మిలీ సైరస్ ఎదపై పెంపుడు కుక్క టాటూ!! | Miley Cyrus gets dog tattoo | Sakshi
Sakshi News home page

మిలీ సైరస్ ఎదపై పెంపుడు కుక్క టాటూ!!

Published Mon, Jul 7 2014 10:17 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

మిలీ సైరస్ ఎదపై పెంపుడు కుక్క టాటూ!! - Sakshi

మిలీ సైరస్ ఎదపై పెంపుడు కుక్క టాటూ!!

ప్రముఖ పాప్ గాయని మిలీ సైరస్ ఏం చేసినా సంచలనమే. తాజాగా తాను ఎంతగానో ఇష్టపడి పెంచుకున్న ఫ్లాయిడ్ అనే కుక్క చనిపోవడంతో, దాని బొమ్మను టాటూ వేయించుకుంది. మామూలుగా టాటూ వేయించుకోవడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ, ఆమె తన ఎదమీద ఆ టాటూను వేయించుకుని ఫొటోలకు పోజులివ్వడంతోనే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అలాస్కన్ క్లీ జాతికి చెందిన ఆ కుక్క పిల్ల గత ఏప్రిల్ నెలలో మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది.

దాంతో సైరస్ (21) ఇక టాటూ వేయించేసుకోవాలని నిర్ణయించుకుంది. వృత్తాకారంలో ఓ టాటూ తన ఎద ప్రాంతంలో వేయించుకుంది. ఇవే ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా షేర్ చేసింది. తన స్నేహితుల సాయంతో ఈ టాటూ వేయించుకున్నానని చెప్పింది. ఆమె స్నేహితులు ఇద్దరు కూడా ఇదే తరహా టాటూలను తమ శరీరాల మీద వేయించుకున్నారు. ఇటీవలే సైరస్ ఎము కోయినో సైరస్ అనే కొత్త కుక్కపిల్లను పెంచుకోవడం మొదలుపెట్టింది. అయితే.. తన ఫ్లాయిడ్ను మాత్రం అది మరిపించలేదని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement