Saranga Dariya Song: Mangli Dance Performance for Saranga Daria Song video viral - Sakshi
Sakshi News home page

సారంగదరియాకు మంగ్లీ స్టెప్పులు వీడియో వైరల్‌

Published Mon, Mar 22 2021 2:46 PM | Last Updated on Mon, Mar 22 2021 3:27 PM

 Mangli Dance For Saranga Dariya Song Video Goes Viral  - Sakshi

సాయి పల్లవి ఆట పాట అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో 'సారంగదరియా' సాంగ్ ద్వారా మరోసారి రుజువైంది. విడుదలైన మరుక్షణం నుంచే ఈ పాట యూట్యూబ్‌ని షేక్‌ చేస్తూ, మునుపటి రికార్డులను తిరగ రాస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలోనూ హల్ చల్‌ చేస్తోంది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలోని మాస్ బీట్, సాయి పల్లవి ఎనర్జిటిక్‌ డాన్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకులు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంగ్లీ కూడా 'సారంగదరియా' పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్ అవుతోంది.. 

మంగ్లీ ఎంత హుషారుగా పాట పాడిందో అంతే హుషారుగా స్టెప్పులేసింది. సాయి పల్లవి వేసిన స్టెప్పులతో ఆకట్టుకుంటూ ఆమెను రీప్లేస్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన వారు.. 'మీరు పాడిన పాటకి మీరే డ్యాన్స్ చేయడం.. పాటకు ఇంకా కొత్తదనం వచ్చినట్టుంది' అంటూ  కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. కాగా 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగదరియా' సాంగ్ బయటకు వచ్చినప్పటి నుంచి దాని చుట్టూ వివాదం అలుముకున్న సంగతి తెలిసిందే. ఇది తన పాటు అంటూ కోమలి అనే మహిళ మీడియా ముందుకు రావడం తర్వాత అదే విషయాన్ని చిత్ర  దర్శకుడు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఏదేమైనా ఈ పాట మాత్రం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న 'లవ్ స్టోరీ' మూవీకి కావాల్సినంత పబ్లిసిటీని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. ( చదవండి : ఆ క్రెడిట్‌.. డబ్బులు కోమలికే! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement