మడోన్నా మనసు బంగారం | Madonna visits ex-husband Sean Penn's aid projects | Sakshi
Sakshi News home page

మడోన్నా మనసు బంగారం

Published Thu, Nov 28 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

మడోన్నా మనసు బంగారం

మడోన్నా మనసు బంగారం

పాప్‌స్టార్ మడోన్నాది చాలా హెల్పింగ్ నేచర్ అని హాలీవుడ్‌లో ప్రతీతి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు బాధితులకు భారీ ఎత్తున సహాయం చేస్తుంటారామె. మూడేళ్ల క్రితం హైతీలో కనీవినీ ఎరుగని రీతిలో భూకంపం వచ్చిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు మడోన్నా. ఇటీవల మరోసారి ఆ నగరానికి వెళ్లారు. ఈసారి తన మాజీ భర్త, నటుడు, దర్శక, నిర్మాత సీన్ పెన్ ఆహ్వానం మేరకు హైతీ వెళ్లారామె. 
 
 అక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పెన్. ఈ కార్యక్రమాలకు సహకరించవలసిందిగా మడోన్నాను ఆయన కోరడం, ఆమె అంగీకరించడం జరిగింది. హైతీ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో స్వయంగా తెలుసుకోవడానికి తన తనయుడు రోక్కోని కూడా తీసుకెళ్లారు మడోన్నా. అక్కడి హాస్పిటల్స్, వెనకబడిన ప్రాంతాలను సందర్శించారు. తన ఆహ్వానాన్ని మన్నించి మడోన్నా హైతీ రావడం, సహాయం చేయడానికి అంగీకరించడంతో సీన్ పెన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా మడోన్నా మనసు బంగారం అంటున్నారు ఈ మాజీ భర్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement