వేలానికి మడొన్నా నగ్న చిత్రాలు | Nude photos of Madonna to be auction | Sakshi
Sakshi News home page

వేలానికి మడొన్నా నగ్న చిత్రాలు

Published Wed, Oct 30 2013 5:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

వేలానికి మడొన్నా నగ్న చిత్రాలు

వేలానికి మడొన్నా నగ్న చిత్రాలు

పాప్ క్వీన్ మడొన్నా నగ్న చిత్రాలు త్వరలో వేలానికి రానున్నాయి. ఎంత వీరాభిమానమున్నా 55 ఏళ్ల మడొన్నా ఫొటోలా అంటూ ఎవరైనా పెదవివిరవచ్చు. వేలానికి ఉంచనున్న నగ్న చిత్రాలు మడొన్నా 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు దిగినవి. వీటిని వచ్చే నెల 9న ఆన్లైన్ వేలానికి ఉంచనున్నారు.

1977లో అమెరికాలోని మిఖిగన్ యూనివర్సిటీలో మడొన్నా డాన్స్ విద్యార్థి. ఆ సమయంలో పది డాలర్లకు గంట సేపు కెమెరా ముందు నగ్నంగా పోజులిచ్చేందుకు అంగీకరించింది. హెర్మన్ కుల్కెన్స్ అనే ఫొటోగ్రాఫర్ మడొన్నా అందాలను కెమెరాలో బంధించాడు. పాప్ స్టార్గా పేరు ప్రఖ్యాతలు రాకముందు ఆమె డబ్బుల కోసం చాలా నగ్నచిత్రాలకు పోజులిచ్చింది. ఈ విషయాన్ని అటుంచితే హెర్మన్ తీసిన ఫొటోలు పెంట్హౌస్ వ్యవస్థాపకుడు బాబ్ గుకియోన్ సేకరించగా, ఆ తర్వాత న్యూయార్క్కు చెందిన వ్యాపారవేత్త జెరిమీ ఫ్రామర్ కొనుగోలు చేశారు. ఈ ఫొటోలతో పాటు మడొన్నాకు చెందిన మరికొన్ని వస్తువులను ఫ్రామర్ వేలానికి ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement