పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్‌జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్‌జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు.
ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment