇటీవల జెడ్పీ సీఈఓ ఐదుగురు పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్ చేశారని, నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే ఉద్యోగులు ఇబ్బందులు పడతారన్నారు. పనుల కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలుంటే ఉన్నతాధికారులకు చెప్పాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నారాయణ ఉన్నారు. -
టీడీపీలో వణుకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ఒకవైపు రెబల్స్ గుబులు పుట్టిస్తుండగా.. మరొకవైపు టికెట్లు రాని నేతలు పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని వణికిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులతో టీడీపీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతోంది. మరో మూడు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లిసత్యనారాయణమూర్తి (బాబ్జి) తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన విషయం విదితమే. తాను ఎట్టి పరిస్థితుల్లోను నామినేషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై పోటీలోనే ఉండాలని నిర్ణయించారు. ఆయనను వెన్నంటి ఉన్న నాయకులు, శ్రేణులు అవసరమైతే చందాలు వేసుకుని మరీ బాబ్జిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో అక్కడి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సీటు వచ్చిందనే ఆనందం కంటే సీనియర్ నేత బాబ్జి రంగంలో ఉండటం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రామానాయుడు పరిస్థితి బాబ్జి తిరుగుబాటుతో మరింత దిగజారింది. రాష్ట్ర నేతలు మాట్లాడినా బాబ్జి పోటీనుంచి విరమించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు. ఆయన కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి జవహర్‌కు కంటిమీద కునుకులేకుండా చేయడంతోపాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ ఓటమే తన ధ్యేయమని ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబును గౌరవిస్తానని చెబుతూనే పార్టీ అభ్యర్థులను ఓడిస్తానని స్పష్టం చేస్తున్నారు. చింతలపూడిలో ఆ పార్టీ నేత రాయల రాజారావు భార్య సుమలతను రెబల్‌గా పోటీ చేస్తూ టీడీపీని దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలే నాన్‌లోకల్ ఇబ్బందులతో సతమతమవుతూ ఏంచేయాలో తెలియక దిక్కులు చూస్తున్న ఆ పార్టీ అభ్యర్థి పీతల సుజాత రాజారావు తీరుతో మరింత బెంబేలెత్తుతున్నారు. తాడేపల్లిగూడెం సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వదిలేశారనే కోపంతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలి టీడీపీకి ఇరకాటంగా మారింది. పోటీనుంచి విరమిస్తానని కాసేపు, వెనకడుగు వేసేది లేదని కాసేపు ఆయన చెబుతుండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో వలస నేతలైన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), పితాని సత్యనారాయణకు టికెట్లు ఇవ్వడంతో ఇన్నాళ్లూ పార్టీని మోసినవారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. భీమవరంలో మెంటే పార్థసారథి వర్గానికి సర్ధిచెప్పడం ఎవరి తరమూ కావడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఎన్నివిధాలుగా సారథి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో మిన్నకుండిపోయారు. అంజిబాబుపై అన్ని వైపులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటివ్వడంతో ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత గుబ్బల తమ్మయ్య ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ నేతలు పితానికి సహకరించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో పితాని సొంత నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోనూ కీలక నేతలు పార్టీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి ఒక్కసారిగా తిరోగమనంలో పడినట్లయింది. -
చిక్కుల్లో టీడీపీ నేత బాలకృష్ణ
-
వివాదంలో విజయ్ ‘కత్తి?’
నటుడు విజయ్ తాజా చిత్రం కత్తి వివాదాల సుడిగుండంలో చిక్కుకోనుందా? ప్రస్తుతం ఈ చిత్రం వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక తమిళుల ఇతివృత్తంతో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఇప్పటికే వివాదానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ చాయాగ్రాహకుడు సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఇనం చిత్రం తమిళుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. చివరికి ఆ చిత్ర విడుదలను నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సెగ చల్లారక ముందే మరోసారి మంట రాజుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ సారి ఏకంగా ఇళయ దళపతి విజయ్ చిత్రమే తమిళుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. విజయ్ తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి కత్తి టైటిల్ ప్రచారంలో ఉంది. సమంత హీరోయిన్. ఇంతకు ముందు విజయ్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన తుపాకీ ఘన విజయం సాధించడంతో తాజా చిత్రం కత్తిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. అసలు సమస్య ఇక్కేడ తలెత్తనున్నట్లు సమాచారం. విషయం ఏమిటంటే ఈ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ఇంతకు ముందు సన్నిహిత సంబంధాలున్నాయట. మరో విషయం ఏమిటంటే కత్తి చిత్ర పంపిణీ బాధ్యతల్ని పంచుకోవడానికి లైక్ ప్రొడక్షన్, యూకే బెస్ట్ అయింగరన్ సంస్థతో భాగస్వామ్యం పంచుకుందట. కత్తి చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుండడంతో అయిన్గరన్ సంస్థ సపోర్ట్‌ను తీసుకున్నట్లు చెబుతోంది. ఈ సంస్థకు కూడా రాజపక్సేకు చెందిన వివిధ దేశాలలో వ్యాపార లావాదేవీలున్నట్లు కొన్ని తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు తమిళ సంఘాలు వేచి చూస్తున్నాయి. విజయ్ నటించిన గత చిత్రం తలైవా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకతకు గురై సమస్యలను కొనితెచ్చుకుంది. ఎట్టకేలకు విడుదలైనా అపజయం పాలైంది. తాజా చిత్రం కత్తి విషయంలో అలాంటి వివదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. -
'దేశం' కోటకు బీటలు
అనంతపురం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉండేది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురం నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఆ జిల్లాపై ఎక్కవ ప్రభావం చూపింది. కానీ చంద్రబాబు జమానాలో టీడీపీ పట్టు క్రమంగా సడలడం మొదలైంది. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా పరిణామాల నేపథ్యంలో దేశం కంచుకోటకు బీటలు బారుతున్నాయి. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం.. వలస నాయకుల చేరిక.. టిక్కెట్ల వ్యవహారం.. అనంత టీడీపీలో ముసలం ఏర్పడింది. అనంతపురం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకుడు ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు వద్దంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులుకు సీటు కేటాయించడంపై రాయదుర్గం టీడీపీ ఇంచార్జి దీపక్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ప్రభాకర్ చౌదరి, దీపక్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నారు. రాయదుర్గం, అనంతపురం నియోజకవర్గాలు రెండూ వైసీపీకి బలమైన నియోజకవర్గాలు. ఉప ఎన్నికల్లో ఈ రెండు చోట్లా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. ఇటీవల టీడీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డిది మరో సంకట పరిస్థతి. (చదవండి: ఓడిపోయేదానికి నేనెందుకు పోటీ చేయాలి?) జేసీ రాకను జిల్లాకు చెందిన చాలామంది దేశం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీ సోదరులు ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారని, హంతకులంటూ గతంలో విమర్శించారు. చంద్రబాబు, దివాకర్ రెడ్డి ఒకర్నొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అయితే దివాకర్ రెడ్డి ఇటీవల సైకిలెక్కేశారు. చంద్రబాబు జేసీని తన పంచన చేర్చుకున్నా కార్యకర్తలు మద్దతిస్తారా అన్నది సందేహమే. దీనికి తోడు అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని తెలుసుకున్న జేసీ రగిలిపోతున్నారు. ‘బీజేపీ వాళ్లకు కదిరి ఇమ్మని చెబితే అనంతపురం ఇస్తారా? పార్లమెంటుకు నేనెట్లా గెలవాలి? ఓడిపోయే దానికి నేనెందుకు పోటీచేయాలి' అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతపురం జిల్లాలో తాజా పరిణామాలు తెలుగుదేశంకు ప్రతికూలంగా మారాయి.