ఆ కారు నడిపిందెవరు? | Who is driving her car? Madonna confused | Sakshi
Sakshi News home page

ఆ కారు నడిపిందెవరు?

Published Tue, Jun 3 2014 11:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

ఆ కారు నడిపిందెవరు?

ఆ కారు నడిపిందెవరు?

తనది అనుకుని.. ఎవరిదో కారు చూడటమే కాదు.. తన వాడు కాని డ్రైవర్ మీద నోటికొచ్చినట్లు అరిచేసింది.. గాయని మడొన్నా. 55 ఏళ్ల ఈ పాప్ గాయనికి రోడ్డు మీద ఓ కారు కనపడింది. వెంటనే ఆమె డ్రైవర్ మీద విరుచుకుపడింది. ''ఏయ్, ఎవరు నువ్వు, నేను ఇక్కడున్నానని నీకు తెలీదా'' అంది. అయినా కూడా డ్రైవర్ ఆమెను గుర్తించకపోవడంతో రోడ్డుమీదే అరుచుకుంటూ నేరుగా అతడి వద్దకు వెళ్లి  ''నీకు ఏమైంది.. మూర్ఖుడిలా తయారయ్యవే. నన్ను స్టూడియో దగ్గర పికప్ చేసుకోవాలి తప్ప రోడ్డుమీద కాదు'' అని గోలపెట్టింది.

ఆమె అంత అరిచినా.. డ్రైవర్ మాత్రం తాపీగా, ''చూడండి, మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను మీ డ్రైవర్ కాను, ఇది మీ కారు కాదు'' అని చెప్పాడు. దాంతో మడొన్నా రోడ్డు మీద అటూ ఇటూ చూసి, అప్పుడు తన డ్రైవర్ ఎక్కడున్నాడో గుర్తించింది. ఇంత జరిగినా, తాను అరిచినందుకు కనీసం సారీ కూడా చెప్పకుండా రోడ్డు మీద టకా కటా నడుచుకుంటూ వెళ్లి తన కారులో కూర్చుని అక్కడినుంచి వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement