
మడోనా మెరుపు!
ముద్దుగుమ్మ మడోనా మళ్లీ స్టేజీపై వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న జరగనున్న ‘బ్రిట్’ అవార్డుల ఫంక్షన్లో... పదివేల ఓల్టుల వెలుగుల్లో... ఈ సెక్సీ తార మెరుపులు మెరిపించేందుకు ముస్తాబవుతోంది. ఇరవై ఏళ్ల తరువాత మడోనా మళ్లీ ‘బ్రిట్’ వేదికపైకి వస్తోంది. స్పష్టంగా తెలియకపోయినా... తన ‘రెబల్ హార్ట్’ ఆల్బమ్‌లోని ట్రాక్‌నే మడోనా ప్రదర్శిస్తుందని సమాచారం.
దీంతె ఇప్పటివరకు తన పార్టిసిపేషన్‌పై వస్తున్న ఊహాగానాలకు ట్విట్టర్ ద్వారా మడోనానే ఫుల్‌స్టాప్ పెట్టింది. అవార్డుల బ్రోచర్‌తో పాటు తన చిత్రాన్నీ పెట్టి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. మడోనా ఓ ఐకాన్ అని... యాభై ఆరేళ్లు వచ్చినా... ఆమెలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని బ్రిట్ చైర్మన్ మ్యాక్స్ లౌసాడా అంటున్నాడు. చూద్దాం... ఈ అమ్మడు ఏ స్థాయిలో మురిపిస్తుందో!