పాపం పిల్లితో జగడమాడి.. | Miley Cyrus was mauled by cat | Sakshi
Sakshi News home page

పాపం పిల్లితో జగడమాడి..

Published Wed, Apr 6 2016 5:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

పాపం పిల్లితో జగడమాడి..

పాపం పిల్లితో జగడమాడి..

లాస్ ఏంజెల్స్: అమెరికా పాప్ సింగర్ మిలే సైరస్కు టైం బాగా లేదనుకుంటా.. ఆమెపై పిల్లి దాడి చేసింది. మిలేకు పిల్లుల్ని పెంచే అలవాటు ఉంది. ప్రస్తుతం ఆమె దగ్గర నాలుగు పిల్లులు హార్లేమ్, శాంతి ఓం బ్బీ, కికి, లిలోలు ఉన్నాయి. దాడి చేస్తున్న పిల్లితో ముఖాముఖి తలపడటంతో మిలే ముఖం, చేతులకు గాయాలయ్యాయి.

వీటన్నింటినీ ఫోటోలు తీసి ఇన్స్టగ్రామ్లో పెట్టేసింది ఈ అమ్మడు. తనపై దాడి చేసింది తన పిల్లుల్లో ఒకటో లేదా వేరెవరిదో తనకి తెలియదని కామెంట్స్ కూడా పెట్టింది. ఈ ఫోటోలను ఇన్స్ట్రగ్రామ్లో చూసిన ఫాలోవర్స్ తెగ వర్రీ అయిపోతున్నారు. జంతువుల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోవద్దని ఆమెను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement