
మహిళలు వాళ్లకే అండగా ఉంటారు కానీ..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి పాప్ స్టార్ మడోన్నాను ఆవేదనకు గురిచేసింది. ఎన్నికల్లో హిల్లరీ తరఫున ప్రచారం చేసిన మడోన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. హిల్లరీ ఓటమికి మహిళలే కారణమని నిందించింది. మహిళలు మహిళలను ద్వేషిస్తారని మడోన్నా వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షురాలిగా ఓ మహిళను అంగీకరించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
మహిళలను పలు సందర్భాల్లో కించపరిచేలా మాట్లాడిన, అసభ్యంగా ప్రవర్తించిన ట్రంప్‌కు ఎక్కువ మంది మహిళలు మద్దతు పలికారని మడోన్నా ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళలకు మద్దతుగా ఉండకపోవడం మహిళల స్వభావమని, ఇది చాలా బాధకరమని అంది. మగవాళ్లు అందరినీ సంరక్షిస్తారని, మహిళలు మాత్రం వారి భాగస్వామి, పిల్లలకు అండగా ఉంటారని చెప్పింది.