
లవర్ అహ్లమాలిక్ విలియమ్స్‌తో మడోన్నా
ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పాటు వయసుతో కూడా సంబంధం లేదు. జీవితంలో ఏ వయసులో అయినా ప్రేమ కలగవచ్చు.. లవ్‌లో పడొచ్చు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే.. ప్రముఖ పాప్ సింగర్ ఒకరు లేటు వయసులో తాజాగా మరో సారి ప్రేమలో పడ్డారు. విశేషం ఏంటంటే వయసులో తన కన్నా దాదాపు 36 ఏళ్లు చిన్న వాడైన యువకుడితో పీకల్లోతు ప్రేమలో పడ్డారు సదరు సింగర్. ఇంతకు ఎవరా పాప్ సింగర్.. ఆమె లవ్ స్టోరి విశేషాలు తెలియాలంటే.. ఇది చదవాల్సిందే..
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్. పాటతో పాటు తిరుగులేని అందం మడోన్నా సొంతం. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తన మనసుకు నచ్చినట్లు జీవిస్తుంటారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తారు. తాజాగా ఇలాంటి ప్రకటనే చేశారు మడోన్నా. 62 ఏళ్ల వయసులో తాను మరోసారి ప్రేమలో పడ్డానని వెల్లడించారు. అవును మీరు చదివింది నిజమే.. 62వ ఏట ఈ పాప్ దివ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. అది కూడా తన కంటే 36ఏళ్ల చిన్నవాడితో. వాలంటైన్స్ డే సందర్భంగా లవర్ అహ్లమాలిక్ విలియమ్స్(26)తో కలిసి ప్రపంచాన్ని చుట్టేశారట.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మడోన్నానే ప్రకటించారు. ‘‘ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నా వాలైంటన్‌తో కలిసి ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వచ్చాను. ఎంతో అద్భుతమైన జర్నీ. హ్యాపీ వాలైంటన్స్ డే విలియమ్స్ అహ్లమాలిక్’’ అంటూ ప్రియుడితో కలిసి ఉన్న రెండు ఫోటోలని షేర్ చేశారు మడోన్నా. ప్రస్తుతం వీరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ చెప్పేవారు కొందరైతే.. పించన్ వచ్చే ఏజ్‌లో నీకు బాయ్‌ఫ్రెండ్ అవసరమా అంటూ విమర్శిస్తున్న వారు ఎందరో.
ఇక మడోన్నా-విలియమ్స్‌ల లవ్ స్టోరి విషయానికి వస్తే.. ఇతడు బ్యాకప్ డ్యాన్సర్‌గా పని చేస్తుంటాడు. ఐదేళ్ల క్రితం వీరద్దరికి పరిచయం ఏర్పడింది. మడోన్నా ఇచ్చిన రెండు ప్రదర్శనల్లో విలియమ్స్ డాన్సర్‌గా పని చేశాడు. అలా మొదలైన వీరి పరిచయం.. ప్రస్తుతం ప్రేమగా మారింది. ఓ ఏడాది నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మడోన్నా తాను మరో సారి ప్రేమలో పడినట్లు వెల్లడించారు.
మడోన్నా విలియమ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను చాలా మంచి వాడు. నా ఆరుగురు పిల్లలతో చాలా బాగా కలిసిపోయాడు. ముఖ్యంగా నా పెద్ద కుమార్తెకు అతను చాలా మంచి స్నేహితుడు’’ అంటూ చెప్పుకొచ్చారు. విశేషం ఏంటంటే మడోన్నా పెద్ద కుమార్తె.. విలియమ్స్ కన్నా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నది. ఇక విలియమ్స్ తల్లిదండ్రులు ఇద్దరు మడోన్నా కన్నా చిన్నవారు కావడం గమనార్హం. విలియమ్స్ తండ్రికి 59, తల్లికి 55 సంవత్సరాలు. వీరిద్దరి కన్నా మడోన్నా పెద్దది.
Comments
Please login to add a commentAdd a comment