
కరాచీలో మడోన్నా బడి..
పాప్ రారాణి మడోన్నా పాటలు పాడటమే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఆమె పాకిస్థాన్‌లోని కరాచీ నగర శివార్లలో ఒక స్కూలు ప్రారంభించింది. ‘డ్రీమ్ మోడల్ స్ట్రీట్ స్కూల్’ పేరిట ఇటీవల ప్రారంభించిన ఈ స్కూలులో ఇప్పటికే దాదాపు1200 మంది విద్యార్థులు చేరినట్లు మడోన్నా తన ‘ట్విట్టర్’ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు వగైరా అధునాతన హంగులతో కూడిన ఈ స్కూల్ ఫొటోలను ఆమె ‘ట్విట్టర్’లో షేర్ చేసింది. కరాచీలో స్కూలు ప్రారంభించనున్నట్లు మడోన్నా ఏడాది కిందటే ప్రకటించింది. అన్నట్లుగానే స్కూలు తెరిచి, అమ్మాయిలకు విద్యావకాశాలు పెంపొందించేందుకు తనవంతు సాయం చేసింది.
Girls learning at the Dream School #appreciation pic.twitter.com/bz6W07rfHn
— Madonna (@Madonna) September 28, 2014