ఓ పిల్లి విమానంలోకి ఎలా చొరబడిందో తెలియదు గానీ రచ్చ రచ్చ చేసింది. ఏకంగా కాక్‌పిట్‌లో దూరి పైలట్‌పైనే దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పిల్లి చూపించిన నరకానికి ఏం చోయాలో తెలియగా చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన బుధవారం సూడాన్ జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ విమానం టేకాఫ్ అయిన అరగంటకే ఓ పిల్లి హడావిడి చేసింది. స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ కాక్‌పిట్‌లో పైలెట్, సిబ్బందిపై దాడి చేసింది. దాన్ని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో విమానం యూటర్న్ తీసుకొని సుడాన్ రాజధాని నగరమైన ఖార్టూమ్‌లోనే మరలా దిగాల్సి వచ్చింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు.
ఇంతకీ విమానంలోకి పిల్లి ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ అధికారులకు అంతుపట్టడం లేదు. ఒకవేళ ఫ్లైట్‌ను ముందురోజు రాత్రి విమానాశ్రయంలో ఉంచినప్పుడు చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందని, లేదా లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వరి కంటా పడకుండా ఆన్ బోర్డ్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఓ జంతువు కారణంగా మధ్య గాలి గందరగోళానికి ఒక దొంగ జంతువు కారణం కావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా అహ్మదాబాద్ నుండి జైపూర్‌కు ప్రయాణించాల్సిన గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. వీటి కారణంగా విమానం సుమారు 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment