హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస? | Miley Cyrus, Madonna front new domestic violence campaign | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?

Published Thu, Dec 3 2015 12:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?

హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?

లాస్ ఏంజిల్స్: మహిళలపై జరుగుతున్న గృహహింసకు వ్యతిరేకంగా సెలబ్రెటీలు మిలీ సిరస్, మడోన్నాల ఫొటోలతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మిలీ సిరస్, మడోన్నాలు గృహహింసకు గురైనట్లు ప్రముఖ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త అలెగ్జాండ్రో పొలాంబో రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోలలో.. మడోన్నా, సిరస్లు దారుణంగా హింసకు గురైనట్లు రూపొందించారు.

ముఖంపై గాయాలతో కన్పిస్తున్న సెలెబ్రిటీల ఫొటోలు గృహహింసపై ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. గృహహింసపై మౌనం వీడాలని ఈ ఫొటోలపై ఉన్నటు కొటేషన్లు సైతం నెటిజన్లను ఆకట్టకుంటున్నాయి. ఓ సామాజిక సమస్యకు సెలబ్రెటీల టచ్ ఇచ్చి పొలాంబో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం చూపరులను ఆలోచింపజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement