madonna
-
వికీపీడియా హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!
ప్రముఖ వెబ్సైట్ వికీపీడియా సోమవారం రోజున హ్యాకింగ్‌కు గురైనట్లు వార్తలు వస్తోన్నాయి. డజన్ల కొద్దీ వికీపీడియా పేజీలు సోమవారం ఉదయం స్వస్తిక్(జర్మన్ నాజీ పార్టీ జెండా) చిత్రాలతో తాత్కాలికంగా భర్తీ చేయబడినట్లు తెలుస్తోంది. వికీపీడియా పేజీలను ఒపెన్ చేస్తుంటే జర్మన్ నాజీ పార్టీ జెండాలు కన్పించాయని యూజర్లు తెలిపారు. చాలా మేరకు ప్రముఖుల వికీపీడియా పేజీలు హ్యాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) హ్యాకింగ్‌కు గురైన వికీపీడియా పేజీల్లో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, సింగర్స్ ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్, మడోన్నా వికీపీడియా పేజీల్లో ఎరుపు వర్ణంలోని జర్మన్ నాజీ పార్టీ జెండా స్వస్తిక్ గుర్తు కన్పించిందని కొత్త మంది యూజర్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతేకాకండా జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో, జోసెఫ్ స్టాలిన్ పేజీలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వికీపీడియాను ఎలాంటి లాభాపేక్షలేకుండా వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా హ్యాకింగ్‌పై వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..ప్రముఖ స్టార్స్, సింగర్స్ వికీపీడియా పేజీల్లో కొద్ది క్షణాలపాటు జర్మన్ నాజీ పార్టీ జెండా కన్పించినట్లు నిర్థారించారు. కాగా వికీపీడియా వెబ్సైట్లపై జరిగిన హ్యాకింగ్‌ను వీకీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు కేవలం ఐదు నిమిషాల్లో తిప్పికొట్టిన్నట్లు వెల్లడించారు. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) Has Wikipedia been hacked? I'm opening new tabs and they're coming up with swastikas / Nazi flags??? pic.twitter.com/i0498octaZ — Ben Travis (@BenSTravis) August 16, 2021 -
62వ ఏట 26 ఏళ్ల లవర్‌తో సింగర్ షికార్లు
ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పాటు వయసుతో కూడా సంబంధం లేదు. జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ కలగవచ్చు.. లవ్‌లో పడొచ్చు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే.. ప్రముఖ పాప్ సింగర్ ఒకరు లేటు వయసులో తాజాగా మరో సారి ప్రేమలో పడ్డారు. విశేషం ఏంటంటే వయసులో తన కన్నా దాదాపు 36 ఏళ్లు చిన్న వాడైన యువకుడితో పీకల్లోతు ప్రేమలో పడ్డారు సదరు సింగర్. ఇంతకు ఎవరా పాప్ సింగర్.. ఆమె లవ్ స్టోరి విశేషాలు తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్. పాటతో పాటు తిరుగులేని అందం మడోన్నా సొంతం. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తన మనసుకు నచ్చినట్లు జీవిస్తుంటారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తారు. తాజాగా ఇలాంటి ప్రకటనే చేశారు మడోన్నా. 62 ఏళ్ల వయసులో తాను మరోసారి ప్రేమలో పడ్డానని వెల్లడించారు. అవును మీరు చదివింది నిజమే.. 62వ ఏట ఈ పాప్ దివ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. అది కూడా తన కంటే 36ఏళ్ల చిన్నవాడితో. వాలంటైన్స్ డే సందర్భంగా లవర్ అహ్లమాలిక్ విలియమ్స్(26)తో కలిసి ప్రపంచాన్ని చుట్టేశారట. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా మడోన్నానే ప్రకటించారు. ‘‘ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నా వాలైంటన్తో కలిసి ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వచ్చాను. ఎంతో అద్భుతమైన జర్నీ. హ్యాపీ వాలైంటన్స్ డే విలియమ్స్ అహ్లమాలిక్’’ అంటూ ప్రియుడితో కలిసి ఉన్న రెండు ఫోటోలని షేర్ చేశారు మడోన్నా. ప్రస్తుతం వీరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ చెప్పేవారు కొందరైతే.. పించన్ వచ్చే ఏజ్‌లో నీకు బాయ్‌ఫ్రెండ్ అవసరమా అంటూ విమర్శిస్తున్న వారు ఎందరో. View this post on Instagram A post shared by Madonna (@madonna) ఇక మడోన్నా-విలియమ్స్‌ల లవ్ స్టోరి విషయానికి వస్తే.. ఇతడు బ్యాకప్ డ్యాన్సర్‌గా పని చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం వీరద్దరికి పరిచయం ఏర్పడింది. మడోన్నా ఇచ్చిన రెండు ప్రదర్శనల్లో విలియమ్స్ డాన్సర్‌గా పని చేశాడు. అలా మొదలైన వీరి పరిచయం.. ప్రస్తుతం ప్రేమగా మారింది. ఓ ఏడాది నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మడోన్నా తాను మరో సారి ప్రేమలో పడినట్లు వెల్లడించారు. మడోన్నా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను చాలా మంచి వాడు. నా ఆరుగురు పిల్లలతో చాలా బాగా కలిసిపోయాడు. ముఖ్యంగా నా పెద్ద కుమార్తెకు అతను చాలా మంచి స్నేహితుడు’’ అంటూ చెప్పుకొచ్చారు. విశేషం ఏంటంటే మడోన్నా పెద్ద కుమార్తె.. విలియమ్స్ కన్నా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నది. ఇక విలియమ్స్ తల్లిదండ్రులు ఇద్దరు మడోన్నా కన్నా చిన్నవారు కావడం గమనార్హం. విలియమ్స్ తండ్రికి 59, తల్లికి 55 సంవత్సరాలు. వీరిద్దరి కన్నా మడోన్నా పెద్దది. చదవండి: కొత్త ప్రపంచం కోసం ఈ సెలబ్రిటీలు నా కథ నేనే చెబుతా -
మారడోనా మృతి.. ట్రెండింగ్‌లో రిప్ మడోన్నా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా) : ప్రపంచ పుల్‌బాల్ దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా మృతి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. సాకర్ స్టార్ ప్లేయర్ ఇక లేరనే వార్త పుట్‌బాల్ ప్రియులను శోకసంద్రంలో ముంచింది. కేవలం ఆటలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న మారడోనా ఇకలేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్‌బాల్ మాంత్రికుడి మరణవార్త ప్రపంచ క్రీడా లోకాన్ని కన్నీటిసంద్రంలో ముంచింది. తమ ఆరాధ్య ఆటగాడి కోసం యావత్ అర్జెంటీనా విలపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డీగో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. రిప్ మారడోనా అంటూ సాకర్ దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికారు. అయితే కొంత అభిమానులు చేసిన తప్పిదం హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు మారడోనాకు బదులుగా రిప్ మడోన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. (గుడ్‌బై మారడోనా) చనిపోయింది మారడోనానా లేక మడోన్నా అన్న విషయంపై క్లారిటీ లేకుండా ఏకంగా రిప్ మడొన్నా అంటూ ట్వీట్ చేయడం ఆరంభించారు. ఇది చూసిన కొంతమంది షాక్అవ్వగా.. మరికొంత మంది అభిమానులు మాత్రం నిజంగానే ఆమె మరణించిందని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ అభిమాన సింగర్ మృతిని జీర్ణించుకోలేపోతున్నామని విలపించారు. ఆమె పాటలు, వీడియోలో షేర్ చేస్తూ నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘రిప్ మడోన్నా’ అనే ట్వీట్కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. RIP Madonna, you'll be forever in our hearts. Legend. pic.twitter.com/EnMrIUZhRs — icah (@poemtoahoe) November 25, 2020 Rip Madonna gone too soon 😭😭 pic.twitter.com/KMxziKA82y — Trap House (@SugarDaada) November 25, 2020 -
నా కథ నేనే చెబుతా
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్ అండ్ విస్డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె. -
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్
పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు. ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) View this post on Instagram 8 years ago. I was fined 1 million dollars by The government for supporting the Gay community. I never paid.................... #freedomofspeech #powertothepeople #mdna A post shared by Madonna (@madonna) on Jul 19, 2020 at 7:42pm PDT -
కొత్త ప్రపంచం కోసం ఈ సెలబ్రిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌పై విజయం సాధించాక ప్రపంచవ్యాప్తంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి వీల్లేదంటూ 200 మంది ప్రముఖులతో ఏర్పడిన క్లబ్లో తాజాగా ఒకప్పుడు తన గానామృతంతోనే కాకుండా అందచందాలతో కుర్రకారును కైపెక్కించిన మడోనా, తన హావ భావాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన అమెరికా నటుడు, నిర్మాత రాబర్ట్ డి నీరో చేరారు. ఈ క్లబ్లో హాలీవుడ్ తారలు కేట్ బ్లాన్‌చెట్, జేన్ ఫాండా, మారియన్ కోటిలార్డ్, మోనికా బెల్లూసితోపాటు పలువురు నోబెల్ అవార్డు గ్రహీతలు ఉన్నారు. హాలీవుడ్ తార జూలియెట్ బినోచ్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అవురేలియన్ బర్రావ్‌లు ఈ క్లబ్ ఏర్పాటుకు నాంది పలికారు. (చదవండి : కరోనా: డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం ఎక్కడ!?) వీరంతా ఇప్పుడు ఎప్పటిలాంటి సాధారణ ప్రపంచాన్ని కాకుండా సరికొత్త ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. అందుకు ఇదే సరైన అవకాశమని వారు చెబుతున్నారు. ‘కరోనా వైరస్ వచ్చిందేదో వచ్చింది. అది ఎంతటి దురదష్టకరమైన అది ప్రపంచంలో ఎంతో మార్పునకు అవకాశం ఇస్తోంది’ అని వీరంతా వాదిస్తున్నారు. వస్తు వినిమయంపై ఆధారపడి పనిచేసే ఆర్థిక వ్యవస్థ ఇంకెంత మాత్రం మనకు అక్కర్లేదని, భూగోళాన్ని పరిరక్షించే ర్యాడికల్ ఆర్థిక వ్యవస్థ కావాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : ట్రంప్ అంతే..మాస్క్ ఫ్యాక్టరీలో మాస్క్ లేకుండా..) నేడు ప్రపంచ పర్యావరణ పరిస్థితులు బాగా క్షీణించాయని, వీటి వల్ల కరోనా వైరస్‌లకన్నా తీవ్రమైన పర్యవసనాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని వీరు హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే మొత్తం మానవజాతియే అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగోళంపై కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణ సమతౌల్యత నశించి మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు వీరంత సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. -
కరోనాకి అంత సీన్ లేదు!
పాప్ గాయని మడోన్నాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి ఉందట. అందుకే కరోనా నన్ను ఏమీ చేయలేదు.. నా విషయంలో కరోనాకి అంత సీన్ లేదంటున్నారామె. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను ‘‘క్వారంటైన్ డైరీ’’ పేరుతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంటున్నారామె. ఇటీవలే కరోనా గురించి ఓ అప్ డేట్‌ను తన అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ‘‘ఈ మధ్యే కరోనాకి సంబంధించిన టెస్ట్ చేయించుకున్నాను. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. రేపు ఉదయమే కారు తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లబోతున్నాను. దారిలో కారు అద్దాలు దించి కోవిడ్ గాలి కూడా పీలుస్తాను. అందర్నీ ఇలా చేయమని చెప్పను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి’’ అని పేర్కొన్నారు మడోన్నా. -
మడోన్నా అరుదైన చిత్రం షేర్ చేసింది
లాస్ ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ మడోన్నా తాను దత్తత తీసుకున్న నలుగురు పిల్లల ఫొటోలను షేర్ చేసింది. వీరిలో ఇటీవలె దత్తత తీసుకున్న ఎనిమిదేళ్ల కవల బాలికలు కూడా ఉన్నారు. వీరిని మలావి నుంచి దత్తత తీసుకుంది. ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ ఫొటోను షేర్ చేసుకున్న 68 ఏళ్ల ఈ మ్యూజిక్ ఐకాన్ తామంతా పైజామా పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నామంటూ ట్యాగ్‌లైన్ పెట్టింది. తమ ఇంట అసలైన సంతోషం నేడే వెల్లి విరుస్తోందంటూ రాసుకొచ్చింది. మడోన్నా మొత్తం నలుగురు పిల్లలను దత్తత తీసుకుంది. వీరిని ఇప్పటి వరకు సరిగా మీడియాకు చూపించని ఆమె తొలిసారి పంచుకున్నారు. వారి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందనే ఆమె ఇన్ని రోజులపాటు వారి వివరాలను తెలియనివ్వడం లేదని చెబుతున్నారు. మడోన్నాకు ఇద్దరు కన్నబిడ్డలు ఉన్నారు. లార్డెస్(19) అనే కూతురుతోపాటు రాకో(15) అనే కుమారుడు ఉన్నాడు. వీరితోపాటు స్టెల్లా, వాలే, డేవిడ్ బాందా, మెర్సీ అనే నలుగురు దత్తత పిల్లలు అదనం. -
మహిళలు వాళ్లకే అండగా ఉంటారు కానీ..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి పాప్ స్టార్ మడోన్నాను ఆవేదనకు గురిచేసింది. ఎన్నికల్లో హిల్లరీ తరఫున ప్రచారం చేసిన మడోన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. హిల్లరీ ఓటమికి మహిళలే కారణమని నిందించింది. మహిళలు మహిళలను ద్వేషిస్తారని మడోన్నా వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షురాలిగా ఓ మహిళను అంగీకరించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహిళలను పలు సందర్భాల్లో కించపరిచేలా మాట్లాడిన, అసభ్యంగా ప్రవర్తించిన ట్రంప్‌కు ఎక్కువ మంది మహిళలు మద్దతు పలికారని మడోన్నా ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళలకు మద్దతుగా ఉండకపోవడం మహిళల స్వభావమని, ఇది చాలా బాధకరమని అంది. మగవాళ్లు అందరినీ సంరక్షిస్తారని, మహిళలు మాత్రం వారి భాగస్వామి, పిల్లలకు అండగా ఉంటారని చెప్పింది. -
‘చాలా సంతోషం.. ఆమెతో లేను’
లండన్: ప్రముఖ పాప్ సింగర్ మడోన్నాకు కొడుకు రొక్కో రిట్చీ పెద్ద తలనొప్పిగా మారాడు. మడోన్నా నుంచి దూరంగా తండ్రితో కలిసి ఉంటున్న రొక్కో.. తల్లిపై విమర్శలు చేయడం మాత్రం మానడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని అపహాస్యం చేసేలా ఓ వీడియోను రొక్కో ఇటీవల పోస్ట్ చేశాడు. మడోన్నా తింటున్న సమయంలో సగం ఫుడ్ నోటి బయట ఉన్నట్లుగా ఉన్న అభ్యంతరకర దృశ్యాన్ని తన ఇన్‌స్టాగ్రాంలో ఉంచాడు. ఆ విడియోకు ‘సో గ్లాడ్.. ఆమెతో ఉండట్లేదు’ అనే వ్యాఖ్యలను జత చేశాడు. దీనిపై మడోన్నా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుపడటంతో అతడు వెంటనే ఆ వీడియోను తొలగించాడు. రొక్కో గతవారం డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
నకిలీ పోలీసు కారుతో పాప్‌సింగర్ బురిడీ!
లండన్: ఎదురుగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. తప్పించుకొని ముందుకెళ్లడానికి మార్గం లేదు. ఈ క్రమంలో ఓ పాప్ సింగర్ పోలీసులను, సాటి వాహనదారులను బోల్తా కొట్టించింది. నకిలీ పోలీసు కారులో ట్రాఫిక్ మధ్య నుంచి దూసుకుపోయింది. ఆమె వాహనంపై బుగ్గలో ఎరుపు, నీలిరంగు వెలుగులు రావడంతో అది పోలీసు కారును భావించి.. సాటి వాహనదారులు దారి ఇచ్చారు. ఈ దుస్సాహసానికి తెగబడింది ప్రముఖ పాప్ సింగర్ మడోన్నానే! ఆమె మంగళవారం, బుధవారం లండన్ లోని ఓ2 ఏరెనాలో ప్రాంతంలో ప్రయాణించింది. ఆమె తన నలుపు రంగు జగ్వార్ కారులో పోలీసుల మాదిరిగా ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్లతో ముందుకు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఫిమేల్ఫస్ట్.యూకే డాట్‌కామ్ తెలిపింది. 'ఓ2 ఏరెనా వద్ద నేను నిలబడి ఎదురుచూస్తూ ఉన్నాను. వాహనాలతో రోడ్లన్నీ దిగ్భంధనం అయ్యాయి. ఈ సమయంలో అకస్మాత్తుగా ఓ వాహనం ఫ్లాష్ లైట్లతో, భారీ చప్పుడు చేస్తూ దూసుకొచ్చింది. ఇది అండర్ కవర్ కాప్ వాహనం అయి ఉంటుందని భావించి అందరూ దారి వదిలారు. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. తీరా చూస్తే వాహనంలో పాప్ సింగర్ మడోన్నా ఉన్నారు.' అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. -
హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?
లాస్ ఏంజిల్స్: మహిళలపై జరుగుతున్న గృహహింసకు వ్యతిరేకంగా సెలబ్రెటీలు మిలీ సిరస్, మడోన్నాల ఫొటోలతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మిలీ సిరస్, మడోన్నాలు గృహహింసకు గురైనట్లు ప్రముఖ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త అలెగ్జాండ్రో పొలాంబో రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలలో.. మడోన్నా, సిరస్‌లు దారుణంగా హింసకు గురైనట్లు రూపొందించారు. ముఖంపై గాయాలతో కన్పిస్తున్న సెలెబ్రిటీల ఫొటోలు గృహహింసపై ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. గృహహింసపై మౌనం వీడాలని ఈ ఫొటోలపై ఉన్నటు కొటేషన్లు సైతం నెటిజన్లను ఆకట్టకుంటున్నాయి. ఓ సామాజిక సమస్యకు సెలబ్రెటీల టచ్ ఇచ్చి పొలాంబో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం చూపరులను ఆలోచింపజేస్తోంది. -
మరో ఆల్బమ్‌తో మడోన్నా ప్రపంచ టూర్..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ గాయని మడోన్నా తాను రూపొందించిన ఆల్బమ్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి ప్రారంభంకానున్న ఈ ప్రమోట్ కార్యక్రమం డిసెంబర్ వరకు ప్రపంచంలోని పలు దేశాల్లో జరగనుంది. ఈ కార్యక్రమాలకుకు నిర్మాతగా ఎప్పటిలాగే లివ్ నేషన్ గ్లోబల్ టూరింగ్ డివిజన్ వ్యవహరించనుంది. అధికారికంగా ఈ కంపెనీ త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొట్టమొదటి ప్రమోట్ షో మియామిలోని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎరేనాలో ఆగస్టు 29న ప్రారంభమై ఆతర్వాత వరుసగా అక్టోబర్ వరకు 25 నుంచి 30 షోలు కొనసాగనున్నాయి. అనంతరం యూరప్‌లో 20 నుంచి 25 షోలు ప్రదర్శన ఇవ్వనుంది. ఆ తర్వాత ఆసియా ఆస్ట్రేలియాలో కూడా మడోన్నా ప్రదర్శనలివ్వనున్నారు. ఆమె స్వయంగా రూపొందించిన ఈ ఆల్బమ్ పేరు 'రెబల్ హార్ట్'. ఇది మార్చి 10న విడుదల కానుంది. -
అయ్యయ్యో... కాలు జారె..!
ఫ్యాషన్ కోసం వేసుకునే కొన్ని దుస్తులు ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. బిగుతు దుస్తులతో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. ఇటీవల ఈ తరహా ఫ్యాషన్ డ్రెస్‌తో పాప్ స్టార్ మడొన్నా తెగ ఇబ్బందిపడిపోయారు. లండన్‌లో జరిగిన బ్రిట్ అవార్డ్స్ వేడుకలో ‘లివింగ్ ఫర్ లవ్..’ అనే పాటకు నర్తించారామె. చుట్టూ నృత్య కళకారులు, మధ్యలో మడొన్నాతో డాన్స్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో మడొన్నా వేసుకున్న డ్రెస్ ఆమె కాలుకి చిక్కుకుంది. దాంతో కిందపడిపోయారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు.. అంటూ ఒక్కో మెట్టు మీద నుంచి జర్రున జారారు ఈ పాప్ సుందరి. దాంతో వీక్షకులు కంగారుపడిపోయారు. కానీ, మడొన్నా కూల్‌గా లేచి నిలబడి, డాన్స్ చేశారు. షో పూర్తయిన తర్వాత ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వెళ్లగక్కారు. ‘‘నా అందమైన డ్రెస్ నన్ను ఇబ్బందిపెట్టేసింది. ఆ డ్రెస్‌ను మెడకు టైట్‌గా కట్టడం సమస్య అయ్యింది. పొడవాటి గౌను కాబట్టి, కాలుకు చిక్కుకుంది. ఘోరంగా పడ్డాను. అయినా, డోంట్ కేర్. నా ఆటను ఏదీ ఆపలేదు’’ అని మడొన్నా పేర్కొన్నారు. -
మడోనా మెరుపు!
ముద్దుగుమ్మ మడోనా మళ్లీ స్టేజీపై వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న జరగనున్న ‘బ్రిట్’ అవార్డుల ఫంక్షన్లో... పదివేల ఓల్టుల వెలుగుల్లో... ఈ సెక్సీ తార మెరుపులు మెరిపించేందుకు ముస్తాబవుతోంది. ఇరవై ఏళ్ల తరువాత మడోనా మళ్లీ ‘బ్రిట్’ వేదికపైకి వస్తోంది. స్పష్టంగా తెలియకపోయినా... తన ‘రెబల్ హార్ట్’ ఆల్బమ్‌లోని ట్రాక్నే మడోనా ప్రదర్శిస్తుందని సమాచారం. దీంతె ఇప్పటివరకు తన పార్టిసిపేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు ట్విట్టర్ ద్వారా మడోనానే ఫుల్స్టాప్ పెట్టింది. అవార్డుల బ్రోచర్తో పాటు తన చిత్రాన్నీ పెట్టి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మడోనా ఓ ఐకాన్ అని... యాభై ఆరేళ్లు వచ్చినా... ఆమెలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని బ్రిట్ చైర్మన్ మ్యాక్స్ లౌసాడా అంటున్నాడు. చూద్దాం... ఈ అమ్మడు ఏ స్థాయిలో మురిపిస్తుందో! -
కోట్లు కొల్లగొట్టిన మడోన్నా కాస్టూమ్స్
-
మడోనా వస్తువులు వేలానికి...!
హాలీవుడ్ స్టార్ మడోనా మరో నాలుగేళ్లలో 60వ పడిలోకి అడుగుపెడతారు. మామూలుగా అయితే వయసులో ఉన్న తారలతో పోల్చితే.. ఇలా వయసు పైబడిన తారలకు తక్కువమంది అభిమానులుంటారు. కానీ, మడోనా విషయంలో అలా కాదు. టీనేజ్ తారలకు కూడా లేనంత మంది అభిమానులు ఈ హాట్ లేడీకి ఉన్నారు. ఆ అభిమానులందరికీ ఓ శుభవార్త. మడోనా నటించిన పలు చిత్రాల్లోని చెప్పుకోదగ్గ దుస్తులు, నగలను వేలానికి పెట్టనున్నారు. అలాగే పాదరక్షలు, చలువ కళ్లద్దాలు, వ్యక్తిగతంగా ఆమె వాడిన సౌందర్య సాధనాలు, దుస్తులు... ఇలా మొత్తం 140 వస్తువులు వేలానికి రానున్నాయి. ఈ వేలం పాటను నిర్వహించనున్న జూలియన్స్ ఆక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మార్టిన్ నోలన్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల పాటు జూలియన్స్ ఆక్షన్స్లోను, ఆన్లైన్ ద్వారాను ఈ వేలం పాట జరగనుంది. మడోనాకి సంబంధించిన వస్తువులను వేలానికి పెట్టడం ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటివరకు చాలాసార్లు జరిగింది. కానీ, ఏకంగా 140 వస్తువులు వేలానికి రావడం ఇదే మొదటిసారి. దీని ద్వారా 30 కోట్ల రూపాయల రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నారు. నవంబర్ 7న ఈ వేలం పాట ఆరంభం కానుంది. -
కరాచీలో మడోన్నా బడి..
పాప్ రారాణి మడోన్నా పాటలు పాడటమే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఆమె పాకిస్థాన్‌లోని కరాచీ నగర శివార్లలో ఒక స్కూలు ప్రారంభించింది. ‘డ్రీమ్ మోడల్ స్ట్రీట్ స్కూల్’ పేరిట ఇటీవల ప్రారంభించిన ఈ స్కూలులో ఇప్పటికే దాదాపు1200 మంది విద్యార్థులు చేరినట్లు మడోన్నా తన ‘ట్విట్టర్’ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు వగైరా అధునాతన హంగులతో కూడిన ఈ స్కూల్ ఫొటోలను ఆమె ‘ట్విట్టర్’లో షేర్ చేసింది. కరాచీలో స్కూలు ప్రారంభించనున్నట్లు మడోన్నా ఏడాది కిందటే ప్రకటించింది. అన్నట్లుగానే స్కూలు తెరిచి, అమ్మాయిలకు విద్యావకాశాలు పెంపొందించేందుకు తనవంతు సాయం చేసింది. Girls learning at the Dream School #appreciation pic.twitter.com/bz6W07rfHn — Madonna (@Madonna) September 28, 2014 -
కూతురు కోసం మడోన్నా ప్రీ-ప్రోమ్ పార్టీ!
న్యూయార్క్: తన టీనేజ్ కూతురు లార్డెస్ కోసం 'ప్రీ-ప్రోమ్' పార్టీని పాప్ స్టార్ మడోన్నా ఇటీవల ఏర్పాటు చేశారు. అమెరికాలో హై స్కూల్ విద్య పూర్తయిన తర్వాత ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తారు. జూన్ 21 తేదిన న్యూయార్క్ సిటీలో ఏర్పాటు చేసిన గార్డెన్ పార్టీలో కూతురుతోపాటు స్నేహితులు పాల్గొన్నారు. ప్రీ ప్రోమ్ పార్టీ నిర్వహించాం. లార్డెస్ స్నేహితులు హాజరయ్యారు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. తన కూతురు కోసం ఏర్పాటు చేసిన విందు ఏర్పాట్లను మడొన్నా దగ్గరుండి చూసుకున్నారు. హైస్కూల్ విద్యను పూర్తి చేసుకున్న లార్డెస్... ఫిరెల్లో హెచ్. లాగార్డియా హైస్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసేందుకు సిద్దమయ్యారు. -
ఆ కారు నడిపిందెవరు?
తనది అనుకుని.. ఎవరిదో కారు చూడటమే కాదు.. తన వాడు కాని డ్రైవర్ మీద నోటికొచ్చినట్లు అరిచేసింది.. గాయని మడొన్నా. 55 ఏళ్ల ఈ పాప్ గాయనికి రోడ్డు మీద ఓ కారు కనపడింది. వెంటనే ఆమె డ్రైవర్ మీద విరుచుకుపడింది. ''ఏయ్, ఎవరు నువ్వు, నేను ఇక్కడున్నానని నీకు తెలీదా'' అంది. అయినా కూడా డ్రైవర్ ఆమెను గుర్తించకపోవడంతో రోడ్డుమీదే అరుచుకుంటూ నేరుగా అతడి వద్దకు వెళ్లి ''నీకు ఏమైంది.. మూర్ఖుడిలా తయారయ్యవే. నన్ను స్టూడియో దగ్గర పికప్ చేసుకోవాలి తప్ప రోడ్డుమీద కాదు'' అని గోలపెట్టింది. ఆమె అంత అరిచినా.. డ్రైవర్ మాత్రం తాపీగా, ''చూడండి, మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను మీ డ్రైవర్ కాను, ఇది మీ కారు కాదు'' అని చెప్పాడు. దాంతో మడొన్నా రోడ్డు మీద అటూ ఇటూ చూసి, అప్పుడు తన డ్రైవర్ ఎక్కడున్నాడో గుర్తించింది. ఇంత జరిగినా, తాను అరిచినందుకు కనీసం సారీ కూడా చెప్పకుండా రోడ్డు మీద టకా కటా నడుచుకుంటూ వెళ్లి తన కారులో కూర్చుని అక్కడినుంచి వెళ్లిపోయింది. -
ఆదాయంలో మిన్న.. మడోన్నా
యాభై ఏళ్లు దాటిపోయినా.. బిజీ బిజీగా టూర్లు తిరిగేస్తూ, పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న మెటీరియల్ గర్ల్ మడోన్నా.. నిరంతరం వివాదాలతో డోన్ట్ కేర్ అన్నట్లుగా కనిపించినా డబ్బు, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. అందుకే మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. ఇలాంటివన్నీ ఇందుకు తోడ్పడ్డాయి. తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి. కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా... దానితో ముడిపడి ఉన్న ఇతరత్రా సాధనాలన్నింటి నుంచి ఆదాయాన్ని ఆర్జించడం.. డబ్బు విషయంలో మడోన్నాకి ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. తన పేరు, పాటలకు ఉన్న పాపులారిటీని బాగానే క్యాష్ చేసుకుంటుంది మడోన్నా. అందుకే మెటీరియల్ గర్ల్ పేరిట దుస్తులు, పాదరక్షల కలెక్షన్‌ని ప్రవేశపెట్టింది. వీటి నుంచి ఏడాదికి సగటున 1 కోటి డాలర్ల పైగా ఆదాయం వస్తోంది. అలాగే, ట్రూత్ ఆర్ డేర్ పేరుతో విడుదల చేసిన పెర్ఫ్యూమ్ అమ్మకాలతో ఏకంగా ఆరు కోట్ల డాలర్లు వస్తున్నాయి. అటు స్మిర్నాఫ్ వోడ్కా, హార్డ్ క్యాండీ జిమ్ సెంటర్స్‌తో ఒప్పందాలూ ఇతోధికంగా ఆర్జించి పెట్టాయి. పాప్ మ్యూజిక్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ .. తనకు రావాల్సినది రాబట్టుకునే విషయంలో మడోన్నా అస్సలు రాజీ పడదు. తన పేరును వాడుకునేందుకు లెసైన్స్ ఇవ్వడం, ఆల్బమ్స్‌ను విక్రయించడం, పాప్ షోలను నిర్వహించడం తదితర అంశాలన్నీ చూసుకునే కంపెనీ నుంచి అత్యంత కష్టతరమైన పరిస్థితులలో కూడా 12 కోట్ల డాలర్లు రాబట్టింది. వీటా కోకో అనే హెల్త్ డ్రింక్ కంపెనీలో ఆమె 10 లక్షల పౌండ్లు పెట్టుబడి పెట్టగా అది కొన్నాళ్లలోనే 70 లక్షల పౌండ్లు తెచ్చిపెట్టింది. ఈ రకంగా మొత్తం మీద వంద కోట్ల డాలర్ల (సుమారు రూ. 6 వేల కోట్లు) సంపదను సాధించింది. ఇలా 54 ఏళ్ల వయస్సులోనూ యువ ఆర్టిస్టులను ఎదుర్కొంటూ, పాపులారిటీ తగ్గకుండా చూసుకుంటూ.. కోట్లు ఆర్జిస్తూ.. సంపాదనను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది మడోన్నా. -
మడోన్నా మనసు బంగారం
పాప్‌స్టార్ మడోన్నాది చాలా హెల్పింగ్ నేచర్ అని హాలీవుడ్లో ప్రతీతి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు బాధితులకు భారీ ఎత్తున సహాయం చేస్తుంటారామె. మూడేళ్ల క్రితం హైతీలో కనీవినీ ఎరుగని రీతిలో భూకంపం వచ్చిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు మడోన్నా. ఇటీవల మరోసారి ఆ నగరానికి వెళ్లారు. ఈసారి తన మాజీ భర్త, నటుడు, దర్శక, నిర్మాత సీన్ పెన్ ఆహ్వానం మేరకు హైతీ వెళ్లారామె. అక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పెన్. ఈ కార్యక్రమాలకు సహకరించవలసిందిగా మడోన్నాను ఆయన కోరడం, ఆమె అంగీకరించడం జరిగింది. హైతీ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో స్వయంగా తెలుసుకోవడానికి తన తనయుడు రోక్కోని కూడా తీసుకెళ్లారు మడోన్నా. అక్కడి హాస్పిటల్స్, వెనకబడిన ప్రాంతాలను సందర్శించారు. తన ఆహ్వానాన్ని మన్నించి మడోన్నా హైతీ రావడం, సహాయం చేయడానికి అంగీకరించడంతో సీన్ పెన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా మడోన్నా మనసు బంగారం అంటున్నారు ఈ మాజీ భర్త. -
వేలానికి మడొన్నా నగ్న చిత్రాలు
పాప్ క్వీన్ మడొన్నా నగ్న చిత్రాలు త్వరలో వేలానికి రానున్నాయి. ఎంత వీరాభిమానమున్నా 55 ఏళ్ల మడొన్నా ఫొటోలా అంటూ ఎవరైనా పెదవివిరవచ్చు. వేలానికి ఉంచనున్న నగ్న చిత్రాలు మడొన్నా 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు దిగినవి. వీటిని వచ్చే నెల 9న ఆన్లైన్ వేలానికి ఉంచనున్నారు. 1977లో అమెరికాలోని మిఖిగన్ యూనివర్సిటీలో మడొన్నా డాన్స్ విద్యార్థి. ఆ సమయంలో పది డాలర్లకు గంట సేపు కెమెరా ముందు నగ్నంగా పోజులిచ్చేందుకు అంగీకరించింది. హెర్మన్ కుల్కెన్స్ అనే ఫొటోగ్రాఫర్ మడొన్నా అందాలను కెమెరాలో బంధించాడు. పాప్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతలు రాకముందు ఆమె డబ్బుల కోసం చాలా నగ్నచిత్రాలకు పోజులిచ్చింది. ఈ విషయాన్ని అటుంచితే హెర్మన్ తీసిన ఫొటోలు పెంట్‌హౌస్ వ్యవస్థాపకుడు బాబ్ గుకియోన్ సేకరించగా, ఆ తర్వాత న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త జెరిమీ ఫ్రామర్ కొనుగోలు చేశారు. ఈ ఫొటోలతో పాటు మడొన్నాకు చెందిన మరికొన్ని వస్తువులను ఫ్రామర్ వేలానికి ఉంచారు. -
ఆ రోజుని ఇప్పటికీ మరిచిపోలేను
అప్పుడు మడోన్నా వయసు 20 ఏళ్లు. ఎన్నో కలలు... ఎన్నెన్నో ఆశలు... ఏవేవో కోర్కెలు... రకరకాల ప్రణాళికలు. మనసు నిండా వీటన్నింటినీ నింపుకుని ఓ శుభముహూర్తాన న్యూయార్క్‌లో అడుగుపెట్టారు మడోన్నా. కానీ కాలం కరుణా కటాక్షం ఆమెకు అంత సులువుగా దొరకలేదు. వరుసగా చేదు అనుభవాలు. ఇంటి అద్దె కట్టడం కోసం ఆర్ట్ క్లాసులకి నగ్నంగా మోడలింగ్ చేయడం, అవసరం కోసం తను చేస్తున్న ప్రదర్శనను ఇతరులు ఇంతింత కళ్లేసుకుని చూస్తుంటే కుమిలిపోవడం ఇప్పటికీ మడోన్నాకి గుర్తే. దాంతో పాటు పురుషాధ్యిక ప్రపంచం ఆమెను సుఖంగా బతకనివ్వలేదు. ఓసారి ఓ బిల్డింగ్ రూఫ్ సాక్షిగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో మడోన్నా గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కత్తి పట్టుకుని బెదిరించి మరీ, ఆ పాశవిక చర్యకు పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరుని మాత్రం మడోన్నా బయటపెట్టలేదు. ఈ పురుషాధ్యిక ప్రపంచంలో ఆ తర్వాత కూడా తనపై చాలా అత్యాచారాలు జరిగాయని, బతుకంటే చాలా భయమేసేదని ఆమె చెప్పారు. జస్ట్ ఇరవై అయిదేళ్లలోపే మడోన్నా ఓ జీవితానికి సరిపోయే అనుభవాలను ఎదుర్కొన్నారు. అవే ఆమెను రాటుదేలేలా చేశాయి. మూడు పదుల వయసు వచ్చేసరికి భయం స్థానంలో మొండితనం ఏర్పడిపోయింది. ఇక, పాప్‌స్టార్‌గా, నటిగా, దర్శకురాలిగా సక్సెస్ అయిన తర్వాత ఎవరికీ లొంగాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇప్పుడు మడోన్నాను ఎవరూ బెదిరించలేరు. ఒకర్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చారు కాబట్టే... కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె. ఇస్లామిక్ దేశాల్లో స్కూల్స్ కట్టిస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు లభించే ఆనందమే వేరంటున్నారు మడోన్నా. -
రేప్‌కి గురై రాటుతేలాను: పాప్‌స్టార్ మడొన్నా
లాస్ఏంజెలెస్(ఐఎఎన్ఎస్): మడోనా- పాప్ సంగీత ప్రపంచంలో రారాణి. పుట్టిన తేదీ లెక్కల ప్రకారం ఆమెకి 55 ఏళ్లే అయినా, వయసుతో పాటు పెరిగే యవ్వనం ఆమె. తన స్వరంతో కొత్త లోకాలు కల్పించి, యువతకి కానుక చేసే ఆ స్వర సామ్రాజ్ఞి తొలినాళ్లలో అత్యాచారానికి గురి అయ్యిందంటే కొన్ని కోట్ల హృదయాలు తల్లడిల్లుతాయి. తాను కూడా ఒకప్పుడు అత్యాచార బాధితురాలినేని పాప్‌స్టార్ మడొన్నా స్వయంగా వెల్లడించారు. రేప్‌కి గురై జీవితపాఠాలు నేర్చుకున్నానని కూడా పాప్ క్వీన్ మడోనా తెలిపారు. తన మీద జరిగిన అత్యాచారం పోరాట పటిమ నేర్పినట్లు పేర్కొన్నారు. తాను ఆనాడు పడ్డ నరకయాతనని మడోనా తొలిసారిగా బైటపెట్టారు. ఆ భయంకరమైన సంఘటన వివరాలను ‘హార్పర్బజార్’ అనే మ్యాగజైన్ నవంబర్ సంచిక గెస్ట్ కాలంలో ఆమె వివరించారు. తుపాకీ గురిపెట్టి కొందరు తనను అత్యాచారం చేశారని మడోన్నాతెలిపారు. తాను న్యూయార్క్‌కు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. న్యూయార్క్‌కు వచ్చిన కొత్తలో జరిగిన సంఘటనలు, తన అంతర్గత విషయాలను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. 'బిగ్ ఆపిల్' అన్న ముద్దు పేరుతో పిలవబడే న్యూయార్క్ నగరానికి తాను వచ్చినప్పటి అనుభవాల్ని ఆమె ఆ వ్యాసంలో రాశారు. "న్యూయార్క్ నేను అనుకున్నంత గొప్ప ప్రాంతమేమీ కాదు...ఇక్కడికి వచ్చిన ఏడాదిలోనే నా ఇంటిపై దుండగులు మూడుసార్లు దాడి చేశారు... తుపాకీ గురిపెట్టి, కత్తితో బెదిరించి బిల్డింగ్‌పైకి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేశారు... నా దగ్గర విలువైన వస్తువులు లేనప్పటికీ నా రేడియోను కూడా తీసుకెళ్లారు.’ అని అప్పుడు జరిగిన సంఘటన గురించి మడొన్నా మొదటిసారిగా ప్రపంచానికి తెలిపారు. ఆ సంఘటనే తనను మరింత ధృడంగా తయారుచేసిందని పేర్కొన్నారు. తనకు జీవితంలో పోరాడే శక్తిని ఇచ్చింది కూడా ఆ సంఘటనేనని తెలిపారు.