‘చాలా సంతోషం.. ఆమెతో లేను’ | I'm so glad I don't live with Madonna: Rocco Ritchie | Sakshi
Sakshi News home page

‘చాలా సంతోషం.. ఆమెతో లేను’

Published Mon, Nov 28 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

‘చాలా సంతోషం.. ఆమెతో లేను’

‘చాలా సంతోషం.. ఆమెతో లేను’

లండన్‌: ప్రముఖ పాప్‌ సింగర్‌ మడోన్నాకు కొడుకు రొక్కో రిట్చీ పెద్ద తలనొప్పిగా మారాడు. మడోన్నా నుంచి దూరంగా తండ్రితో కలిసి ఉంటున్న రొక్కో.. తల్లిపై విమర్శలు చేయడం మాత్రం మానడం లేదు.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని అపహాస్యం చేసేలా ఓ వీడియోను రొక్కో ఇటీవల పోస్ట్‌ చేశాడు. మడోన్నా తింటున్న సమయంలో సగం ఫుడ్‌ నోటి బయట ఉన్నట్లుగా ఉన్న అభ్యంతరకర దృశ్యాన్ని తన ఇన్‌స్టాగ్రాంలో ఉంచాడు. ఆ విడియోకు ‘సో గ్లాడ్‌.. ఆమెతో ఉండట్లేదు’ అనే వ్యాఖ్యలను జత చేశాడు. దీనిపై మడోన్నా ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో విరుచుపడటంతో అతడు వెంటనే ఆ వీడియోను తొలగించాడు. రొక్కో గతవారం డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement