ఉత్తరాఖాండ్‌లో ట్రాఫిక్‌ ఇక్కట్లు | Uttarakhand Roads Blocked With Heavy Traffic | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖాండ్‌లో ట్రాఫిక్‌ ఇక్కట్లు

Jun 12 2019 9:18 PM | Updated on Jun 12 2019 9:19 PM

Uttarakhand Roads Blocked With Heavy Traffic - Sakshi

డెహ్రాడూన్‌: దేశంలో అధికంగా హిల్‌ స్టేషన్లు ఉండి వేసవి కాలంలో నిత్యం సందర్శకులతో కళకళలాడే సందర్శన ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరఖండ్‌. భారీ సంఖ్యలో వస్తున్న సందర్శకులతో రోడ్లు కిక్కిరిసిపోతూ గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీంతో హరిద్వార్‌ నుంచి చార్‌ధామ్‌ వెళ్లాలంటే సమయం రెండితలు అవుతోంది. బద్రీనాథ్‌ నుంచి హరిద్వార్‌ చేరుకోవాలంటే సుమారు 18 గంటల సమయం పడుతోందని ట్రాఫిక్‌ నియంత్రణ అధికారి తెలిపారు.

80 వేల పైగా మంది తమ వాహనాలలో ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారని హరిద్వార్‌ ఎస్‌ఎస్‌పీ జన్మేజయ్‌ కందూరి తెలిపారు. అదనపు అధికార బలగాలు ట్రాఫిక్‌ని తగ్గించే చర్యలు తీసుకున్నా భారీ సంఖ్యలో సందర్శకుల ప్రయాణించడం వల్ల నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రిషికేశ్‌‌, ముస్సోరి, డెహ్రాడూన్‌, రుద్రప్రయాగ్‌, గంగోత్రి, యమునోత్రి, నైనిటాల్‌ ప్రాంతాల్లో కూడా యాత్రికులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రిషీకేశ్‌ రోడ్లను విస్తరించే క్రమంలో వెలువడ్డ శిథిలాలు వల్ల అధికంగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని జస్మిత్‌ బ్లాక్‌ ప్రముఖ్‌ ప్రకాశ్‌ రావత్‌ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయపడాలంటే వెంటనే రోడ్ల మీద పేరుకుపోయిన శిథిలాలను తోలగించాలన్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలం లేకపోవడం, చిన్న వాహనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం ట్రాఫిక్‌ స్తంభనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement