cat attack
-
పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి
మొవ్వ (పామర్రు): పిల్లి కాటుకు గురైన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలోని ఆర్ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కమల, నాగమణి ఆరోగ్యంలో త్రీవ మార్పులు రావడంతో కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. అయినా.. మెరుగు పడలేదు. కమల గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో చనిపోయింది. నాగమణి శుక్రవారం మొవ్వ పీహెచ్సీలో వైద్యం చేయించుకుని అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె కూడా చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతి చెందిన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకిందని వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. కాగా మహిళలను కరిచిన పిల్లిని ఓ కుక్క కరిచిందని, ఆ కుక్క కూడా కొద్దిరోజులకే చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు. -
వైరల్: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్‌పై దాడి
ఓ పిల్లి విమానంలోకి ఎలా చొరబడిందో తెలియదు గానీ రచ్చ రచ్చ చేసింది. ఏకంగా కాక్‌పిట్‌లో దూరి పైలట్‌పైనే దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పిల్లి చూపించిన నరకానికి ఏం చోయాలో తెలియగా చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన బుధవారం సూడాన్ జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ విమానం టేకాఫ్ అయిన అరగంటకే ఓ పిల్లి హడావిడి చేసింది. స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ కాక్‌పిట్‌లో పైలెట్, సిబ్బందిపై దాడి చేసింది. దాన్ని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో విమానం యూటర్న్ తీసుకొని సుడాన్ రాజధాని నగరమైన ఖార్టూమ్‌లోనే మరలా దిగాల్సి వచ్చింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. ఇంతకీ విమానంలోకి పిల్లి ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ అధికారులకు అంతుపట్టడం లేదు. ఒకవేళ ఫ్లైట్‌ను ముందురోజు రాత్రి విమానాశ్రయంలో ఉంచినప్పుడు చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందని, లేదా లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వరి కంటా పడకుండా ఆన్ బోర్డ్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఓ జంతువు కారణంగా మధ్య గాలి గందరగోళానికి ఒక దొంగ జంతువు కారణం కావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా అహ్మదాబాద్ నుండి జైపూర్‌కు ప్రయాణించాల్సిన గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. వీటి కారణంగా విమానం సుమారు 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది. చదవండి: ‘నేనేం పిల్లిని కాను’: జూమ్ యాప్‌లో ఫన్నీ ఘటన మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి -
పాపం పిల్లితో జగడమాడి..
లాస్ ఏంజెల్స్: అమెరికా పాప్ సింగర్ మిలే సైరస్కు టైం బాగా లేదనుకుంటా.. ఆమెపై పిల్లి దాడి చేసింది. మిలేకు పిల్లుల్ని పెంచే అలవాటు ఉంది. ప్రస్తుతం ఆమె దగ్గర నాలుగు పిల్లులు హార్లేమ్, శాంతి ఓం బ్బీ, కికి, లిలోలు ఉన్నాయి. దాడి చేస్తున్న పిల్లితో ముఖాముఖి తలపడటంతో మిలే ముఖం, చేతులకు గాయాలయ్యాయి. వీటన్నింటినీ ఫోటోలు తీసి ఇన్‌స్టగ్రామ్‌లో పెట్టేసింది ఈ అమ్మడు. తనపై దాడి చేసింది తన పిల్లుల్లో ఒకటో లేదా వేరెవరిదో తనకి తెలియదని కామెంట్స్ కూడా పెట్టింది. ఈ ఫోటోలను ఇన్స్ట్రగ్రామ్లో చూసిన ఫాలోవర్స్ తెగ వర్రీ అయిపోతున్నారు. జంతువుల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోవద్దని ఆమెను కోరారు.