miley cyrus
-
నటి నగ్న వీడియో లీక్.. షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ నటి, అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ అయిన మిలే సైరస్ స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్ చేసి షాకిచ్చింది. త్వరలో తన కొత్త అల్భమ్ను రిలీజ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తన అల్భమ్ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మిలే బాత్రూంలో స్నానం చేస్తూ తన కొత్త అల్భంకు సంబంధించిన పాట పాడుతూ కనిపించింది. చదవండి: యశ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పి ట్రోల్స్ బారిన పడ్డ ప్రశాంత్ నీల్, దెబ్బకి ట్విటర్ క్లోజ్! తానే స్వయంగా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారాల అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా మిలే సైరస్కు ఇన్ స్టాగ్రామ్‌లో 192 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు అనేక లైక్స్ వస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన తన బాత్ రూం వీడియోకు 16 లక్షల పైగా లైక్స్, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అయితే మిలే సైరస్ ‘పార్టీ ఇన్ ది హోడ్’, ‘కాంట్ బి టేమ్డ్’, ‘7 థింగ్స్’ వంటి అల్భమ్తో పాపులర్ అయ్యింది. చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి! -
పాపం పిల్లితో జగడమాడి..
లాస్ ఏంజెల్స్: అమెరికా పాప్ సింగర్ మిలే సైరస్కు టైం బాగా లేదనుకుంటా.. ఆమెపై పిల్లి దాడి చేసింది. మిలేకు పిల్లుల్ని పెంచే అలవాటు ఉంది. ప్రస్తుతం ఆమె దగ్గర నాలుగు పిల్లులు హార్లేమ్, శాంతి ఓం బ్బీ, కికి, లిలోలు ఉన్నాయి. దాడి చేస్తున్న పిల్లితో ముఖాముఖి తలపడటంతో మిలే ముఖం, చేతులకు గాయాలయ్యాయి. వీటన్నింటినీ ఫోటోలు తీసి ఇన్‌స్టగ్రామ్‌లో పెట్టేసింది ఈ అమ్మడు. తనపై దాడి చేసింది తన పిల్లుల్లో ఒకటో లేదా వేరెవరిదో తనకి తెలియదని కామెంట్స్ కూడా పెట్టింది. ఈ ఫోటోలను ఇన్స్ట్రగ్రామ్లో చూసిన ఫాలోవర్స్ తెగ వర్రీ అయిపోతున్నారు. జంతువుల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోవద్దని ఆమెను కోరారు. -
'ఓ కుర్రాడి కోసం మేం గొడవపడ్డాం'
లండన్: తాను నా గురించి ఏమనుకుంటుందో తెలీదు కానీ, ఆమెకు నేను పెద్ద అభిమానిని అంటూ నటి, పాప్ స్టార్ సింగర్ సెలెనా గొమేజ్ చెప్పింది. ఇంతకు గొమేజ్ ఈ మాటలన్నది ఎవరి గురించో తెలిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. సింగర్, లిరిక్ రైటర్ మిలే సిరస్ తో విభేదాలున్నాయని తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అటువంటి వార్తలకు ఒక్కసారిగా గొమేజ్ ఫుల్స్టాప్ పెట్టేసింది. అసలు విషయాన్ని బయటపెట్టింది. మిలే సిరస్, సెలెనా గొమేజ్ ఇద్దరూ చిన్నతనంలో ఒకే అబ్బాయిని ప్రేమించారట. అయితే, స్నేహితురాలు అని ఎవ్వరూ ఈ విషయాన్ని వదిలిపెట్టలేరు కదా! అందుకే మా ఇద్దరి మధ్య ఈ విషయంలో మాత్రమే ఆ సమయంలో కాస్త విభేదాలు తలెత్తాయి. ఆ అబ్బాయి కారణంగా ఒకరంటే మరొకరికి పడేది కాదు. తాను ఏం చేసినా సింగర్ సిరస్‌కు, అలాగే సిరస్ ఏం చేస్తున్నా తనకు అంతగా నచ్చేదికాదంటూ గొమేజ్ చెప్పుకొచ్చింది. 'ఏది ఏమైతేనేం.. నేను మాత్రం ఆమె మ్యూజిక్ కు బిగ్ ఫ్యాన్. ఆమె నా గురించి ఏమనుకుంటో చెప్పలేను' అని గొమేజ్ వివరించింది. సరిగ్గా చెప్పాలంటే పదహారేళ్ల ప్రాయంలో మేం ఇద్దరం ఒకే కుర్రాడిని ప్రేమించాం. ఓ మై గాడ్.. ప్రస్తుతం మేమిద్దరం మా కెరీర్లలో సెటిల్ అయ్యాం అని చెప్పిన గొమేజ్ ఇప్పుడు జస్టిస్ బీబర్ తో డేటింగ్ చేస్తుందన్న విషయం తెలిసిందే. -
హాలీవుడ్ సెలబ్రిటీలకూ గృహహింస?
లాస్ ఏంజిల్స్: మహిళలపై జరుగుతున్న గృహహింసకు వ్యతిరేకంగా సెలబ్రెటీలు మిలీ సిరస్, మడోన్నాల ఫొటోలతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మిలీ సిరస్, మడోన్నాలు గృహహింసకు గురైనట్లు ప్రముఖ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త అలెగ్జాండ్రో పొలాంబో రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలలో.. మడోన్నా, సిరస్‌లు దారుణంగా హింసకు గురైనట్లు రూపొందించారు. ముఖంపై గాయాలతో కన్పిస్తున్న సెలెబ్రిటీల ఫొటోలు గృహహింసపై ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. గృహహింసపై మౌనం వీడాలని ఈ ఫొటోలపై ఉన్నటు కొటేషన్లు సైతం నెటిజన్లను ఆకట్టకుంటున్నాయి. ఓ సామాజిక సమస్యకు సెలబ్రెటీల టచ్ ఇచ్చి పొలాంబో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం చూపరులను ఆలోచింపజేస్తోంది. -
ఎందుకో ఏమో!
గ్లామరస్ గాళ్ మిలే సిరస్ తన డీగ్లామర్ ఫొటో ఒకటి షేర్ చేసింది. అది కూడా పళ్లు ఊడగొట్టుకున్న పిక్చర్. ముందు వరుసలో ఐదు పళ్లు రాలిపోయాయి. అమ్మడు అందుకు కారణం అయితే చెప్పలేదు గానీ... ఊడిన పళ్లు ఒకటి... అవి లేకుండా తన ఫేస్ ఒకటి... సర్జరీ చేయించుకుంటున్నది మరోటి... ఇలా దశలవారీగా ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన బాధను అందరితో చెప్పుకొని తెగ ఇదైపోయింది. ‘సేవ్ మీ’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసి అభిమానులను కాస్త కంగారు పెట్టినట్టు కనిపించినా... మొత్తానికి సర్జరీ సక్సెస్ అయిందని సంతోషాన్నీ వెళ్లబుచ్చింది. ఈ సమయంలో పక్కనే ఉన్న అమ్మకు... ఎలాంటి నొప్పీ లేకుండా వైద్యం చేసిన డెంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపింది. ఏది ఏమైనా... ఎప్పుడూ సంతోషాల సీన్లే కాదు... బాధలూ పంచుకోవాలని చెప్పకనే చెప్పింది ఈ ఇరవై రెండేళ్ల స్వీట్ సింగర్! -
హవా హవాయ్!
హాలీవుడ్ అందాలు వెండి తెరపైనే కాదు... పబ్లిక్ ప్లేసుల్లోనూ కనువిందు చేస్తున్నాయి. ఎప్పుడూ నటించి మెప్పించడమేనా అనుకుందో ఏమో... రియల్ లైఫ్‌లో కూడా ‘బోల్డ్’గా కనిపించి మురిపించింది సెక్సీ సుందరి మిలె సిరస్! తన బాయ్‌ఫ్రెండ్ ప్యాట్రిక్ స్క్వాజ్నెగర్తో హవాయ్ బీచ్‌లో టాప్‌లెస్‌లో మెరిసి షేక్ చేసింది. వెండితెర వేల్పు ఇలా ప్రత్యక్షమైపోయి ‘కెరటాల’ హోరులో ‘అందం’గా విందు చేస్తుంటే... అక్కడున్న పురుష పుంగవులు తిలకించి పులకించిపోయారు. కలయా... మాయా... అంటూ తమను తాము గిల్లుకుని... తేరుకుని... ఆపై ఏమి ఈ భాగ్యమంటూ ‘పిల్ల’ గాలులను ఆస్వాదించేశారు. -
షూట్ ‘అవుట్’
కాంట్ర వర్సీలతో కాపురం చేసే పాప్ సింగర్ మిలే సిరస్ మళ్లీ ‘హాట్’ టాపిక్ అయింది. ఈ 21 ఏళ్ల స్వీట్ సింగర్... ‘వి మ్యాగజైన్’ కవర్ పేజీకి నగ్నంగా పోజిచ్చింది. ‘ది రెబల్ ఇష్యూ’ పేరిట తమ 91వ ఎడిషన్ మార్కెట్లోకి వదులుతున్న సదరు మ్యాగజైన్ ఫొటో షూట్లో వినూత్నంగా కనువిందు చేయనుందీ భామ. జంతువుల మధ్యలో కూర్చొని స్నానం చేస్తున్న పోజులో సిరస్ షాకివ్వబోతోందని ఓ వెబ్సైట్ కథనం. ‘రొటీన్‌తో విసిగి వేసారిన మనసులకు ఇలాంటివి కాసింత సంతోషాన్నిస్తాయి’ అంటూ క్యాజువల్‌గా చెప్పేసింది సిరస్. -
కుక్కకు టాటూ నివాళి
పాప్‌స్టార్ మిలీ సైరస్ తన పెంపుడు కుక్కకు నివాళిగా టాటూ పొడిపించుకుంది. మిలీ అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క ఫ్లాయిడ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించింది. దాని మరణంతో మానసికంగా కుంగిపోయిన మిలీ, కుక్క జ్ఞాపకాన్ని శాశ్వతం చేసుకునేందుకు తన ఎడమ పక్కటెముకల వద్ద దాని బొమ్మను పచ్చబొట్టు వేయించుకుంది. -
మిలీ సైరస్ ఎదపై పెంపుడు కుక్క టాటూ!!
ప్రముఖ పాప్ గాయని మిలీ సైరస్ ఏం చేసినా సంచలనమే. తాజాగా తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకున్న ఫ్లాయిడ్ అనే కుక్క చనిపోవడంతో, దాని బొమ్మను టాటూ వేయించుకుంది. మామూలుగా టాటూ వేయించుకోవడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ, ఆమె తన ఎదమీద ఆ టాటూను వేయించుకుని ఫొటోలకు పోజులివ్వడంతోనే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అలాస్కన్ క్లీ జాతికి చెందిన ఆ కుక్క పిల్ల గత ఏప్రిల్ నెలలో మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది. దాంతో సైరస్ (21) ఇక టాటూ వేయించేసుకోవాలని నిర్ణయించుకుంది. వృత్తాకారంలో ఓ టాటూ తన ఎద ప్రాంతంలో వేయించుకుంది. ఇవే ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా షేర్ చేసింది. తన స్నేహితుల సాయంతో ఈ టాటూ వేయించుకున్నానని చెప్పింది. ఆమె స్నేహితులు ఇద్దరు కూడా ఇదే తరహా టాటూలను తమ శరీరాల మీద వేయించుకున్నారు. ఇటీవలే సైరస్ ఎము కోయినో సైరస్ అనే కొత్త కుక్కపిల్లను పెంచుకోవడం మొదలుపెట్టింది. అయితే.. తన ఫ్లాయిడ్‌ను మాత్రం అది మరిపించలేదని చెబుతోంది. -
మిలియన్ డాలర్ టీనేజర్స్
పూర్వీకుల ఆస్తులు కలిసిరాలేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేదు... ఇవేమీ లేకపోయినా టీనేజ్లోనే కోటీశ్వరులయ్యారు. డ బ్బుతో అనుభవించగల అన్ని సౌఖ్యాలు సొంతం చేసుకున్నారు. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెడుతున్నారు. కొందరిలో అసూయను, మరికొందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. వీళ్లు డబ్బున్న వాళ్ల పిల్లలు కాదు... డబ్బున్న పిల్లలు! ప్రతిభనే పెట్టుబడిగా చేసుకుని కోట్ల డాలర్లకు అధిపతులయ్యారు. అలాంటి వారిలో మొదటి స్థానాల్లో ఉన్నవారితో కూడిన ‘రిచెస్ట్ టీనేజర్స్ ఆన్ ది ప్లానెట్’ జాబితా ఇది... ఎమ్మావాట్సన్: మోడలింగ్ ద్వారా ప్రతి యేటా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ ఇంగ్లిష్ నటి. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఫ్యాషన్ పరేడ్లలో ఎమ్మా ద్వారా తాము రూపొందించిన డ్రస్సులను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. దీంతో ఎమ్మా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఏడాదికి 12 మిలియన్ డాలర్ల సొమ్ము జమ అవుతోందని అంచనా. ఇది రూపాయల్లో 72 కోట్లు. జడెన్స్మిత్: ఈ కరాటే కిడ్‌ను చాలా సులువుగా గుర్తించవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ కుమారుడు అయిన జడెన్ స్మిత్ ‘కరాటే కిడ్’ అనే సినిమాతో బాగా ఫేమస్అయ్యాడు. 13 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో నటించాడు ఈ జూనియర్ స్మిత్. అది సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కో సినిమాకు పారితోషి కంగా ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని భోగట్టా. సెలీనా గొమెజ్: హాలీవుడ్ సినిమాల ద్వారా భారతీయ యువతకు పరిచయమున్న అమెరికన్ యువతి. 19 ఏళ్ల వయసులోసెలీనా ఒక ఏడాదికి పొందుతున్న పారితోషికాన్ని లెక్కగడితే అది దాదాపు ఆరు మిలియన్ డాలర్లుగా తేలింది. అంటే దాదాపు 36 కోట్ల రూపాయలు. మిల్లీ సైరస్: 18 ఏళ్ల వయసులో ఒక ఏడాదిలోనే 48 మిలియన్ డాలర్ల డబ్బును సంపాదించి రికార్డు స్థాపించింది. రిచెస్ట్ టీనేజ్ గర్ల్‌గా నిలిచింది ఈ యాక్టర్ కమ్ సింగర్. జస్టిన్ బీబెర్ : 17 యేళ్ల వయసులో ఒకే ఏడాదికి 50 మిలియన్ డాలర్ల సొమ్మును సంపాదించాడు బీబెర్. దీన్ని రూపాయిల్లోకి మారిస్తే దాదాపు 300 కోట్లు! ఇదంతా ఒక ఏడాది సంపాదనే. బీబెర్ ఈ స్థాయిలో సంపాదన మొదలుపెట్టి మూడేళ్లు గడిచిపోయాయి! నిక్జొనస్: ఇతడూ పాప్ గాయకుడే. బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం కోసం భారీ స్థాయి పారితోషికాన్ని పొందుతున్నాడు. ఈ కుర్రాడి ఏడాది సంపాదన 20 మిలియన్ డాలర్ల పైమాటే! అంటే దాదాపు 120 కోట్ల రూపాయలు.