ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ టిక్కెట్ కేటాయింపుపై నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) మల్లగులల్లాలు పడుతోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ ఎన్‌డీఏలో చేరుతుందనే చర్చల నడుమ మధుర లోక్‌సభ సీటు కేటాయింపుపై ఆసక్తికర చర్చ ప్రారంభమయ్యింది.
తాజాగా మధుర ఎంపీ హేమ మాలిని తాను మథుర నుండి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరి ‘ఇండియా’ కూటమిని వీడి ఎన్‌డిఎలో చేరుతారనే చర్చ ప్రారంభమైనప్పటి నుండి, బీజేపీ- ఆర్‌ఎల్‌డీ మధ్య సీట్ల కేటాయింపుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మధుర సీటు జయంత్ చౌదరి పార్టీకి దక్కవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.
జయంత్ చౌదరి 2009లో తొలిసారిగా మధుర నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి హేమమాలిని ఈ స్థానం నుంచి గెలుపొందారు. కాగా తాజాగా మధుర వచ్చిన హేమమాలిని ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నేతల మధ్య కూర్చుని విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పార్టీ ఆదేశిస్తే మథుర నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment