అయ్యయ్యో... కాలు జారె..! | oh ! leg was slipped | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో... కాలు జారె..!

Feb 27 2015 10:42 PM | Updated on Oct 1 2018 1:12 PM

అయ్యయ్యో... కాలు జారె..! - Sakshi

అయ్యయ్యో... కాలు జారె..!

ఫ్యాషన్ కోసం వేసుకునే కొన్ని దుస్తులు ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. బిగుతు దుస్తులతో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ.

ఫ్యాషన్ కోసం వేసుకునే కొన్ని దుస్తులు ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. బిగుతు దుస్తులతో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఇటీవల ఈ తరహా ఫ్యాషన్ డ్రెస్‌తో పాప్ స్టార్ మడొన్నా తెగ ఇబ్బందిపడిపోయారు. లండన్‌లో జరిగిన బ్రిట్ అవార్డ్స్ వేడుకలో ‘లివింగ్ ఫర్ లవ్..’ అనే పాటకు నర్తించారామె. చుట్టూ నృత్య కళకారులు, మధ్యలో మడొన్నాతో డాన్స్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో మడొన్నా వేసుకున్న డ్రెస్ ఆమె కాలుకి చిక్కుకుంది.

దాంతో కిందపడిపోయారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు..  అంటూ ఒక్కో మెట్టు మీద నుంచి జర్రున జారారు ఈ పాప్ సుందరి. దాంతో వీక్షకులు కంగారుపడిపోయారు. కానీ, మడొన్నా కూల్‌గా లేచి నిలబడి, డాన్స్ చేశారు. షో పూర్తయిన తర్వాత ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వెళ్లగక్కారు. ‘‘నా అందమైన డ్రెస్ నన్ను ఇబ్బందిపెట్టేసింది. ఆ డ్రెస్‌ను మెడకు టైట్‌గా కట్టడం సమస్య అయ్యింది. పొడవాటి గౌను కాబట్టి, కాలుకు చిక్కుకుంది. ఘోరంగా పడ్డాను. అయినా, డోంట్ కేర్. నా ఆటను ఏదీ ఆపలేదు’’ అని మడొన్నా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement